సెయిల్‌లో 110 కొలువులు

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), రవుర్కెలా స్టీల్‌ ప్లాంట్‌ 110 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా ఐటీఐ అర్హతతోనే భారీ పారిశ్రామిక సంస్థలో కొలువును సాధించాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  

Updated : 30 Nov 2023 06:41 IST

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), రవుర్కెలా స్టీల్‌ ప్లాంట్‌ 110 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా ఐటీఐ అర్హతతోనే భారీ పారిశ్రామిక సంస్థలో కొలువును సాధించాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  

అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), స్కిల్‌టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

మూడు రకాల పోస్టులున్నాయి.

1. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌ ఆపరేటర్‌): 20 పోస్టులు. మెట్రిక్యులేషన్‌తోపాటు మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ కెమికల్‌/ పవర్‌ ప్లాంట్‌/ ప్రొడక్షన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో మూడేళ్ల ఫుల్‌టైమ్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి.
ఫస్ట్‌క్లాస్‌ బాయిలర్‌ అటెండెంట్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి.  వయసు 16.12.2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌-మైన్స్‌): 10 ఖాళీలు. మెట్రిక్యులేషన్‌, మూడేళ్ల ఫుల్‌టైమ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి. ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజరీ సర్టిఫికెట్‌ (మైనింగ్‌) ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి. హెచ్‌టీ/ఎల్‌టీ సిస్టమ్స్‌/ ఇన్‌స్టలేషన్‌, మెయింటెనెన్స్‌; హెచ్‌టీ/ఎల్‌టీ మెషినరీ, ఎక్యుప్‌మెంట్స్‌, గాడ్జెట్స్‌ ఇన్‌సైడ్‌/ఔట్‌సైడ్‌ ప్లాంట్స్‌, కేబుల్స్‌, ట్రాన్స్‌ఫార్మర్స్‌ పనుల్లో ఏడాది ఉద్యోగానుభవం ఉండాలి. వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

3. అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ (ట్రెయినీ): 80 పోస్టులు. మెట్రిక్యులేషన్‌, ఎలక్ట్రీషియన్‌/ ఫిట్టర్‌/ ఎలక్ట్రానిక్స్‌/ మెషినిస్ట్‌/ డీజిల్‌ మెకానిక్‌/ కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌/ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఐటీఐ (పుల్‌టైమ్‌ కోర్సు) పాసవ్వాలి. వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

  • గరిష్ఠ వయసులో ప్రత్యేక కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి. 16.12.2023 నాటికి సంబంధిత విద్యార్హతలు, పని అనుభవం ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
  • ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ పోస్టుకు జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎం/డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు రూ.150. అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ (ట్రెయినీ) పోస్టుకు జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఈఎస్‌ఎం/ డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు రూ.100.
  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. రెండు పార్టుల్లో కలిపి 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు. పార్ట్‌-1లో 50 టెక్నికల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు, పార్ట్‌-2లో 50 జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రశ్నలు ఉంటాయి.
  • పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. అన్‌రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (ఎన్‌సీఎల్‌)/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
  • దీనిలో సాధించిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో స్కిల్‌టెస్ట్‌కు ఎంపికచేస్తారు.
  • స్కిల్‌ టెస్ట్‌ అర్హత పరీక్ష మాత్రమే. సీబీటీలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
  • సీబీటీ/స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌లకు అభ్యర్థులు కాల్‌ లెటర్‌/ అడ్మిట్‌ కార్డ్‌తో హాజరుకావాలి.

గమనించాల్సినవి: అభ్యర్థులు దరఖాస్తును నింపేటప్పుడు ప్రస్తుతం వినియోగిస్తోన్న ఈమెయిల్‌ ఐడీ, సెల్‌ఫోన్‌ నంబర్లను మాత్రమే రాయాలి. వీటిని ఏడాదిపాటు మార్చకూడదు.

  • కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ను దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఒకేసారి నిర్వహిస్తారు. పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రాల వివరాలను అడ్మిట్‌ కార్డ్‌ ద్వారా తెలియజేస్తారు. ఈ సమాచారాన్ని ఈమెయిల్‌/ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అభ్యర్థికి తెలియజేస్తారు. అలాగే వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచుతారు.
  • స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌కు హాజరైనప్పుడు అభ్యర్థులు విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లను సమర్పించాలి. ఉద్యోగులైతే ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సబ్మిట్‌ చేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 16.12.2023

వెబ్‌సైట్‌: www.sail.co.in 

సన్నద్ధత ఎలా?

విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టులపై గట్టి పట్టు సాధించాలి. ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విభాగంలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.

  • జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం ఎస్‌ఎస్‌సీ లేదా ఇతర పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలు చూడొచ్చు. దాంతో ఈ విభాగంలో ప్రశ్నలు ఎలా ఉండబోతాయనే విషయంలో స్పష్టత వస్తుంది. వర్తమానాంశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా దీంట్లో మార్కులు సాధించవచ్చు. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలను గమనిస్తుండాలి. వార్తాపత్రికలు చదవడాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా జనరల్‌ అవేర్‌నెస్‌పై అవగాహన పెంచుకోవచ్చు.
  • నెగెటివ్‌ మార్కులు లేవు. కాబట్టి ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా తెలిసిన ప్రశ్నలకు జవాబులు గుర్తించి.. తర్వాత తెలియని వాటికీ ప్రయత్నించవచ్చు.
  • ఫిజికల్‌ స్టాండర్డ్‌: పురుష అభ్యర్థుల ఎత్తు 155 సెం.మీ., బరువు 45 కేజీలు ఉండాలి. ఛాతీ 75 సెం.మీ. ఉండి., గాలి పీల్చినప్పుడు 79 సెం.మీ.వరకూ పెరగాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 143 సెం.మీ., బరువు 35 కేజీలు ఉండాలి. అభ్యర్థులకు ఏ విధమైన దృష్టి, వినికిడి సమస్యలూ ఉండకూడదు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని