ఐటీఐతో మంచి అవకాశం!

ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ), హైదరాబాద్‌ 54 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులను రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ల ద్వారా ఎంపిక చేస్తారు.

Updated : 11 Dec 2023 03:18 IST

ఎన్‌ఆర్‌ఎస్‌సీలో టెక్నీషియన్‌

ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ), హైదరాబాద్‌ 54 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులను రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ల ద్వారా ఎంపిక చేస్తారు. ఐటీఐ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునేవాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

టెక్నీషియన్‌-బి (ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌)- 33, ఎలక్ట్రికల్‌- 08, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌-09, ఫొటోగ్రఫీ-02, డెస్క్‌టాప్‌ పబ్లిషింగ్‌ ఆపరేటర్‌-02 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 54 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 27, ఓబీసీలకు 14, ఎస్సీలకు 06, ఎస్సీలకు 02, ఈడబ్ల్యూఎస్‌లకు 05 కేటాయించారు.
అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ పాసై ఉండాలి. వయసు 31.12.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూబీడీఎస్‌, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయసులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము రూ.500 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. రాత పరీక్షకు హాజరైన ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ, మహిళలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.400 తిరిగి చెల్లిస్తారు. దరఖాస్తు రుసుము కింద రూ.100 మినహాయిస్తారు.

ఏ పరీక్షలో ఏముంటాయి?

టెక్నీషియన్‌-బి పోస్టులకు రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

  • రాత పరీక్షలో 80 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నకు 1 మార్కు చొప్పున కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికీ 0.33 మార్కు తగ్గిస్తారు.
  • స్కిల్‌ టెస్ట్‌ 100 మార్కులకు ఉంటుంది. ఇది అర్హత పరీక్ష మాత్రమే. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
  •  జనరల్‌ అభ్యర్థులు.. రాత పరీక్షలో 32 మార్కులు, స్కిల్‌ టెస్ట్‌లో 50 మార్కులు,  ప్రత్యేక కేటగిరీలకు చెందిన అభ్యర్థులు.. రాత పరీక్షలో 24, స్కిల్‌ టెస్ట్‌లో 40 మార్కులు సాధించాలి.
  •  రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా.. 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను హైదరాబాద్‌లో జరిగే స్కిల్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు.
  • పరీక్ష కేంద్రాలు: కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి; తెలంగాణలోని హైదరాబాద్‌, కరీంనగర్‌లలో నిర్వహిస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులను ఎన్‌ఆర్‌ఎస్‌సీ - ఎర్త్‌స్టేషన్‌ (షాద్‌నగర్‌/బాలానగర్‌), నాగ్‌పుర్‌, న్యూదిల్లీ, కోల్‌కతా, జోధ్‌పుర్‌, బెంగళూరుల్లోని రీజినల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్లలో నియమిస్తారు.

    గమనించాల్సినవి  

  • 31.12.2023 నాటికి సంబంధిత విద్యార్థుతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు దరఖాస్తుకు అనర్హులు.
  • స్కిల్‌ టెస్ట్‌ సమాచారాన్ని అభ్యర్థి ఈమెయిల్‌ ఐడీకి తెలియజేస్తారు. వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచుతారు.
  • స్కిల్‌ టెస్ట్‌ సమయంలో ఒరిజినల్‌ డాక్యుమెంట్లను పరిశీలిస్తారు.
  • హైదరాబాద్‌లో జరిగే స్కిల్‌ టెస్ట్‌కు హాజరయ్యే ఇతర ప్రాంతాల అభ్యర్థులకు రైల్‌/బస్‌ ఛార్జీలను చెల్లిస్తారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ట్రావెలింగ్‌ అలవెన్స్‌ చెల్లించరు.
  • దరఖాస్తుకు చివరి తేదీ: 31.12.2023
  • వెబ్‌సైట్‌:www.nrsc.gov.in

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని