ఉద్యోగాలు

Updated : 07 Dec 2023 04:05 IST

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈలు

తిరుమల తిరుపతి దేవస్థానం- 4 ఏఈఈ (ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: బీఈ (ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్‌). ఏపీకి చెందిన హిందూ మతస్తులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

వయసు: 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ ఆభ్యర్థులకు ఐదేళ్లు; పీహెచ్‌ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19-12-2023.

వెబ్‌సైట్‌: https://ttd-recruitment.aptonline.in/ 


బర్డ్‌ ఆసుపత్రిలో మెడికల్‌ ఆఫీసర్‌లు

తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి- బర్డ్‌ ఆసుపత్రిలో 5 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: ఎంబీబీఎస్‌.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: ఎంబీబీఎస్‌ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18-12-2023.

వెబ్‌సైట్‌: https://www.tirumala.org/


వాక్‌-ఇన్స్‌

ఎన్‌ఐపీహెచ్‌ఎంలో రిసెర్చ్‌ ఫెలో ఖాళీలు  

హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐపీహెచ్‌ఎం)... తాత్కాలిక ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (పీహెచ్‌ఎమ్‌): 02  
  • జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (పీఎమ్‌డీ): 03  

విభాగాలు: ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, పెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌ డివిజన్‌.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ/ నెట్‌తో పాటు పని అనుభవం.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.   ఇంటర్వ్యూ తేదీ: 12-12-2023

వేదిక: ఎన్‌ఐపీహెచ్‌ఎమ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://niphm.gov.in/


చెన్నై మెడికల్‌ కాలేజ్‌లో సీనియర్‌ రెసిడెంట్లు  

చెన్నై కేకే నగర్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌- 29 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, ఆర్‌ఐసీయూ, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, ఈఎన్‌టీ, ఓబీజీవై, రేడియోడయాగ్నోసిస్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌.

అర్హత: ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ.

ఇంటర్వ్యూ తేదీలు: 12, 13-12-2023.

వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌, కె.కె.నగర్‌, చెన్నై.

వెబ్‌సైట్‌: https://mcchennai.esic.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని