ఎయిమ్స్‌ భోపాల్‌లో నాన్‌ ఫ్యాకల్టీ కొలువులు

ఎయిమ్స్‌ భోపాల్‌ 233 గ్రూప్‌-సి నాన్‌ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated : 12 Oct 2023 01:00 IST

ఎయిమ్స్‌ భోపాల్‌ 233 గ్రూప్‌-సి నాన్‌ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ పరీక్ష పాసైన అభ్యర్థులకు పోస్టును బట్టి స్కిల్‌ టెస్ట్‌ కూడా నిర్వహిస్తారు.

మొత్తం 233 పోస్టుల్లో.. సోషల్‌ వర్కర్‌-2, ఆఫీస్‌/స్టోర్స్‌ అటెండెంట్‌ (మల్టీటాస్కింగ్‌)-40, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-32, స్టెనోగ్రాఫర్‌-34, డ్రైవర్‌-16 (ఆర్డినరీ గ్రేడ్‌), జూనియర్‌ వార్డెన్‌-10 (హౌస్‌ కీపర్‌), డిసెక్షన్‌ హాల్‌ అటెండెంట్స్‌-8, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌-2, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-ఎ-2, జూనియర్‌ స్కేల్‌ స్టెనో (హిందీ)-1, సెక్యూరిటీ కమ్‌ ఫైర్‌ జమదర్‌-1, స్టోర్‌ కీపర్‌ కమ్‌ క్లర్క్‌-85 ఉన్నాయి. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌ అభ్యర్థులకు 105, ఓబీసీలకు 59, ఎస్సీలకు 33, ఎస్సీలకు 15, ఓబీసీలకు 21 కేటాయించారు.

ఏ అర్హతలు ఉండాలి?

సోషల్‌వర్కర్‌:  10+2 పాసై, 8 ఏళ్ల అనుభవం.. వయసు 18-35..

ఆఫీస్‌/స్టోర్స్‌ అటెండెంట్‌ (మల్టీటాస్కింగ్‌): పదోతరగతి, ఐటీఐ పాసవ్వాలి. వయసు 30 ఏళ్లకు మించకూడదు.

లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: ఇంటర్మీడియట్‌/తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు/హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్‌ చేయగలగాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్నవారికి ప్రాధాన్యం. వయసు 18-30.

స్టెనోగ్రాఫర్‌: ఇంటర్మీడియట్‌/తత్సమాన పరీక్ష పాసవ్వాలి. స్కిల్‌ టెస్ట్‌, 10 నిమిషాల డిక్టేషన్‌ ఉంటుంది. ఈ మేటర్‌ను ఇంగ్లిష్‌లో 50 నిమిషాలు/ హిందీలో 65 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్‌పై టైప్‌ చేయాలి. వయసు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్టోర్‌ కీపర్‌ కమ్‌ క్లర్క్‌: డిగ్రీ పాసై .. స్టోర్స్‌ నిర్వహణలో ఏడాది అనుభవం ఉండాలి. మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 30 మించకూడదు.

గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)కు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వ రెగ్యులర్‌ ఉద్యోగులకు ఐదేళ్ల మినహాయింపు ఉంటుంది. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.600.

గమనించాల్సినవి

  • ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అయితే దరఖాస్తులో సమయంలోనే పోస్టుల ప్రాధాన్యాన్ని తెలియజేయాలి. ఆ తర్వాత దీంట్లో ఎలాంటి మార్పులు చేయడానికీ అవకాశం ఉండదు. ప్రతి పోస్టుకూ వేర్వేరుగా ఫీజు చెల్లించాలి.
  • పరీక్ష కేంద్రాల వివరాలను అడ్మిట్‌ కార్డ్‌లో తెలియజేస్తారు. దీన్ని ఎయిమ్స్‌ భోపాల్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 30.10.2023

వెబ్‌సైట్‌: ‌www.aiimsbhopal.cdu.in

ప్రశ్నపత్రంలో..  

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. కంప్యూటర్‌ పరీక్ష పాసైన అభ్యర్థులకు పోస్టును బట్టి అవసరమైతే.. స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. సీబీటీలో కనీసార్హత మార్కులు 35 శాతం.

  • ప్రశ్నపత్రం 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నపత్రంలో ఆరు విభాగాలు ఉంటాయి.

1 జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ అవేర్‌నెస్‌కు 25 మార్కులు. దీంట్లో.. ఇండియన్‌ జాగ్రఫీ, జనరల్‌ సైన్స్‌ (పదో తరగతి స్థాయి), భారత ప్రభుత్వం, ప్రభుత్వ విధానాలు, జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలు, కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమికాంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

2 ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌కు 10 మార్కులు. ఈ విభాగంలోని ప్రశ్నలు అభ్యర్థి ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా.. పదోతరగతి స్థాయిలో ఉంటాయి. టెన్స్‌, వెర్బ్‌, ప్రిపొజిషన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌, కరెక్టు స్పెల్లింగ్‌ను గుర్తించడం... లాంటి ప్రశ్నలు ఇస్తారు.

3 క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు 20 మార్కులు. పదోతరగతి స్థాయిలో ఉంటుంది. యావరేజ్‌, పర్సంటేజ్‌, ప్రాఫిట్‌-లాస్‌, టైమ్‌-డిస్టెన్స్‌, టైమ్‌-వర్క్‌, కోడింగ్‌-డీకోడింగ్‌.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

4 జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీకి 25 మార్కులు. సిమిలారిటీస్‌-డిఫరెన్సెస్‌, సిరీస్‌ కంప్లీషన్‌, డైరెక్షన్‌, రిలేషన్‌షిప్స్‌, అరిథ్‌మెటికల్‌ రీజనింగ్‌, నాన్‌-వెర్బల్‌ సిరీస్‌.. మొదలైన అంశాల ప్రశ్నలు ఉంటాయి.

5 కంప్యూటర్‌ అప్లికేషన్స్‌కు సంబంధించిన ప్రాథమికాంశాలు 10 మార్కులకు ఉంటాయి. ఉదాహరణకు ఎంఎస్‌-ఆఫీస్‌, ఇంటర్నెట్‌.. మొదలైన వాటి నుంచి ప్రశ్నలు ఇస్తారు.

6 సీసీఎస్‌ (కండక్ట్‌) రూల్స్‌ 1964, సీసీఎస్‌ (లీవ్‌) రూల్స్‌ 1972 పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. వీటికి 10 మార్కులు.  

  • ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కు తగ్గిస్తారు.

సన్నద్ధత

  • బ్యాంక్‌, ఆర్‌ఆర్‌బీ.. ఇతర పోటీ పరీక్షల పాత పేపర్లను సాధన చేయడం ద్వారా కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మంచి మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది.
  • ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులను రాయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఇవి మీ సన్నద్ధతకు దిశానిర్దేశం చేస్తాయి.
  • పేపర్‌ మోడల్‌ విషయంలో అవగాహన వస్తుంది. కాబట్టి గందరగోళం లేకుండా సన్నద్ధతను కొనసాగించొచ్చు.
  • నిర్ణీత వ్యవధి లోపల ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలుగుతున్నారో తెలుస్తుంది. ఏయే అంశాల్లో మెరుగ్గా ఉన్నారో, ఎక్కడ బలహీనంగా ఉన్నారో అర్థమవుతుంది.
  • సన్నద్ధత స్థాయిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని