ఉద్యోగాలు

పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలోని దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ) కింది విభాగాల్లో 91 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 11 Oct 2023 03:44 IST

దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీలు  

శ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలోని దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ) కింది విభాగాల్లో 91 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ సివిల్‌/ సీ అండ్‌ ఐ/ ఐటీ/ మైనింగ్‌.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌తో పాటు గేట్‌ 2023 స్కోరు.

వయసు: 29 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: గేట్‌ 2023 స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు మినహాయింపు ఉంది). ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30.10.2023.

వెబ్‌సైట్‌: https://www.dvc.gov.in/  


సత్యజిత్‌ రే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీ  

కోల్‌కతాలోని సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 12 ఫ్యాకల్టీ, 6 టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఫ్యాకల్టీ పోస్టులు

  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌, డైరెక్షన్‌: 01  
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌, సినిమాటోగ్రఫీ: 01
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఎడిటింగ్‌: 01
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌, సౌండ్‌ రికార్డింగ్‌  డిజైన్‌: 01
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌, యానిమేషన్‌: 01
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొడ్యూసింగ్‌ ఫర్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌: 01
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డైరెక్షన్‌: 01
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సినిమాటోగ్రఫీ: 01
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎడిటింగ్‌: 01  
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌: 01  
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, యానిమేషన్‌: 01  
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రొడ్యూసింగ్‌ ఫర్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌: 01

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.

టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు  

  • టీచింగ్‌ అసిస్టెంట్‌ (సినిమాటోగ్రఫీ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా): 01  
  • టీచింగ్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌): 01  
  • టీచింగ్‌ అసిస్టెంట్‌ (రైటింగ్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా): 01  
  • టీచింగ్‌ అసిస్టెంట్‌ (సౌండ్‌ ఫర్‌ ఈడీఎం): 01  
  • టీచింగ్‌ అసిస్టెంట్‌ (ఎడిటింగ్‌ ఫర్‌ ఈడీఎం): 01  
  • టీచింగ్‌ అసిస్టెంట్‌ (డైరెక్షన్‌ అండ్‌ ప్రొడ్యూజింగ్‌ ఫర్‌ ఈడీఎం): 01  

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.10.2023.

దరఖాస్తు హార్డ్‌ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 06.11.2023.

వెబ్‌సైట్‌: https://srfti.ac.in/


టెక్నికల్‌ అసిస్టెంట్‌, డీఈవో, హెల్పర్‌ పోస్టులు  

తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌, జిల్లా కార్యాలయం తిరుపతి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. టెక్నికల్‌ అసిస్టెంట్‌. అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్‌/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ (బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్‌ సైన్సెస్‌)/ డిప్లొమా (అగ్రికల్చర్‌).

2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌. అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ.

3. హెల్పర్‌. అర్హత: ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా.

దరఖాస్తు: నోటిఫికేషన్‌ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్‌ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా ‘జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌, జీటీ రోడ్‌, తిరుపతి, తిరుపతి జిల్లా చిరునామాకు పంపాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-10-2023.

వెబ్‌సైట్‌: https://tirupati.ap.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని