ఎన్‌ఐటీ పట్నాలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

పోస్టులను అనుసరించి విద్యార్హతలు, గరిష్ఠ వయసులో తేడాలు ఉంటాయి. అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యమిస్తారు. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా స్క్రీనింగ్‌ నిర్వహించి అభ్యర్థుల షార్ట్‌ లిస్ట్‌ను తయారుచేస్తారు.

Updated : 22 Nov 2023 05:04 IST
పట్నాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) రెగ్యులర్‌ ప్రాతిపదికన 47 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. స్క్రీనింగ్‌, రాత/ స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టులను అనుసరించి విద్యార్హతలు, గరిష్ఠ వయసులో తేడాలు ఉంటాయి. అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యమిస్తారు. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా స్క్రీనింగ్‌ నిర్వహించి అభ్యర్థుల షార్ట్‌ లిస్ట్‌ను తయారుచేస్తారు. ఎంపికలో భాగంగా స్క్రీనింగ్‌, ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌, మల్టిపుల్‌ ఛాయిస్‌ క్వశ్చన్స్‌ (ఎంసీక్యూ) అండ్‌ డిస్క్రిప్టివ్‌/ షార్ట్‌ ఆన్సర్‌ టెస్ట్‌లు ఉంటాయి. వీటి వివరాలను వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు.
సూపరింటెండెంట్‌: 05 ఖాళీలు. ఏదైనా డిగ్రీ మొదటి తరగతిలో పాసవ్వాలి. లేదా పీజీ రెండో తరగతిలో పాసవ్వాలి. ట్యాలీ అండ్‌ అకౌంటింగ్‌ నాలెడ్జ్‌, కంప్యూటర్‌, స్టెనోగ్రఫీ స్కిల్స్‌ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.
టెక్నికల్‌ అసిస్టెంట్‌: సివిల్‌, ఎలక్ట్రికల్‌, కెమికల్‌ టెక్నాలజీ, సర్వర్‌ అండ్‌ నెట్‌వర్క్‌, ఎంఐఎస్‌, హార్డ్‌వేర్‌, మెకట్రానిక్స్‌, మెకానికల్‌ విభాగాల్లో 11 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. పరిశ్రమలో పనిచేసిన అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.
టెక్నీషియన్‌: వెబ్‌సైట్‌, ఎంఐఎస్‌, హార్డ్‌వేర్‌, నెట్వర్కింగ్‌, మెకట్రానిక్స్‌, కెమికల్‌ టెక్నాలజీ, మెటీరియల్‌ ఇంజినీరింగ్‌, ఈఎస్‌యూ, ఈఎంయూ, మేథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, సీఎస్‌ఈ, ఈసీఈ, సివిల్‌ విభాగాల్లో 18 ఖాళీలు ఉన్నాయి. సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి/ 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌, ఏడాది వ్యవధి ఉండే ఐటీఐ పాసవ్వాలి/ పదో తరగతి 60 శాతం మార్కులతో పాసై, రెండేళ్ల ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి/ మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి. వెబ్‌ప్రోగ్రామింగ్‌ నాలెడ్జ్‌, పీసీ/సర్వర్‌, డేటా మెయింటెనెన్స్‌ చేసేవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
జూనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌): 6 ఖాళీలు. ఇంటర్మీడియట్‌ పాసై, ఇంగ్లిష్‌ టైపింగ్‌ స్పీడ్‌ నిమిషానికి 35 పదాలు ఉండాలి. కంప్యూటర్‌ వర్డ్‌ ప్రాసెసింగ్‌, స్ప్రెడ్‌షీట్‌ నైపుణ్యం ఉండాలి. ట్యాలీ, అకౌంటింగ్‌, స్టెనోగ్రఫీ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
ఆఫీస్‌ అటెండెంట్‌: 7 ఖాళీలు. ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. కమ్యూనికేషన్‌ స్కిల్‌, రికార్డ్‌ కీపింగ్‌ పరిజ్ఞానం ఉండాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
యూఆర్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.400. ఎస్సీ/ఎస్టీలకు రూ.200. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది. డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.  
ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 28.11.2023
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29.11.2023
సపోర్టింగ్‌ డాక్యుమెంట్లతో దరఖాస్తు ప్రింటవుట్‌ సమర్పించడానికి చివరి తేదీ: 07.12.2023
వెబ్‌సైట్‌: www.nitp.ac.in

గమనించాల్సినవి

  • ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు వాటిని వేర్వేరుగా పంపాలి. ప్రతి పోస్టుకూ ప్రత్యేకంగా ఫీజు చెల్లించాలి. ఒకటికంటే ఎక్కువ ఈ-మెయిల్‌ ఐడీలను దరఖాస్తులో రాయాలి.
  • దరఖాస్తుకు విద్యార్హతలు, ఉద్యోగ అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లను జతచేసి ‘రిజిస్ట్రార్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పట్నా, అశోక్‌ రజ్‌పత్‌, పట్నా-800 005’ చిరునామాకు స్పీడ్‌/ రిజిస్టర్డ్‌ పోస్టులో పంపించాలి. కవరు మీద దరఖాస్తు చేస్తున్న ఉద్యోగం పేరును స్పష్టంగా రాయాలి.
  • అభ్యర్థుల ఎంపిక విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని