పుట్టగొడుగులపై శిక్షణ ఎక్కడ?

ఇంటర్‌మీడియట్‌ (బైపీసీ) చదువుతున్నాను. పోషకాలను అందించే పుట్టగొడుగుల పెంపకం, మార్కెటింగ్‌కు సంబంధించి సర్టిఫికెట్‌ కోర్సులున్నాయా? 

Updated : 20 Nov 2023 00:41 IST

ఇంటర్‌మీడియట్‌ (బైపీసీ) చదువుతున్నాను. పోషకాలను అందించే పుట్టగొడుగుల పెంపకం, మార్కెటింగ్‌కు సంబంధించి సర్టిఫికెట్‌ కోర్సులున్నాయా? 

కిషోర్‌  

  • పుట్టగొడుగుల పెంపకంపై మనదేశంలో చాలా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ శిక్షణను అందిస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ టెక్నాలజీ, గ్రేటర్‌ నోయిడా మష్రూమ్‌ కల్టివేషన్‌లో ఆరునెలల సర్టిఫికెట్‌ కోర్సును అందిస్తుంది. ఐసీఏఆర్‌- డైరెక్టొరేట్‌ ఆఫ్‌ మష్రూమ్‌ రీసెర్చ్‌ ఆరు రోజుల శిక్షణను నిర్వహిస్తున్నారు. ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చరల్‌ రీసెర్చ్‌, బెంగళూరు మష్రూమ్‌ స్పాన్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మష్రూమ్‌ కల్టివేషన్‌లో ఆరు రోజుల ఆన్‌లైన్‌ శిక్షణ ప్రోగ్రాంను అందిస్తుంది. ఇవే కాకుండా, మనదేశంలోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలూ పుట్టగొడుగుల పెంపకంపై ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ కోర్సులు నిర్వహిస్తున్నాయి. చాలా సంప్రదాయ యూనివర్సిటీలు/ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కూడా పుట్టగొడుగుల గురించి సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తున్నాయి. యుడెమీ లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లోనూ పుట్టగొడుగుల పెంపకంపై చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని