నోటిఫికేషన్స్‌

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ దేశవ్యాప్తంగా ఉన్న టీఐఎఫ్‌ఆర్‌ విభాగాలు/ కేంద్రాలు/ స్కూల్స్‌లో పీహెచ్‌డీ, ఐ-పీహెచ్‌డీ, ఎంఎస్సీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 10 Oct 2023 01:34 IST

ప్రవేశాలు

టీఐఎఫ్‌ఆర్‌లో పీహెచ్‌డీ, ఐ-పీహెచ్‌డీ, ఎంఎస్సీ  

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ దేశవ్యాప్తంగా ఉన్న టీఐఎఫ్‌ఆర్‌ విభాగాలు/ కేంద్రాలు/ స్కూల్స్‌లో పీహెచ్‌డీ, ఐ-పీహెచ్‌డీ, ఎంఎస్సీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

టీఐఎఫ్‌ఆర్‌ విభాగాలు: హెచ్‌బీసీఎస్‌ఈ ముంబయి, టీఐఎఫ్‌ఆర్‌ ముంబయి, సీఏఎం బెంగళూరు, ఐసీటీఎస్‌ బెంగళూరు, ఎస్‌సీబీఎస్‌ బెంగళూరు, టీఐఎఫ్‌ఆర్‌ హైదరాబాద్‌, ఎన్‌సీఆర్‌ఏ పుణె.

సబ్జెక్టులు: సైన్స్‌ ఎడ్యుకేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ లెర్నింగ్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ డేటా సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, అప్లైడ్‌ అండ్‌ కంప్యుటేషనల్‌ మ్యాథ్స్‌, వైల్డ్‌ లైఫ్‌ బయాలజీ అండ్‌ కన్జర్వేషన్‌, బయాలజీ, ఫిజిక్స్‌ ఆఫ్‌ లైఫ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ.

అర్హత: ప్రోగ్రామ్‌ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా. ప్రోగ్రామ్‌ను అనుసరించి గేట్‌/ నెట్‌/ జెస్ట్‌/ జేజీఈఈబీఐఎల్‌ఎస్‌ ఉత్తీర్ణులకు ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: పురుష అభ్యర్థులు రూ.1000. మహిళా అభ్యర్థులు, ఇతరులకు రూ.500.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02-11-2023.

హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 20-11-2023.

పరీక్ష తేదీ: 10-12-2023.

ప్రోగ్రామ్‌ ప్రారంభం: 01-08-2024.

వెబ్‌సైట్‌: https://www.tifr.res.in/~academics/gs_admissions.php


ఆల్‌ ఇండియా ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఎంట్రన్స్‌  

ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఆల్‌ ఇండియా ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏఐఎఫ్‌ఎస్‌ఈటీ-2023) ప్రకటన వెలువడింది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 35 యూనివర్సిటీల్లో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సుల్లో ఫీల్డ్‌ సైన్స్‌, ల్యాబొరేటరీ డేటా సైన్స్‌, మెడికల్‌ డేటా సైన్స్‌ విభాగాలుంటాయి.

పాల్గొనే వర్సిటీలు: వివేకానంద గ్లోబల్‌ విశ్వవిద్యాలయం, ఎంఏటీఎస్‌ విశ్వవిద్యాలయం (రాయ్‌పూర్‌), బహ్రా విశ్వవిద్యాలయం (షిమ్లా హిల్స్‌), ఇన్వర్టిస్‌ విశ్వవిద్యాలయం (బరేలీ), ఆర్‌ఆర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (బెంగళూరు) తదితరాలు.

1. మూడేళ్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌: బీఎస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌

అర్హత: హయ్యర్‌ సెకండరీ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ లేదా మ్యాథమెటిక్స్‌) తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

2. రెండేళ్ల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌: ఎంఎస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌

సబ్జెక్టులు: ట్రాన్స్‌పోర్ట్‌ ఫినామినా, కెమికల్‌ ఇంజినీరింగ్‌ కంప్యూటింగ్‌, అడ్వాన్స్‌డ్‌ థర్మోడైనమిక్స్‌, కెమికల్‌ రియాక్టర్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌ తదితరాలు.

అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ (ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేదా సంబంధిత సబ్జెక్టులు) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: ఆల్‌ ఇండియా ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.2000.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 28-10-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 29-10-2023. పరీక్ష ఫలితాల వెల్లడి: 31-10-2023.

వెబ్‌సైట్‌: https://aifset.com/


ఎయిమ్స్‌ జోధ్‌పుర్‌లో ఎంపీహెచ్‌  

జోధ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌- జనవరి 2024 సెషన్‌కు సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ (ఎంపీహెచ్‌) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం సీట్లు: 20  

వ్యవధి: ఫుల్‌ టైం రెండేళ్ల కోర్సు అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.800. యూఆర్‌/ ఓబీసీలకు రూ.1000.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు తేదీ: 19-10-2023.

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌: 06-11-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: నవంబర్‌ 2023.

సెషన్‌ ప్రారంభం: 11-01-2024.

వెబ్‌సైట్‌: https://aiimsjodhpur.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని