487 ఆరోగ్య కొలువులు

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌’ వివిధ నగరాల్లోని వైద్య సంస్థల్లో 487 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. న్యూదిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నైలలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి.

Updated : 15 Nov 2023 07:05 IST

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌’ వివిధ నగరాల్లోని వైద్య సంస్థల్లో 487 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. న్యూదిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నైలలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి.

ప్రకటించిన పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఉద్యోగాలు: రిసెర్చ్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫీల్డ్‌ వర్కర్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ క్లర్క్‌, ఫిజియోథెరపిస్ట్‌, మెడికల్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, ఎక్స్‌రే టెక్నీషియన్‌, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్‌, యానిమల్‌ అటెండెంట్‌, లైబ్రరీ క్లర్క్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్స్‌), పారామెడికల్‌ వర్కర్‌, వర్క్‌షాప్‌ అటెండెంట్‌ మొదలైన 487 పోస్టులు ఆరోగ్యకేంద్రాల్లో ఉన్నాయి.

దరఖాస్తు ఫీజు రూ.600. మహిళలకు, ఎసీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

గరిష్ఠ వయసు ఉద్యోగాన్ని బట్టి మారుతుంది. కొన్ని పోస్టులకు 25 ఏళ్లు, కొన్నిటికి 27 సంవత్సరాలు. మరికొన్నిటికి 30 ఏళ్లుగా నిర్ణయించారు. గరిష్ఠ వయసులో.. ఓబీసీలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, ఎస్సీ,ఎస్టీలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పది నుంచి పదిహేనేళ్ల మినహాయింపు ఉంది.

ఏ అర్హతలు?

హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌: 70 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌/ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌/ శానిటరీ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ డిప్లొమా పాసవ్వాలి. లేదా పన్నెండో తరగతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌/ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌/ శానిటరీ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ డిప్లొమా పాసవ్వాలి. రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.

ఫీల్డ్‌ వర్కర్‌: 140 ఖాళీలు ఉన్నాయి. పదోతరగతి పాసైనవారు అర్హులు. గరిష్ఠ వయసు 25 సంవత్సరాలు.

ల్యాబొరేటరీ అటెండెంట్‌: 69 ఉద్యోగాలు ఉన్నాయి. పదో తరగతి పాసవ్వాలి. మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నిక్స్‌/యానిమల్‌ కేర్‌/ల్యాబొరేటరీ యానిమల్‌ కేర్‌/ప్రొడక్షన్‌ ఆఫ్‌ ఇమ్యునొబయలాజికల్‌ అండ్‌ యానిమల్‌ కేర్‌/వెటరినరీ ల్యాబొరేటరీ టెక్నాలజీలో ఏడాది ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ లేదా ఏడాది డిప్లొమా ఉండాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.

నర్సింగ్‌ ఆఫీసర్‌: 16 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్‌ పాసవ్వాలి. నర్స్‌/నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌గా రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అవ్వాలి. లేదా జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ డిప్లొమా చేసి రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌లో నర్స్‌/నర్స్‌ అండ్‌ మిడ్‌వైఫ్‌గా రిజిస్టర్‌ అవ్వాలి. 50 పడకల హాస్పిటల్‌లో సంవత్సరంపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.

పరీక్ష కేంద్రాలు: దిల్లీ అండ్‌ ఎన్‌సీఆర్‌, చైన్నె, బెంగళూరు, ముంబయి, లక్నో, రాంచీ, చండీగఢ్‌, గువహటి, కోల్‌కతా.

దరఖాస్తుకు చివరితేదీ: 30.11.2023

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01.12.2023

అడ్మిట్‌కార్డ్‌ డౌన్‌లోడింగ్‌: డిసెంబరు మొదటివారం, 2023

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: డిసెంబరు రెండోవారం, 2023

డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌: డిసెంబరు నాలుగోవారం, 2023

వెబ్‌సైట్‌: https://aiihph.gov.in/


పరీక్ష ఎలా ఉంటుంది?

ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది. 60 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకూ 4 మార్కుల చొప్పున కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. పరీక్ష తేదీని వెబ్‌సైట్‌, అడ్మిట్‌కార్డుల ద్వారా తెలియజేస్తారు.

  • ప్రశ్నలు కనీస విద్యార్హతల సబ్జెక్టుల నుంచే వస్తాయి. కాబట్టి సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాల మీద పట్టు సాధించాలి. అన్నీ చదివిన విషయాలేనని అశ్రద్ధ చేయకుండా సన్నద్ధత కొనసాగించాలి.
  • 60 ప్రశ్నలకు 60 నిమిషాల్లోనే సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నిమిషం వ్యవధి మాత్రమే ఉంటుంది. కాబట్టి సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా వేగంగా గుర్తించగలగాలి. తగిన పరిజ్ఞానం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దశగా కృషిని కొనసాగించాలి.
  • రుణాత్మక మార్కులు ఉన్నాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. బాగా తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలను గుర్తించాలి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని