ప్రభుత్వ ఉద్యోగాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ దిల్లీ స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద 25 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-1/2) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 19 Oct 2023 00:15 IST

ఐఐటీ దిల్లీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ దిల్లీ స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద 25 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-1/2) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌/ పీడబ్ల్యూబీడీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాలు: అప్లైడ్‌ మెకానిక్స్‌, ఫిజిక్స్‌, బయోకెమికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ బయోటెక్నాలజీ, టెక్స్‌టైల్‌ అండ్‌ ఫైబర్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌.

అర్హత: సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో పీహెచ్‌డీతో పాటు  అనుభవం.

ఎంపిక: విద్యార్హత, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2023.=

వెబ్‌సైట్‌: https://home.iitd.ac.in/jobsniitd/index.php


షార్‌, శ్రీహరికోటలో సైంటిస్ట్‌/ ఇంజినీర్‌లు

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌, (ఎస్‌డీఎస్‌సీ షార్‌) 10 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ రబ్బర్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ (హార్టికల్చర్‌/ ఫారెస్ట్రీ).

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంఎస్సీ.  

దరఖాస్తు రుసుము: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 03.11.2023.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 04.11.2023.

వెబ్‌సైట్‌:https://apps.shar.gov.in/sdscshar/result1.jsp


ఐఐటీ పాలక్కడ్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

కేరళ రాష్ట్రంలోని ఐఐటీ పాలక్కడ్‌ కింది 22 నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌: 09
  • జూనియర్‌ సూపరింటెండెంట్‌: 06
  • హార్టికల్చర్‌ అసిస్టెంట్‌: 01
  • అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌: 01
  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 05  

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.  

ఎంపిక: పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03-11-2023.

వెబ్‌సైట్‌: https://joinus.iitpkd.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని