నోటిఫికేషన్స్‌

హైదరాబాద్‌ బాలానగర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ 2023 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ అండ్‌ క్యాడ్‌/ క్యామ్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 04 Oct 2023 00:51 IST

ప్రవేశాలు
సీఐటీడీ, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా

హైదరాబాద్‌ బాలానగర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ 2023 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ అండ్‌ క్యాడ్‌/ క్యామ్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.

అర్హత: బీఈ, బీటెక్‌ (మెకానికల్‌/ ప్రొడక్షన్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

కోర్సు వ్యవధి: 18 నెలలు (3 సెమిస్టర్లు).

ప్రవేశ విధానం: ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ ప్రాతిపదికన సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీలకు రూ.350; ఇతరులకు రూ.700.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 31-10-2023.

ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీ: 11-11-2023.

వెబ్‌సైట్‌: https://www.citdindia.org/


కాళోజీ వర్సిటీలో ఎంపీటీ కోర్సు  

రంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ 2023-24 విద్యాసంవత్సరానికి వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (ఎంపీటీ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: బీపీటీ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై, 30-09-2023లోపు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసివుండాలి.

ఎంఎస్సీ నర్సింగ్‌  

కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: కనీసం 55% మార్కులతో బీఎస్సీ (నర్సింగ్‌) లేదా పోస్ట్‌ బీఎస్సీ (నర్సింగ్‌)తో పాటు అయిదేళ్ల పని అనుభవం.

ఈ రెండు కోర్సులకూ...

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 7-10-2023.

వెబ్‌సైట్‌: https://www.knruhs.telangana.gov.in/


ఉద్యోగాలు

సైనిక్‌ స్కూల్‌ కొడగులో ఆర్ట్‌ మాస్టర్‌, వార్డెన్‌లు

కర్ణాటకలోని సైనిక్‌ స్కూల్‌ కొడగు ఒప్పంద ప్రాతిపదికన 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఆర్ట్‌ మాస్టర్‌: 1

బ్యాండ్‌ మాస్టర్‌: 1

వార్డెన్‌: 4

పీఈఎం/ పీటీఐ కమ్‌-మాట్రాన్‌ (ఫీమేల్‌): 1

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

ఎంపిక: పోస్టును అనుసరించి రాత పరీక్ష/ నైపుణ్య/ ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్‌, సైనిక్‌ స్కూల్‌ కొడగు’ చిరునామాకు పంపించాలి.  

దరఖాస్తుకు చివరి తేదీ: 20-10-2023.

వెబ్‌సైట్‌: www.sainikschoolkodagu.edu.in/


ఎస్‌సీటీఐఎంఎస్‌టీ, తిరువనంతపురంలో టీచింగ్‌ పోస్టులు

తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌సీటీఐఎంఎస్‌టీ) 5 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (ఇమేజింగ్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్వెన్షన్‌ రేడియాలజీ): 1  

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (న్యూరాలజీ): 2  

అడ్మినిస్ట్రేటివ్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 1  

సీనియర్‌ పర్చేజ్‌ అండ్‌ స్టోర్స్‌ ఆఫీసర్‌-ఎ: 1

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.750. పీహెచ్‌/ మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18.10.2023.

హార్డ్‌ కాపీ దరఖాస్తుకు చివరి తేదీ: 20.10.2023.

వెబ్‌సైట్‌:www.sctimst.ac.in/


ఆప్టెల్‌ లిమిటెడ్‌లో సీనియర్‌ మేనేజర్‌లు

దేహ్రాదూన్‌లోని ఇండియా ఆప్టెల్‌ లిమిటెడ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 4 సీనియర్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) మెంబర్‌ లేదా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎంఏఐ) మెంబర్‌ అయి ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘వర్క్స్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), ఇండియా ఆప్టెల్‌ లిమిటెడ్‌, ఓఎఫ్‌ఐఎల్‌ క్యాంపస్‌, దేహ్రాదూన్‌ (ఉత్తరాఖండ్‌)’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌/ న్యూస్‌పేపర్‌లలో ప్రకటన వెలువడిన సెప్టెంబరు 30 నుంచి 15 రోజుల్లోగా పంపాలి.

వెబ్‌సైట్‌: https://www.indiaoptel.in/careersnjobs/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని