నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) దేశవ్యాప్త ఇగ్నో కేంద్రాల్లో జనవరి 2024 నుంచి ప్రారంభమయ్యే బీఈడీలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

Published : 19 Dec 2023 00:15 IST

ప్రవేశాలు
ఇగ్నో కేంద్రాల్లో మూడు ప్రోగ్రాములు
బీఈడీ  

న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) దేశవ్యాప్త ఇగ్నో కేంద్రాల్లో జనవరి 2024 నుంచి ప్రారంభమయ్యే బీఈడీలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: కనీసం 50% మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ (సైన్సెస్‌/ సోషల్‌ సైన్సెస్‌/ కామర్స్‌/ హ్యుమానిటీస్‌) లేదా 55% మార్కులతో బీఈ, బీటెక్‌ (సైన్స్‌, మ్యాథమెటిక్స్‌). ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులై ఉండాలి.

పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌

దేశవ్యాప్తంగా ఉన్న ఇగ్నో కేంద్రాల్లో జనవరి 2024 నుంచి ప్రారంభమయ్యే పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రోగ్రాంలో ప్రవేశాలకు  దరఖాస్తులు కోరుతున్నారు.

అర్హత: పదో తరగతి లేదా 10+2, డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు ఇన్‌సర్వీస్‌ నర్సుగా పని అనుభవం.

బోధనా మాధ్యమం: ఇంగ్లిష్‌.

వ్యవధి: మూడు నుంచి ఆరేళ్లు.

పీహెచ్‌డీ  

దేశవ్యాప్తంగా ఉన్న ఇగ్నో కేంద్రాల్లో జులై, 2023 సెషన్‌కు పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు.

విభాగాలు: పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, విమెన్స్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, కంప్యూటర్‌ సైన్స్‌, హిందీ, ఇంగ్లిష్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ.

ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. యూజీసీ- నెట్‌/ యూజీసీ- సీఎస్‌ఐఆర్‌ నెట్‌/ గేట్‌/ సీడ్‌ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇగ్నో ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.

ఈ మూడు ప్రోగ్రాములకూ...

పరీక్ష ఫీజు: రూ.1000.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: 31-12-2023.

పరీక్ష తేదీ: 07-01-2024.

వెబ్‌సైట్‌: http://ignou.ac.in/ignou/studentzone/adminssionanouncement/1


ఐఐటీఎం తిరుచిరాపల్లిలో పీహెచ్‌డీ

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ తిరుచిరాపల్లి- 2024 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

స్పెషలైజేషన్లు: ఎకనామిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ అనలిటిక్స్‌, మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డెసిషన్స్‌ సైన్సెస్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజీ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌.

అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ లేదా సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: 31-01-2024.
వెబ్‌సైట్‌: https://www.iimtrichy.ac.in/en/dpm


ఐఐఎం ఇందౌర్‌లో ...

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఇందౌర్‌- 2024 విద్యా సంవత్సరానికి డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (డీపీఎం)లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

స్పెషలైజేషన్లు: కమ్యూనికేషన్‌, ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌.

అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ. లేదా సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్‌.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీకి రూ.500.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2024.

వెబ్‌సైట్‌: https://www.iimidr.ac.in/


సాంఘిక సంక్షేమ కళాశాలలో అగ్రి బీఎస్సీ

తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ నిర్వహించే జగిత్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ అగ్రికల్చర్‌ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశాల ప్రకటన విడుదలైంది. కోర్సు వ్యవధి: నాలుగేళ్లు. అర్హులైన బాలికలు డిసెంబర్‌ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఉచిత విద్య, వసతి సౌకర్యాలు అందుతాయి.

సీట్ల సంఖ్య: 09.

అర్హతలు: డిప్లొమా (అగ్రికల్చర్‌/ సీడ్‌ టెక్నాలజీ/ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌) ఉత్తీర్ణులైన బాలికలు అర్హులు. అగ్రిసెట్‌ 2023 ర్యాంకు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు.

వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

సీటు కేటాయింపు: అగ్రిసెట్‌ 2023 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19.12.2023.

వెబ్‌సైట్‌: https://www.tswreis.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని