నోటిఫికేషన్స్‌

పాడేరులోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, జిల్లా కార్యాలయం- అల్లూరి సీతారామరాజు జిల్లాలో కింది సిబ్బంది నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 06 Dec 2023 00:57 IST

ఉద్యోగాలు
ఏపీఎస్సీఎస్సీఎల్‌, పాడేరులో అకౌంటెంట్లు

పాడేరులోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, జిల్లా కార్యాలయం- అల్లూరి సీతారామరాజు జిల్లాలో కింది సిబ్బంది నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • అకౌంటెంట్‌ గ్రేడ్‌-ఖిఖిఖి: 02 
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 02
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-ఖిఖిఖి: 04  

మొత్తం ఖాళీల సంఖ్య: 08.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ.

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: నెలకు అకౌంటెంట్‌కు రూ.27,000. డీఈవోకు రూ.18,500. టెక్నికల్‌ అసిస్టెంట్‌కు రూ.22,000.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ కార్యాలయం, ఏపీఎస్సీఎస్సీఎల్‌, కలెక్టరేట్‌ కాంపౌండ్‌, పాడేరు’ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 08-12-2023.

వెబ్‌సైట్‌: https://allurisitharamaraju.ap.gov.in/

ఏపీఎస్సీఎస్సీఎల్‌, భీమవరంలో..

భీమవరంలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, జిల్లా కార్యాలయం

  • పశ్చిమగోదావరి జిల్లాలో 3 పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
  • అకౌంటెంట్‌ గ్రేడ్‌-ఖిఖిఖి: 02 
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 01

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ.

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09-12-2023.

వెబ్‌సైట్‌: https://westgodavari.ap.gov.in/


అనకాపల్లి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో..

అనకాపల్లిలోని జిల్లా మహిళా శిశుసంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన అనకాపల్లి జిల్లాలో 23 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఉద్యోగాలు: డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌, అకౌంటెంట్‌, సోషల్‌ వర్కర్‌, డేటా అనలిస్ట్‌, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, అవుట్‌రీచ్‌ వర్కర్‌, డాక్టర్‌, నర్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

వయసు: 42 ఏళ్లు మించకూడదు.  

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా మహిళా, శిశుసంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, నూకాంబికా ఆలయం వద్ద, అనకాపల్లి, అనకాపల్లి జిలా’్ల చిరునామాకు పంపించాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21-12-2023.

వెబ్‌సైట్‌: https://anakapalli.ap.gov.in/ 


రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు

గుడ్‌గావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌- 6 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • ఇంజినీర్‌ (మెటలర్జీ/ మెకానికల్‌): 04
  • ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌): 02

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు పని అనుభవం.

ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.12.2023. ఇంటర్వ్యూ తేదీ: 18.12.2023.

వేదిక: రైట్స్‌ కోల్‌కతా కార్యాలయం.

వెబ్‌సైట్‌:https://www.rites.com/Career


ప్రవేశాలు

ఎస్‌ఆర్‌ఎం జాయింట్‌ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌

చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ- 2024 విద్యా సంవత్సరానికి ఎస్‌ఆర్‌ఎం జాయింట్‌ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ 2024 ద్వారా బీఈ, బీటెక్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: కనీసం 60% మార్కులు 10+2(ఫిజిక్స్‌/ మ్యాథమెటిక్స్‌/ కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఇన్ఫర్మేటిక్స్‌ ప్రాక్టీసెస్‌/ ఇంజినీరింగ్‌ గ్రాఫిక్స్‌/ బోటనీ/ జువాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక : ఎంట్రన్స్‌ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తులకు చివరి తేదీ (ఫేజ్‌ 1): 13.04.2024.

ఫేజ్‌ 1 మెయిన్స్‌: 19, 20, 21.04.2024.

దరఖాస్తులకు చివరి తేదీ (ఫేజ్‌ 2): 15.06.2024.

ఫేజ్‌ 2 మెయిన్స్‌: 21, 22, 23.06.2024.

వెబ్‌సైట్‌: https://www.srmist.edu.in/admissionnindia/engineering/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని