టీఎంబీలో ప్రొబేషనరీ క్లర్కులు

తమిళనాడు మర్చంటైల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (టీఎంబీ) ప్రొబేషనరీ క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated : 01 Nov 2023 04:38 IST

తమిళనాడు మర్చంటైల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (టీఎంబీ) ప్రొబేషనరీ క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 72 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 17, తెలంగాణకు 7 కేటాయించారు. డిగ్రీ పాసైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

భ్యర్థులు 31.08.2023 నాటికి ఏదైనా డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఉద్యోగానుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. కానీ అది తప్పనిసరికాదు. అభ్యర్థి డిగ్రీ చదివితే 24 ఏళ్లు, పీజీ చదివితే 26 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో బీసీలకు రెండేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.600 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి.

ఎంపిక: ఫేజ్‌-1లో జరిగే ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఫేజ్‌-2లోని ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. రాత పరీక్ష ఐబీపీఎస్‌ ప్రొబేషనరీ క్లర్క్‌ స్థాయిలో ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష: ఈ పరీక్షలో 5 సెక్షన్లు ఉంటాయి.

1) రీజనింగ్‌. 40 ప్రశ్నలకు 40 మార్కులు

2) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌. 40 ప్రశ్నలకు 40 మార్కులు

3) కంప్యూటర్‌ నాలెడ్జ్‌. 40 ప్రశ్నలకు 40 మార్కులు

4) జనరల్‌ అవేర్‌నెస్‌ (బ్యాంకింగ్‌). 40 ప్రశ్నలకు 40 మార్కులు

5) న్యూమరికల్‌ ఎబిలిటీ. 40 ప్రశ్నలకు 40 మార్కులు

మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు

వ్యవధి 120 నిమిషాలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్షకు 7-10 రోజుల ముందు కాల్‌లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఏయే అంశాలు?

1) రీజనింగ్‌లో గ్రూపింగ్‌ ఐడెంటికల్‌ ఫిగర్స్‌, మిర్రర్‌ ఇమేజస్‌, నంబర్‌ సిరీస్‌, ఫిగర్‌ మ్యాట్రిక్స్‌ క్వశ్చన్స్‌, ఆల్ఫబెట్‌ సిరీస్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, ప్రాబ్లమ్‌ ఆన్‌ ఏజ్‌ కాలిక్యులేషన్‌, డెసిషన్‌ మేకింగ్‌, అనాలజీ, నాన్‌వెర్బల్‌ సిరీస్‌, వెన్‌ డయాగ్రమ్‌, నంబర్‌ ర్యాంకింగ్‌, కోడింగ్‌-డీకోడింగ్‌.. మొదలైన అంశాలు ఉంటాయి.

2) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో జంబుల్‌ వర్డ్‌, పాసేజ్‌ మేకింగ్‌, సెంటెన్స్‌ ఫ్రేమింగ్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌, స్పాటింగ్‌ ఎర్రర్‌, గ్రామర్‌ అండ్‌ఒకాబ్యులరీ, ప్రిపొజిషన్‌, కాంప్రహెన్షన్‌ మొదలైన అంశాలు.

3) జనరల్‌ అవేర్‌నెస్‌లో కరెంట్‌ అఫైర్స్‌ (జాతీయ, అంతర్జాతీయ), బడ్జెట్‌- పంచవర్ష ప్రణాళికలు, ప్రధాన ఆర్థికాంశాలు/వార్తలు, క్రీడలు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు, అబ్రివేషన్స్‌, సైన్స్‌ ఆవిష్కరణలు.. మొదలైనవి.

4) కంప్యూటర్‌ నాలెడ్జ్‌లో కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఎంఎస్‌-వర్డ్‌ అండ్‌ ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌ విండోస్‌కు సంబంధించిన అంశాలు.

5) న్యూమరికల్‌ ఎబిలిటీలో పర్సెంటేజ్‌, టైమ్‌-డిస్టెన్స్‌, ప్రాఫిట్‌-లాస్‌, టైమ్‌-వర్క్‌, నంబర్‌ సిస్టమ్‌, డెసిమల్‌ ఫ్రాక్షన్స్‌, రేషియో అండ్‌ ప్రపోర్షన్స్‌, యావరేజ్‌, హెచ్‌సీఎఫ్‌, ఎల్‌సీఎం, ఆల్జీబ్రా, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, మెన్సురేషన్‌.. మొదలైనవి.

ఫేజ్‌-2లో పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఎక్కడ జరిగేదీ కాల్‌ లెటర్‌ ద్వారా తెలియజేస్తారు. అభ్యర్థి ఒకసారి ఎంపిక చేసుకున్న పరీక్ష కేంద్రాన్ని తర్వాత మార్చడానికి వీలుండదు.  


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్‌.


సన్నద్ధత

బ్యాంక్‌, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ.. మొదలైన పోటీ పరీక్షల పాత ప్రశ్న పత్రాలను పూర్తిచేయడం ద్వారా ఈ పరీక్షపైన అవగాహన పెంచుకోవచ్చు.

  • వ్యవధి లోపల అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం ఇక్కడ ప్రధానం. కాబట్టి సమయాన్ని నిర్దేశించుకుని ప్రశ్నపత్రాన్ని పూర్తిచేయడం సాధన చేయాలి. మొదట్లో నిర్ణీత సమయంలోగా ప్రశ్నలన్నింటికీ సమాధానాలు గుర్తించలేకపోవచ్చు. కానీ సాధన చేయడం ద్వారా క్రమంగా పట్టుసాధించగలుగుతారు.
  • ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే నమూనా పరీక్షలు రాయడం ద్వారా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వీటి ద్వారా ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుస్తుంది. సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకునే అవకాశం ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 06.11.2023

ఆన్‌లైన్‌ పరీక్ష: నవంబరు 2023

పరీక్ష ఫలితాలు: డిసెంబరు 2023

ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌: డిసెంబరు 2023/ జనవరి 2024

ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: జనవరి 2024

వెబ్‌సైట్‌: www.tmbnet.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని