నోటిఫికేషన్స్‌

ఒడిశా భువనేశ్వర్‌లోని ఒడిశా బయోడైవర్సిటీ బోర్డు.. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 22 Nov 2023 00:04 IST
ప్రభుత్వ ఉద్యోగాలు
ఒడిశా బయోడైవర్సిటీ బోర్డులో ..
డిశా భువనేశ్వర్‌లోని ఒడిశా బయోడైవర్సిటీ బోర్డు.. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో 2. జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో
మొత్తం ఖాళీలు: 25
అర్హత: ఎంఎస్సీ (జువాలజీ, వైల్డ్‌లైఫ్‌, బయోటెక్నాలజీ, బయోడైవర్సిటీ, అగ్రికల్చర్‌, బోటనీ, మైక్రోబయాలజీ)తో పాటు పరిశోధనానుభవం.
నెలకు జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలోకు రూ.20,00; సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలోకు రూ.23,000 చెల్లిస్తారు.
ఎంపిక: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 03-12-2023.
వెబ్‌సైట్‌: https://www.odishabiodiversityboard.in/
మహాత్మాగాంధీ వర్సిటీలో టీచింగ్‌ ఖాళీలు
బిహార్‌ రాష్ట్రం మోతిహరిలోని మహాత్మాగాంధీ సెంట్రల్‌ యూనివర్సిటీ (ఎంజీసీయూ), సోషల్‌ సైన్సెస్‌ విభాగం... కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. ప్రొఫెసర్‌ 2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 3. అసోసియేట్‌ ప్రొఫెసర్‌
మొత్తం ఖాళీలు: 13.
విభాగాలు: ఎకనామిక్స్‌, గాంధీయన్‌ అండ్‌ పీస్‌ స్టడీస్‌, సోషల్‌ వర్క్‌, సోషియాలజీ, పొలిటికల్‌ సైన్సు.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌తో పాటు బోధన/ పరిశోధనానుభవం.
వేతన శ్రేణి: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200 - 2,18,200. అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,31,400-2,17,100. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.57,700-1,82,400.
దరఖాస్తు ఫీజు: రూ.2,000. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 02-12-2023.
వెబ్‌సైట్‌: https://mgcub.ac.in/
తమిళనాడు నేషనల్‌ లా వర్సిటీలో ..  
మిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్‌ లా యూనివర్సిటీ (టీఎన్‌ఎన్‌ఎల్‌యూ)... కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. ప్రొఫెసర్‌ 2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
విభాగాలు: లా, నాన్‌-లా.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ.
మూల వేతనం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రూ.1,31,400, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రూ. 57,700.
దరఖాస్తు ఫీజు: రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను తమిళనాడు నేషనల్‌ లా యూనివర్సిటీ, తిరుచిరాపల్లి, తమిళనాడు రాష్ట్రం చిరునామాకు పంపాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 18-12-2023.
వెబ్‌సైట్‌: https://www.tunlu.ac.in

వాక్‌-ఇన్‌

తితిదేలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)- ఒప్పంద ప్రాతిపదికన తితిదే ఆసుపత్రుల్లో 8 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. ఎండీ/ ఎంఎస్‌కు ప్రాధాన్యం ఉంటుంది.
నెలకు రూ.53,495 చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: 29-11-2023. వేదిక: ఎస్‌వీఈటీఏ బిల్డింగ్‌, తిరుపతి.

వెబ్‌సైట్‌: https://www.tirumala.org/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని