ప్రభుత్వ ఉద్యోగాలు

గుంటూరులోని హెల్త్‌ మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌- జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 94 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 25 Dec 2023 00:04 IST

గుంటూరులో పారామెడికల్‌...

గుంటూరులోని హెల్త్‌ మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌- జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 94 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీలున్న వైద్య సంస్థలు: గుంటూరులోని జీఎంసీ, జీజీహెచ్‌, ప్రిన్సిపల్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌.

ఖాళీలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌, అనస్థీషియా టెక్నీషియన్‌, బయో-మెడికల్‌ టెక్నీషియన్‌, సీటీ టెక్నీషియన్‌, ఈసీజీ టెక్నీషియన్‌, ఎలక్ట్రీషియన్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, రేడియోగ్రాఫర్‌, స్టోర్‌ కీపర్‌, పర్సనల్‌ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి 7వ తరగతి, పదో తరగతి, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ప్రిన్సిపల్‌ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, గుంటూరు చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 30-12-2023.

వెబ్‌సైట్‌: https://guntur.ap.gov.in/


ప్రాజెక్ట్‌ అసోసియేట్‌లు

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ- (సీసీఎంబీ) ఒప్పంద ప్రాతిపదికన 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-ఖి: 04
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 03  
  • రిసెర్చ్‌ అసోసియేట్‌-ఖి: 01
  • ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-ఖి: 01
  • రిసెర్చ్‌ అసోసియేట్‌: 01
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-ఖి: 01
  • సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01
  • జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01  
  • సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌: 02  

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

ఎంపిక: పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2023.

వెబ్‌సైట్‌: https://www.ccmb.res.in/Careers/Project-Positions


వాక్‌ఇన్‌

ప్రోగ్రామ్‌ మేనేజర్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని సీసీఎంబీ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రోగ్రామ్‌ మేనేజర్‌: 01
  • ఫైనాన్షియల్‌ అసిస్టెంట్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

ఎంపిక: పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీ: 28.12.2023.

స్థలం: సీసీఎంబీ, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.ccmb.res.in/Careers/Project-Positions


ప్రవేశాలు

ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ

యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్‌ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ... ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి కల్పిస్తారు.

1. బేసిక్‌ కంప్యూటర్స్‌ (డేటా ఎంట్రీ ఆపరేటర్‌): 3 నెలలు అర్హత: ఇంటర్‌

2. అకౌంట్స్‌ అసిస్టెంట్‌(ట్యాలీ): 3 నెలలు అర్హత: బీకాం

3. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసిస్టెంట్‌: 3 నెలలు  అర్హత: ఇంటర్‌

4. ఆటోమొబైల్‌- టూ వీలర్‌ సర్వీసింగ్‌: 3 నెలలు అర్హత: పదోతరగతి

5. సెల్‌ఫోన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ రిపేర్‌: 4 నెలలు అర్హత: పదోతరగతి  

6. ఎలక్ట్రీషియన్‌ (డొమెస్టిక్‌): 5 నెలలు అర్హత: పదోతరగతి, ఐటీఐ  

7. సోలార్‌ సిస్టమ్‌ ఇన్‌స్టలేషన్‌/ సర్వీస్‌: 4 నెలలు అర్హత: పదోతరగతి, ఐటీఐ  

వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: అర్హతలుండి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిజ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నకళ్లు, ఫొటోలతో సంస్థ చిరునామాలో సంప్రదించాలి.

అడ్మిషన్‌ తేదీ: 02.01.2024 ఉదయం 10 గంటలు.

చిరునామా: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్‌పూర్‌(గ్రామం), పోచంపల్లి(మండలం), యాదాద్రి భువనగిరి జిల్లా.

వెబ్‌సైట్‌: https://www.srtri.com/index.php


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని