నోటిఫికేషన్స్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్‌/ రైఫిల్‌మ్యాన్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. 

Published : 27 Nov 2023 00:14 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

సాయుధ బలగాల్లో 26,146 పోస్టులు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్‌/ రైఫిల్‌మ్యాన్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. 

1. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌): 6,174  (పురుషులు- 5,211; మహిళలు- 963)

2. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌): 11,025 (పురుషులు- 9,913; మహిళలు- 1,112)

3. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌): 3,337  (పురుషులు- 3,266; మహిళలు- 71)

4. సశస్త్ర సీమాబల్‌(ఎస్‌ఎస్‌బీ): 635 (పురుషులు- 593; మహిళలు- 42)

5. ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ): 3,189  (పురుషులు- 2,694; మహిళలు- 495)

6. అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌): 1,490 (పురుషులు- 1,448; మహిళలు- 42)

7. సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌): 296 (పురుషులు- 222; మహిళలు- 74)

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.

వయసు: జనవరి 01, 2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-12-2023.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


వాక్‌-ఇన్స్‌

బెంగళూరులో టీచింగ్‌ ఉద్యోగాలు

బెంగళూరు, రాజాజీనగర్‌లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ పీజీఐఎంఎస్‌ఆర్‌ హాస్పిటల్‌... ఒప్పంద ప్రతిపాదికన 7 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రొఫెసర్‌: 01  
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 05
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 01  

విభాగాలు: ఆర్థోపెడిక్స్‌, రేడియో-డయాగ్నోసిస్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఆఫ్తల్మాలజీ, జనరల్‌ మెడిసిన్‌, పాథాలజీ.

అర్హత: మెడికల్‌ పీజీ.

వయసు: 67 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,39,607, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,59,334, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,36,889

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 01-12-2023.

వేదిక: న్యూ అకడమిక్‌ బ్లాక్‌, ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ పీజీఐఎంఎస్‌ఆర్‌, రాజాజీనగర్‌, బెంగళూరు.


జూనియర్‌ రెసిడెంట్లు

బెంగళూరు రాజాజీనగర్‌లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) మెడికల్‌ కాలేజ్‌, పీజీఐఎంఎస్‌ఆర్‌ అండ్‌ మోడల్‌ హాస్పిటల్‌... ఒప్పంద ప్రతిపాదికన 6 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఎంబీబీఎస్‌. వయసు: 30 ఏళ్లు మించకుడదు.

వేతనం: నెలకు రూ.1,10,741  

ఇంటర్వ్యూ తేదీ: 05-12-2023.

వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌, పీజీఐఎంఎస్‌ఆర్‌ అండ్‌ మోడల్‌ హాస్పిటల్‌, రాజాజీనగర్‌, బెంగళూరు.

వెబ్‌సైట్‌: https://www.esic.gov.in/recruitments


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని