ప్రభుత్వ ఉద్యోగాలు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన 24 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 16 Oct 2023 03:06 IST

నిట్‌ ఏపీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్‌ వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన 24 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, సైన్సెస్‌.

అర్హత: సంబంధిత విభాగంలో ఫస్ట్‌ క్లాస్‌ బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీతో పాటు బోధన/ పరిశోధన అనుభవం.

ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ, అనుభవం, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్‌  ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13.11.2023.

దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ: 20.11.2023.

వెబ్‌సైట్‌: https://www.nitandhra.ac.in/


ప్రవేశాలు

ఎన్‌జీ రంగా వర్సిటీలో మాస్టర్స్‌, పీహెచ్‌డీ

గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి. రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ 2023-24 విద్యాసంవత్సరానికి వర్సిటీ అనుబంధ కళాశాలల్లో మాస్టర్స్‌, పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. ఎంఎస్సీ (అగ్రికల్చర్‌) 2. ఎంబీఏ (ఏబీఎం) 3. ఎంటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌) 4. ఎంఎస్సీ (కమ్యూనిటీ సైన్స్‌)

వ్యవధి: రెండేళ్లు. 5. పీహెచ్‌డీ (అగ్రికల్చర్‌) 6. పీహెచ్‌డీ (అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌) 7. పీహెచ్‌డీ (కమ్యూనిటీ సైన్స్‌) వ్యవధి: మూడేళ్లు.

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌/ మాస్టర్స్‌ డిగ్రీ.

గరిష్ట వయసు: 40 సంవత్సరాలు.

ప్రవేశం: పీజీకి డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ (ఐకార్‌) స్కోరు; పీహెచ్‌డీకి డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ (ఐకార్‌) స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీలకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03-11-2023.

దరఖాస్తు హార్డ్‌ కాపీ సమర్పణకు చివరి తేదీ: 09-11-2023.

వెబ్‌సైట్‌: https://angrau.ac.in/


ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫిమేల్‌)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్‌

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయం 27 ప్రభుత్వ/ ప్రైవేటు విద్యాసంస్థల్లో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ (ఫిమేల్‌)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సీట్ల్లు: 1,020 (ప్రభుత్వ విద్యాసంస్థల్లో 180. ప్రైవేటు సంస్థల్లో 840).

అర్హత: ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియట్‌.

ఎంపిక: ఇంటర్మీడియట్‌ మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా.

రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపు, ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-10-2023.

తరగతుల ప్రారంభం: 01-11-2023.

వెబ్‌సైట్‌:  https://chfw.telangana.gov.in/home.do


అప్రెంటిస్‌షిప్‌

యురేనియం కార్పొరేషన్‌లో...

ఝార్ఖండ్‌ రీజియన్‌ జాదుగూడ మైన్స్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసిల్‌) 243 ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

యూనిట్ల వారీగా ఖాళీలు: జాదుగూడ యూనిట్‌- 102, నర్వాపహార్‌ యూనిట్‌- 51, తురమ్దిహ్‌ యూనిట్‌- 90.

ట్రేడులు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌ (గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), టర్నర్‌/ మెషి నిస్ట్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెకానిక్‌ (డీజిల్‌/ ఎంవీ), కార్పెంటర్‌, ప్లంబర్‌.

అర్హత: మెట్రిక్యులేషన్‌/ పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ.

వయసు: 13.10.2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఐటీఐ మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ:  12.11.2023.

వెబ్‌సైట్‌: https://ucil.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని