నోటిఫికేషన్స్

వైమానిక కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన ఏఎంఈ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ 2024 ప్రకటన వెలువడింది.

Updated : 12 Dec 2023 00:51 IST

ప్రవేశాలు

ఏఎంఈ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌

వైమానిక కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన ఏఎంఈ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ 2024 ప్రకటన వెలువడింది.

1. లైసెన్స్‌ ప్రోగ్రామ్‌: ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌, కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌.

2. ఇంజినీరింగ్‌: ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌.

3. గ్రాడ్యుయేషన్‌: బీబీఏ (ఏవియేషన్‌), బీఎస్సీ (ఏఎంఈ)

4. సర్టిఫికెట్‌: క్యాబిన్‌ క్రూ, ఎయిర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఎయిర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ స్టాఫ్‌.

అర్హత: కోర్సును అనుసరించి సంబంధిత గ్రూపులో 12వ తరగతి లేదా ఇంజినీరింగ్‌ డిప్లొమా.

వయసు: 14- 28 ఏళ్ల మధ్య ఉండాలి.

పరీక్ష ఫీజు: జనరల్‌/ ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1,200. మహిళలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-03-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 2024, మే మొదటి వారం.

అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌: 2024, మే మూడో వారం.

వెబ్‌సైట్‌: https://www.amecee.in/


ఐఐఎం లఖ్‌నవూలో పీహెచ్‌డీ

ఐఎం లఖ్‌నవూ - జూన్‌-2024 సెషన్‌కు డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీహెచ్‌డీ) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలైజేషన్‌: అగ్రి-బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, కమ్యూనికేషన్‌, డెసిషన్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సిస్టమ్స్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌.

అర్హత: డిగ్రీ, పీజీ. గేట్‌/ జీఆర్‌ఈ/ జీమ్యాట్‌/ క్యాట్‌ లేదా జేఆర్‌ఎఫ్‌ / ఎస్‌ఆర్‌ఎఫ్‌ (యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ ఐకార్‌)లో స్కోరు.

వయసు: 55 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.500.

దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2024.

వెబ్‌సైట్‌: https://www.iiml.ac.in/


ఎన్‌టీపీసీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో పీజీడీఎం

నోయిడాలోని ఎన్‌టీపీసీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌- పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. పీజీడీఎం ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, వ్యవధి: రెండేళ్లు
2. పీజీడీఎం ఎగ్జిక్యూటివ్‌, వ్యవధి: 18 నెలలు.

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ. క్యాట్‌ / ఎక్స్‌ఏటీ/ జీమ్యాట్‌ / ఇతర మేనేజ్‌మెంట్‌ కోర్సు ప్రవేశ పరీక్ష స్కోరు.

దరఖాస్తు రుసుము: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2024.

వెబ్‌సైట్‌: https://nsb.ac.in/


యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ బెంగాల్‌లో..

శ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రం రాజా రామ్మోహన్‌పూర్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ బెంగాల్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టీ సైన్స్‌- టీ మేనేజ్‌మెంట్‌  పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం సీట్ల సంఖ్య: 56. అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.  

ఎంపిక: ప్రవేశ పరీక్ష మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 20-12-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 21-12-2023.

వెబ్‌సైట్‌:www.nbu.ac.in/imp/notification.aspx


ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో ఇంజినీర్‌లు

న్యూదిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ)- 100 ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  

విభాగాలు: ఎలక్ట్రికల్‌ ఎరెక్షన్‌, మెకానికల్‌ ఎరెక్షన్‌, సివిల్‌ కన్‌స్ట్రక్షన్‌

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు అనుభవం.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 20-12-2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03-01-2024.

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/


ఇండియన్‌ నేవీలో..

ఇండియన్‌ నేవీ- సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐఎన్‌సెట్‌-01/2023) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా 910 ఛార్జ్‌మ్యాన్‌, సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌, ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ పోస్టులు భర్తీ కానున్నాయి.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ.

వయసు: 31-12-2023 నాటికి ఛార్జ్‌మ్యాన్‌/ ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ పోస్టులకు 25 ఏళ్లు. సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.295. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: దరఖాస్తు స్క్రీనింగ్‌, రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 18-12-2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-12-2023.

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/#


యూకో బ్యాంకులో మేనేజర్‌ పోస్టులు

కోల్‌కతాలోని యూకో బ్యాంకు మేనేజర్‌ పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మేనేజర్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌(ఎంఎంజీఎస్‌-ఖిఖి): 15 పోస్టులు

అర్హత: సీఏ/ సీఎఫ్‌ఏ/ ఎంబీఏ(ఫైనాన్స్‌)/ పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు బ్యాంకింగ్‌ రంగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం.

వయసు: 01.11.2023 నాటికి 21 - 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.800(ఎస్సీ/ ఎస్టీలకు ఫీజు  మినహాయింపు ఉంటుంది).

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27.12.2023.

వెబ్‌సైట్‌: https://www.ucobank.com/english/
job-opportunities.aspx

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని