నోటిఫికేషన్స్‌

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌) 100 ఫ్యాకల్టీ సభ్యుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 23 Oct 2023 04:14 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

తిరుపతి స్విమ్స్‌లో ఫ్యాకల్టీ

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌) 100 ఫ్యాకల్టీ సభ్యుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రొఫెసర్లు: (ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆఫ్తల్మాలజీ, సైకియాట్రీ): 4

అసోసియేట్‌ ప్రొఫెసర్లు : 20

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు : 76

అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఎండీ లేదా ఎంఎస్‌ లేదా డీఎన్‌బీ చేసి ఉండాలి. నిర్ణీత అనుభవం  కూడా ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2023

వెబ్‌సైట్‌: https://svimstpt.ap.nic.in/


హైదరాబాద్‌ ఎంఎస్‌ ఎంఈ టూల్‌ రూమ్‌లో..

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఫర్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ), హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూమ్‌లో ఒప్పంద ప్రాతిపదికన 6 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌ ఇంజినీర్‌- 02

డిజిటల్‌ మార్కెంటింగ్‌ ఆఫిసర్‌ - 01

టూల్‌ డిజైన్‌ ట్రైనర్‌ - 02

వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) ట్రైనర్‌ - 01

ఇంటర్య్వూ తేదీ: 28-10-2023

వెబ్‌సైట్‌: https://www.citdindia.org/


ప్రవేశాలు

కిట్టూరు రాణి చెన్నమ్మ సైనిక్‌ స్కూల్లో..

కర్ణాటక రాష్ట్రం కిట్టూరులోని కిట్టూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఫర్‌ గాళ్స్‌ 2024-25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి అడ్మిషన్లకు బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఆల్‌ ఇండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తోంది.

అర్హతలు: అయిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. జూన్‌ 1, 2012 నుంచి మే 31, 2014 మధ్యలో (రెండు తేదీలను కలిపి) జన్మించి ఉండాలి.

అడ్మిషన్‌ విధానం: జాతీయ స్థాయిలో రాత పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. అందులో అర్హత పొందినవారికి ఇంటర్య్వూ, ఫిజికల్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్టులుంటాయి.

పరీక్ష తేదీ: 28 జనవరి, 2024. పెన్ను, పేపర్‌ (ఆఫ్‌ లైన్‌) పద్ధతిలో పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్‌, కన్నడ భాషల్లో నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు: కిట్టూరు, విజయపుర్‌, బెంగళూరు, కలబుర్గి (కర్ణాటక)

పరీక్ష ఫీజు: సాధారణ అభ్యర్థులకు రూ. 2000. ఎస్సీ ఎస్టీలకు (కర్ణాటకలో నివసిస్తున్న వారికి మాత్రమే) రూ. 1600 .

దరఖాస్తు: ఆన్‌లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ: 30, అక్టోబరు 2023న ప్రారంభమవుతుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 15 డిసెంబరు, 2023.

వెబ్‌సైట్‌: www.kittursainikschool.org


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని