నోటిఫికేషన్స్‌

నవరత్న సంస్థల్లో ఒకటైన ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీఐఎల్‌) వివిధ విభాగాల్లో 295 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Updated : 21 Nov 2023 02:33 IST
ఉద్యోగాలు
ఎన్‌ఎల్‌సీఐఎల్‌లో 295 ఖాళీలు
వరత్న సంస్థల్లో ఒకటైన ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీఐఎల్‌) వివిధ విభాగాల్లో 295 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
విభాగాల వారీ ఖాళీలు: మెకానికల్‌ 120, ఎలక్ట్రికల్‌ 109, సివిల్‌ 28, మైనింగ్‌ 17, కంప్యూటర్‌ 21.
అర్హత: సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో బీఈ/బీటెక్‌ 60 (ఎస్సీ, ఎస్టీలు 50) శాతం మార్కులతో పూర్తిచేయాలి. అలాగే గేట-2023లో అర్హత పొందాలి.
ఎంపిక: గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూలతో వేతనం: ఏడాదికి రూ.13.32 లక్షలు
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: నవంబరు 22 ఉదయం 10 గంటల నుంచి
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు: డిసెంబరు 21 సాయంత్రం 5 గంటల వరకు
దరఖాస్తు ఫీజు: రూ.854. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.354.
వెబ్‌సైట్‌: https://www.nlcindia.in/
ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, బ్లాక్‌ కోఆర్డినేటర్‌లు
రసరావుపేటలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన పల్నాడు జిల్లాలో 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01
2. బ్లాక్‌ కోఆర్డినేటర్‌: 09  
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం.
వయసు: 25-42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు జిల్లా ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.18,000. బ్లాక్‌ కోఆర్డినేటర్‌కు రూ.20,000.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బరంపేట, నరసరావుపేట, పల్నాడు జిల్లా’ చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2023.
వెబ్‌సైట్‌: https://palnadu.ap.gov.in/ 
ల్యాబ్‌ అటెండెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌లు
కుటుంబ, వైద్యారోగ్య సంక్షేమ శాఖ తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్‌/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 26 ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఉద్యోగాలు: ఎలక్ట్రీషియన్‌, మెకానిక్‌, ల్యాబ్‌ అటెండెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, నర్సింగ్‌ ఆర్డర్లీ, మార్చురీ మెకానిక్‌, డీఈఓ, జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీడీసీఏ.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్‌ కార్యాలయం, ఎస్వీ మెడికల్‌ కళాశాల, తిరుపతి’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2023.
వెబ్‌సైట్‌: https://tirupati.ap.gov.in/ 
స్కాలర్‌షిప్‌లు
ఎన్టీఆర్‌ గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌
ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ-2024)ను డిసెంబర్‌ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థ వెల్లడించింది. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నారు.
అర్హులు: పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు.
పరీక్ష: ఆబ్జెక్టివ్‌ టైప్‌ విధానంలో జరుగుతుంది. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి 2 గంటలు.
పరీక్షాంశాలు: మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌, ఇంగ్లిష్‌, కరెంట్‌ అఫైర్స్‌, జీకే, పదో తరగతి స్థాయి రీజనింగ్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2023.
పరీక్ష తేదీ: 17-12-2023.
స్థలం: ఎన్టీఆర్‌ జూనియర్‌ మహిళా కళాశాల, చిలుకూరు బాలాజీ టెంపుల్‌ రోడ్‌, హిమాయత్‌ నగర్‌ గ్రామం, మొయినాబాద్‌ మండలం, ఆర్‌ఆర్‌ జిల్లా.
వెబ్‌సైట్‌: https://ntrtrust.org/ntr-gest-scholarship/

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని