వైరాలజీ సంస్థలో అవకాశాలు

పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) 80 గ్రూప్‌-బి, సి, టెక్నికల్‌ నాన్‌-మినిస్టీరియల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు. 

Updated : 04 Dec 2023 02:59 IST

80 టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌ ఖాళీలు

పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) 80 గ్రూప్‌-బి, సి, టెక్నికల్‌ నాన్‌-మినిస్టీరియల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.  

మొత్తం 80 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 36, ఎస్సీలకు 11, ఎస్టీలకు 05, ఓబీసీలకు 21, ఈడబ్ల్యూఎస్‌లకు 07 కేటాయించారు. దరఖాస్తు రుసుము రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళలకు ఫీజు లేదు.

1. టెక్నికల్‌ అసిస్టెంట్‌: 49 ఖాళీలు వివిధ విభాగాల్లో ఉన్నాయి. మైక్రోబయాలజీ/ మెడికల్‌ మైక్రోబయాలజీ/ వైరాలజీ అండ్‌ ఇమ్యునాలజీ/ జువాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నీలజీ/ బయోఫిజిక్స్‌/ జెనిటిక్స్‌లో డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. వయసు 30 సంవత్సరాలు మించకూడదు.

2. టెక్నీషియన్‌-1: 31 పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్నాయి. టెక్నీషియన్‌ (ఎంఎల్‌టీ) పోస్టుకు సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ 55 శాతం మార్కులతో పాసవ్వాలి. ఏడాది వ్యవధి ఉండే డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ (డీఎంఎల్‌టీ) పాసవ్వాలి.

టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌): సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్‌ 55 శాతం మార్కులతో పాసవ్వాలి. ఏడాది వ్యవధి ఉండే ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి.

టెక్నీషియన్‌ (ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌): సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌తోపాటు 55 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌లో ఏడాది డిప్లొమా ఉండాలి.

టెక్నీషియన్‌ (రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ మెకానికల్‌): ఇంటర్మీడియట్‌ సైన్స్‌ సబ్జెక్టుతో 55 శాతం మార్కులతో పాసవ్వాలి. రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఏసీ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ఏడాది డిప్లొమా ఉండాలి. వయసు 28 సంవత్సరాలు మించకూడదు.

గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10-15 ఏళ్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేటగిరీని బట్టి 5-10 ఏళ్లు, ఎస్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, డిజేబుల్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ పర్సనల్‌కు 3-8 ఏళ్లు, ఐసీఎంఆర్‌ ఉద్యోగులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ఎలా?

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ లేదా హిందీ భాషలో ఉంటుంది. 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు 100 మార్కులు. ప్రశ్నపత్రంలో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-ఎ 30 మార్కులకు, సెక్షన్‌-బి 70 మార్కులకు ఉంటుంది. ప్రశ్నకు 1 మార్కు చొప్పున కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. వ్యవధి 90 నిమిషాలు.

సీబీటీకి 95 శాతం వెయిటేజీ, 5 శాతం వెయిటేజీ పరిశోధన/ల్యాబ్‌/ క్షేత్రస్థాయి అనుభవానికి ఉంటుంది. 1-2 ఏళ్ల అనుభవానికి 1 మార్కు, 2-4 సంవత్సరాల అనుభవానికి 2 మార్కులు, 4-6 ఏళ్ల అనుభవానికి 3 మార్కులు, 6-8 సంవత్సరాల అనుభవానికి 4 మార్కులు, 8 ఏళ్లపైన అనుభవానికి 5 మార్కులు కేటాయిస్తారు.


సెక్షన్‌-ఎలో..

1. జనరల్‌ ఇంటెలిజెన్స్‌: సిమిలారిటీస్‌, డిఫరెన్సెస్‌, అనాలిజీస్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌, జడ్జ్‌మెంట్‌, విజువల్‌ మెమరీ, అరిథ్‌మెటికల్‌ నంబర్‌ సిరీస్‌ అండ్‌ కంప్యుటేషన్‌, నాన్‌-వెర్బల్‌ సిరీస్‌, రిలేషన్‌షిప్‌ కాన్సెప్ట్స్‌, ఆబ్‌స్ట్రాక్ట్‌ ఐడియాస్‌, సింబల్స్‌-రిలేషన్‌షిప్స్‌.

2. జనరల్‌ అవేర్‌నెస్‌: కరెంట్‌ అఫైర్స్‌ అండ్‌ కరెంట్‌ ఈవెంట్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ రిలేటెడ్‌ టు హెల్త్‌, న్యూట్రిషన్‌, సైంటిఫిక్‌ రిసెర్చ్‌.

3. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: కంప్యుటేషన్‌ ఆఫ్‌ హోల్‌నంబర్స్‌, డెసిమల్స్‌, ఫ్రాక్షన్స్‌, పర్సంటేజ్‌, రేషియో అండ్‌ ప్రపోర్షన్‌, యావరేజ్‌, ఇంటరెస్ట్‌, ప్రాఫిట్‌-లాస్‌, బేసిక్‌ ఆల్జీబ్రా, టైమ్‌-డిస్టెన్స్‌, టైమ్‌-వర్క్‌, హైట్స్‌-డిస్టెన్సెస్‌, బార్‌ డయాగ్రమ్స్‌, పైచార్ట్‌, హిస్టోగ్రామ్స్‌, పాలిగాన్‌
మొదలైనవి.

4. కంప్యూటర్‌ స్కిల్స్‌: కంప్యూటర్‌ సిస్టమ్‌ బేసిక్స్‌, ఎంఎస్‌-వర్డ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌, నెట్‌వర్కింగ్‌, ఫార్ములాస్‌ రైటింగ్‌ ఇన్‌ ఎక్సెల్‌, గూగుల్‌ ఫామ్‌.

5. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: అభ్యర్థి ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించే అంశాలుంటాయి. అలాగే కాంప్రహెన్షన్‌, రైటింగ్‌ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.

సెక్షన్‌-బిలో..

గ్రాడ్యుయేషన్‌/ డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిగ్రీలో చదివిన సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇస్తారు. ఈ సెక్షన్‌కు ఎక్కువ మార్కులు కేటాయించారు. డిగ్రీ/ డిప్లొమా స్థాయిలో చదివిన సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి.

  • సెక్షన్‌-ఎలోని అంశాలపైన పట్టు సాధించడానికి వివిధ పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
  • ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే మాక్‌టెస్ట్‌లూ రాయాలి. దీంతో ఏ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయో తెలుస్తుంది. పరీక్షపై అవగాహన వస్తుంది. ముఖ్యంగా సమయ నిబంధనకు కట్టుబడి పరీక్ష రాయడం అలవాటు అవుతుంది.
  • నెగెటివ్‌ మార్కులు ఉన్నాయి. కాబట్టి బాగా తెలిసిన ప్రశ్నలకే సమాధానాలను గుర్తించాలి.

పరీక్ష కేంద్రాలు: 1.ముంబయి (ఎంఎంఆర్‌డీఏ రీజియన్‌), 2. పుణె. దరఖాస్తు సమయంలోనే వీటిని ఎంపిక చేసుకోవాలి. తర్వాత మార్చడానికి అవకాశం ఉండదు. ఇవి గ్రూప్‌-బి, సి (నాన్‌-గెజిటెడ్‌) పోస్టులు కాబట్టి వీటికి ఇంటర్వ్యూ ఉండదు.
దరఖాస్తుకు చివరి తేదీ: 10.12.2023
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌: 16, 17, డిసెంబరు 2023  
వెబ్‌సైట్‌: https://niv.recruitlive.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని