నోటిఫికేషన్స్‌

ముంబయిలోని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా- జీఐసీఆర్‌ఈ శాఖల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 26 Dec 2023 00:06 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
జనరల్‌ ఇన్సూరెన్స్‌లో..

ముంబయిలోని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా- జీఐసీఆర్‌ఈ శాఖల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఆఫీసర్‌- అసిస్టెంట్‌ మేనేజర్‌ కేడర్‌

(స్కేల్‌ ఖి): 85 పోస్టులు (జనరల్‌- 35, ఎస్సీ- 12, ఎస్టీ- 6, ఓబీసీ- 26, ఈడబ్ల్యూఎస్‌- 6, పీడబ్ల్యూడీ- 3)

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ.

వయసు: 01.10.2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.  

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: రాజమహేంద్రవరం, విజయవాడ, హైదరాబాద్‌, కరీంనగర్‌.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 12.01.2024.

దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 23.12.2023 నుంచి 12.01.2024 వరకు.

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2024.

వెబ్‌సైట్‌: https://www.gicre.in/


ఐబీలో 226 పోస్టులు

మినిస్ట్రీ ఆఫ్‌ హోమ్‌ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 226 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

విభాగాల వారీ ఖాళీలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ- 79; ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌- 147.

అర్హతలు: బీఈ, బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి-కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌). లేదా ఎమ్మెస్సీ (ఎలక్ట్రానిక్స్‌/ ఫిజిక్స్‌- ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ కంప్యూటర్‌ సైన్స్‌) లేదా పీజీ (కంప్యూటర్‌ అప్లికేషన్స్‌). గేట్‌ 2021/ 2022/ 2023 స్కోరు తప్పనిసరి.

వయసు: 12-01-2024 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: గేట్‌ స్కోరు/ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్‌/ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12.01.2024.

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 16.01.2024.

వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/en


ప్రవేశాలు

ఐఐఎంలో డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ బెంగళూరు- 2024 విద్యా సంవత్సరానికి డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: డెసిషన్‌ సైన్సెస్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఎకనామిక్స్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, మార్కెటింగ్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ పాలసీ, స్ట్రాటజీ.

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ లేదా సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్‌.

ప్రోగ్రామ్‌ వ్యవధి: గరిష్ఠంగా అయిదేళ్లు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-01-2024.

వెబ్‌సైట్‌:  www.iimb.ac.in/doctoral-programme-admission


ఐఐటీ గాంధీనగర్‌లో ఎంఏ
ఐటీ గాంధీనగర్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌-  2024 విద్యా సంవత్సరానికి ఎంఏ (సొసైటీ అండ్‌ కల్చర్‌)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ.

ప్రోగ్రామ్‌ వ్యవధి: రెండేళ్లు

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-01-2024.

ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలు: 09, 10-03-2024.

వెబ్‌సైట్‌: https://hss.iitgn.ac.in/masc/#admission


ఐఎస్‌ఐ, కోల్‌కతాలో..

కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌- పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది
అర్హత: ఏదైనా డిగ్రీ
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-01-2024.
వెబ్‌సైట్‌: ‌www.coursera.org/degrees/statistics-data-analytics-pgdip-isi


ఎయిమ్స్‌ జోధ్‌పుర్‌లో పీహెచ్‌డీ

జోధ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌- జనవరి-2024 సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం సీట్లు: 158.

అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08.01.2024.

వెబ్‌సైట్‌: https://aiimsjodhpur.edu.in/phd_course.php


కురుక్షేత్ర వర్సిటీలో..

కురుక్షేత్రలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం- సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ స్కీమ్‌ కింద సర్టిఫికెట్‌ కోర్సు ఇన్‌ స్పోర్ట్స్‌ డైటీషియన్‌ (ఈవెనింగ్‌ సెషన్‌)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు వ్యవధి: 3 నెలలు.

అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ. బీపీఈడీ, ఎంపీఈడీ ఉత్తీర్ణులకు 5% అదనపు వెయిటేజీ ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09.01.2023

వెబ్‌సైట్‌: https://www.kuk.ac.in/news.php


నాటా 2024 ప్రకటన

నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా) 2024 నోటిఫికేషన్‌ను కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ విడుదల చేసింది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో జేఎన్‌ఏఎఫ్‌ఏయూ,  హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో ఐదేళ్ల బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పొందవచ్చు.

కోర్సు వ్యవధి: బీఆర్క్‌ కోర్సు వ్యవధి ఐదేళ్లు.

విద్యార్హత: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతోపాటు ఇంటర్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు, మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా 50 శాతం మార్కులతో డిప్లొమా పూర్తిచేసినవారూ, చివరి ఏడాది విద్యార్థులు అర్హులే.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: 01-02-2024.

పరీక్ష ప్రారంభం: 06-04-2024.

వెబ్‌సైట్‌: https://www.nata.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని