ప్రభుత్వ ఉద్యోగాలు

ఒంగోలులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం- ప్రకాశం జిల్లాలోని పీహెచ్‌సీల్లో అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 21 Dec 2023 00:05 IST

శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌ పోస్టులు

ఒంగోలులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం- ప్రకాశం జిల్లాలోని పీహెచ్‌సీల్లో అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ: 03

శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌: 07

అర్హత: పదో తరగతి.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: రూ.15,000. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఒంగోలులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయానికి పంపాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22.12.2023.

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/notice_category/recruitment/


నంద్యాల జిల్లాలో ఆఫీస్‌ స్టాఫ్‌

నంద్యాల జిల్లా సాంకేతిక విద్యా శాఖ- అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన బేతంచెర్లలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ల్యాబ్‌ అటెండర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, వాచ్‌మెన్‌, స్వీపర్‌, టెక్నికల్‌ ఎలక్ట్రీషియన్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి 5, 7, 10వ తరగతి, ఐటీఐ.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ప్రభుత్వ పాలిటెక్నిక్‌, బేతంచెర్ల, నంద్యాల జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2023.

వెబ్‌సైట్‌:https://nandyal.ap.gov.in/


ఎన్‌టీఆర్‌ఓలో సైంటిస్ట్‌లు

న్యూదిల్లీలోని నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌- 74 సైంటిస్ట్‌ ‘బి’ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, జియో- ఇన్ఫర్మాటిక్స్‌ అండ్‌ రిమోట్‌సెన్సింగ్‌.

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీతో పాటు గేట్‌ స్కోరు.

వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: గేట్‌ స్కోరు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.250. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19-01-2024.

వెబ్‌సైట్‌: https://recruit-ndl.nielit.gov.in/


ప్రవేశాలు

ఐఐఎం కొజికోడ్‌లో పీహెచ్‌డీ

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కొజికోడ్‌- 2024 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

స్పెషలైజేషన్లు: ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌, అకౌంటింగ్‌ అండ్‌ కంట్రోల్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ లిబరల్‌ ఆర్ట్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌, క్వాంటిటేటివ్‌ మెథడ్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌.

అర్హత: డిగ్రీ, పీజీ లేదా సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్‌.

దరఖాస్తు రుసుము: రూ.1000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2024

ఇంటర్వ్యూ తేదీలు: 2024, ఏప్రిల్‌ 17 నుంచి 21 వరకు.

వెబ్‌సైట్‌: https://iimk.ac.in/academic-programmes/Fellow-Programme-in-Management


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని