నొటిఫికేషన్స్

భోపాల్‌లోని ఎయిమ్స్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 233 గ్రూప్‌-సి నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 05 Oct 2023 00:05 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎయిమ్స్‌లో గ్రూప్‌-సి నాన్‌ ఫ్యాకల్టీ

పోస్టులు 233

భోపాల్‌లోని ఎయిమ్స్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 233 గ్రూప్‌-సి నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • సోషల్‌ వర్కర్‌: 2
  • ఆఫీస్‌/ స్టోర్స్‌ అటెండెంట్‌ (మల్టీ టాస్కింగ్‌): 40  
  • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 32
  • స్టెనోగ్రాఫర్‌: 34
  • డ్రైవర్‌ (ఆర్డినరీ గ్రేడ్‌): 16
  • జూనియర్‌ వార్డెన్‌ (హౌస్‌ కీపర్‌): 10
  • డిసెక్షన్‌ హాల్‌ అటెండెంట్లు: 8
  • అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌: 2  
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌: 2  
  • జూనియర్‌ స్కేల్‌ స్టెనో (హిందీ): 1
  • సెక్యూరిటీ-కమ్‌-ఫైర్‌ జమాదార్‌: 1
  • స్టోర్‌ కీపర్‌-కమ్‌-క్లర్క్‌: 85 

అర్హతలు: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 10+2, డ్రైవింగ్‌ లైసెన్స్‌, డిగ్రీ.
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రూ.1200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ రూ.600.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 06.10.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30.10.2023.

వెబ్‌సైట్‌: aiimsbhopal.edu.in/index_controller/career


టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌లు

పోస్టులు  14

బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఉడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ- 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నికల్‌ అసిస్టెంట్‌: 3
విభాగాలు:
కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ.

టెక్నీషియన్‌: 10  
విభాగాలు:
మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌, బాయిలర్‌మ్యాన్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌.

డ్రైవర్‌ (ఆర్డినరీ గ్రేడ్‌): 1

అర్హత: మెట్రిక్యులేషన్‌, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ.
వయసు: డ్రైవర్‌ పోస్టులకు 18-27 ఏళ్ల మధ్య, ఇతర పోస్టులకు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘డైరెక్టర్‌, ఐడబ్ల్యూఎస్‌టీ, మల్లేశ్వరం, బెంగళూరు’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-10-2023.

వెబ్‌సైట్‌: iwst.icfre.gov.in


టీఐఎఫ్‌ఆర్‌, ముంబయిలో క్లర్క్‌ ట్రైనీలు

పోస్టులు  5

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌- 5 క్లర్క్‌ ట్రైనీ పోస్టులను భర్తీ చేయబోతోంది.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిగ్రీతో పాటు టైపింగ్‌ పరిజ్ఞానం, పర్సనల్‌ కంప్యూటర్‌/ అప్లికేషన్‌ వినియోగంపై అవగాహన.
వయసు: 28 సంవత్సరాలు మించకూడదు.
నెలవారీ స్టైపెండ్‌: రూ.22000.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
వాక్‌-ఇన్‌-సెలక్షన్‌ తేదీ: 21-10-2023.
వేదిక: టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌, 1 హోమీ భాభా రోడ్‌, నేవీ నగర్‌, కొలాబా, ముంబయి.

వెబ్‌సైట్‌: www.tifr.res.in/Notices/view_category_notices.php?nbid=3


ఇంటర్వ్యూ

ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌, హ్యాండీమ్యాన్‌లు

పోస్టులు  323

కొచ్చిన్‌లోని ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 323 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • జూనియర్‌ ఆఫీసర్‌- టెక్నికల్‌: 5  
  • ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌/యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌: 39  
  • హ్యాండీమ్యాన్‌/ హ్యాండీ ఉమన్‌: 279

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో డిప్లొమా, డిగ్రీ.
వయసు: 28 సంవత్సరాలు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: జూనియర్‌ ఆఫీసర్‌ టెక్నికల్‌ అండ్‌ ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌/ యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌ పోస్టులకు: 17-10-2023.
హ్యాండీమ్యాన్‌/ హ్యాండీ ఉమన్‌: 18, 19-10-2023.
వేదిక: శ్రీ జగన్నాథ్‌ ఆడిటోరియం, వెంగూర్‌ దుర్గా దేవి టెంపుల్‌ దగ్గర, వెంగూర్‌, అంగమాలి, ఎర్నాకులం, కేరళ.

వెబ్‌సైట్‌: www.aiasl.in


ప్రవేశాలు

ఎన్‌ఐటీటీఆర్‌ చండీగఢ్‌లో పీహెచ్‌డీ

చండీగఢ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ పీహెచ్‌డీ(సెల్ఫ్‌ స్పాన్సర్డ్‌)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ అండ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌ (ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌).
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ.
సీటు కేటాయింపు: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ/ ప్రెజెంటేషన్‌ ఆధారంగా. గేట్‌/ నెట్‌ తదితర జాతీయ ఫెలోషిప్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: రూ.1000.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-10-2023.

వెబ్‌సైట్‌: www.nitttrchd.ac.in/core/phd.php


ఐడబ్ల్యూఎస్‌టీ, బెంగళూరులో పీజీ డిప్లొమా

బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఉడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐడబ్ల్యూఎస్‌టీ) పీజీ డిప్లొమా ఇన్‌ ఉడ్‌ అండ్‌ ప్యానెల్‌ ప్రొడక్ట్స్‌ టెక్నాలజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వ్యవధి: ఒక సంవత్సరం.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్‌ డిగ్రీ (బీఎస్సీ కెమిస్ట్రీ/ ఫిజిక్స్‌/ మ్యాథమెటిక్స్‌/ అగ్రికల్చర్‌/ ఫారెస్ట్రీ/ ఇంజినీరింగ్‌ బీఈ, బీటెక్‌. సీటు కేటాయింపు: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-10-2023.
వెబ్‌సైట్‌: iwst.icfre.gov.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని