పది పాసయ్యారా? కేంద్ర కొలువుకు పోటీపడొచ్చు!

కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 362 సెక్యూరిటీ అసిస్టెంట్‌/ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌, 315 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (జనరల్‌)..

Updated : 18 Oct 2023 03:13 IST

ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 677 పోస్టులు

కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 362 సెక్యూరిటీ అసిస్టెంట్‌/ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌, 315 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (జనరల్‌).. మొత్తం 677 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల్లో విజయవాడ సబ్సిడీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు 17, హైదరాబాద్‌ సబ్సిడీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు 15 కేటాయించారు.

677 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 404, ఓబీసీలకు 125, ఎస్సీలకు 34, ఎస్టీలకు 55, ఈడబ్ల్యూఎస్‌లకు 59 ఉన్నాయి.  

  • సెక్యూరిటీ అసిస్టెంట్‌/ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పోస్టులకు.. పదోతరగతి పాసై, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. ఏడాది పని అనుభవంతోపాటు మోటార్‌ మెకానిజం పరిజ్ఞానం ఉండాలి. వయసు 27 సంవత్సరాలు మించకూడదు.
  • ఎంటీఎస్‌ పోస్టులకు.. అభ్యర్థులు పదోతరగతి పాసవ్వాలి. వయసు 18-25 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు రుసుము రూ.500.

ఎంపిక: రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్యపరీక్ష ఆధారంగా ఎంపిక అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్‌ఏ/ఎంటీ, ఎంటీఎస్‌ అభ్యర్థులకు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు.

  • టైర్‌-1లో 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు, నాలుగు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్‌-ఎ) జనరల్‌ అవేర్‌నెస్‌ (40 మార్కులు), బి) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌  (20 మార్కులు), సి) న్యూమరికల్‌/ అనలిటికల్‌/లాజికల్‌ ఎబిలిటీ అండ్‌ రీజనింగ్‌ (20 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (20 మార్కులు). పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రతి ప్రశ్నకూ 1 మార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికీ 1/4 వంతు మార్కు తగ్గిస్తారు.
  • టైర్‌-2 పరీక్షను రెండు పోస్టులకు వేర్వేరుగా 50 మార్కులకు నిర్వహిస్తారు. ఎస్‌ఏ/ఎంటీ పోస్టులకు మోటార్‌ మెకానిజమ్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌ కమ్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇన్‌స్ట్రక్టర్‌ ఆదేశాల మేరకు అభ్యర్థులు మోటార్‌ వెహికల్‌ నడపాలి. అభ్యర్థికి ఉండే ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌నూ, చిన్న మరమ్మతులు, వాహన నిర్వహణ నైపుణ్యాన్నీ పరీక్షిస్తారు. ఈ పరీక్షలో అన్‌రిజర్వుడ్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 35 శాతం, ఓబీసీ 34, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
  • టైర్‌-2లో భాగంగా.. ఎంటీఎస్‌/జనరల్‌ అభ్యర్థులకు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ఉంటుంది. 150 పదాలతో ఇంగ్లిష్‌లో వ్యాసం రాయాలి. ఒకాబ్యులరీ, గ్రామర్‌, సెంటెన్స్‌ స్ట్రక్చర్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌, కరెక్ట్‌ యూసేజ్‌, కాంప్రహెన్షన్‌ ఉంటాయి. పరీక్ష వ్యవధి గంట. దీంట్లో 20 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
  • టైర్‌-1లో సాధించిన మార్కుల ఆధారంగానే ఎంటీఎస్‌ అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. టైర్‌-2 అనేది ఎంటీఎస్‌ అభ్యర్థులకు అర్హత పరీక్ష మాత్రమే. టైర్‌-1, టైర్‌-2లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎస్‌ఏ/ఎంటీ అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తారు.

సన్నద్ధత

బ్యాంక్‌, ఆర్‌ఆర్‌బీ.. మొదలైన పోటీ పరీక్షల్లో జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, న్యూమరికల్‌/ అనలిటికల్‌/లాజికల్‌ ఎబిలిటీ అండ్‌ రీజనింగ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి వీటికి సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను సాధన చేస్తుండాలి.

  • పరీక్ష వ్యవధి గంట. నిర్ణీత వ్యవధిలోనే పాత ప్రశ్నపత్రాలను పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. మొదట్లో సమయం ఎక్కువగా తీసుకున్నా.. సాధన ద్వారా నిర్ణీత సమయం లోపలే పూర్తిచేయడం అలవాటు అవుతుంది.
  • జనరల్‌ అవేర్‌నెస్‌కు 40 మార్కులు కేటాయించారు. దీనిపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించాలి. దీంట్లో భాగంగా చుట్టూ జరుగుతున్న అంశాల పట్ల అభ్యర్థికి ఉన్న అవగాహనను పరీక్షిస్తారు జాతీయ, అంతర్జాతీయ వార్తలను గమనిస్తుండాలి. దినపత్రికలు చదవడం, టీవీలో వార్తలు చూడటాన్ని అలవాటు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు రాయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఏయే అంశాల్లో మెరుగ్గా ఉన్నారో.. ఎక్కడ వెనకబడ్డారో తెలుస్తుంది. దీంతో బలాలు, బలహీనతలను సమీక్షించుకుని నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌.
ఈ కేంద్రాల్లో ఐదింటిని దరఖాస్తు సమయంలో ఎంపిక చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 13.11.2023

వెబ్‌సైట్‌:www.mha.gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని