నోటిఫికేషన్స్

Published : 27 Dec 2023 01:32 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ప్రాజెక్టు కన్సల్టెంట్‌లు

నోయిడాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ స్మాల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌- ఒప్పంద ప్రాతిపదికన 152 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  సీనియర్‌ కన్సల్టెంట్‌: 04  కన్సల్టెంట్‌ (గ్రేడ్‌ 2): 04
  • కన్సల్టెంట్‌ (గ్రేడ్‌ 1): 08  కన్సల్టెంట్‌ (యంగ్‌ ప్రొఫెషనల్‌): 16  
  • ప్రోగ్రాం కోఆర్డినేటర్‌: 15  సిస్టమ్‌ అనలిస్ట్‌/ డెవలపర్‌: 5
  •  ప్రాజెక్టు కన్సల్టెంట్‌: 100

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతోపాటు పని అనుభవం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టర్‌, ఎన్‌ఐఈఎస్‌బీయూడీ, ఎ-23, సెక్టార్‌-62, ఇన్‌స్టిట్యూషనల్‌ ఏరియా, నోయిడా చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 09-01-2024. వెబ్‌సైట్‌:https://www.niesbud.nic.in/


డీఎంఐ, పట్నాలో ఫ్యాకల్టీ పోస్టులు

పట్నాలోని డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌- కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- గ్రేడ్‌ ఖిఖి      2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- గ్రేడ్‌ ఖి
3. అసోసియేట్‌ ప్రొఫెసర్‌        4. ప్రొఫెసర్‌
అర్హతలు: పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2024. వెబ్‌సైట్‌: https://dmi.ac.in/frs


వాక్‌-ఇన్స్‌
పీఎంబీఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌లు
న్యూదిల్లీలోని ఫార్మాస్యూటికల్స్‌ అండ్‌ మెడికల్‌ డివైజెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా (పీఎంబీఐ) - కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
అసిస్టెంట్‌ మేనేజర్లు: 2 వయసు: 32 సంవత్సరాలు మించకూడదు.
సీనియర్‌ మార్కెటింగ్‌ మేనేజర్లు: 2 వయసు: 30 ఏళ్లు మించకూడదు.
అర్హత: డిగ్రీ, పీజీడీఎం/ ఎంబీఏ (సేల్స్‌/ మార్కెటింగ్‌)తో పాటు పని అనుభవం.
ఇంటర్వ్యూ తేదీలు: 29-12-2023, 05-01-2024.
వెబ్‌సైట్‌: https://www.lichousing.com/job opportunities


అప్రెంటిస్‌షిప్‌
ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 250 ఖాళీలు
ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌... దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలోని ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ శాఖల్లో 250 మంది అప్రెంటిస్‌ల శిక్షణకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. (ఆంధ్రప్రదేశ్‌లో 19, తెలంగాణలో 30 ఖాళీలు)
శిక్షణ వ్యవధి: 12 నెలలు. అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ.
వయసు: 01-12-2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.9,000 - రూ.15,000.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్‌ కేటగిరీ, ఓబీసీలకు రూ.944. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.708. దివ్యాంగ అభ్యర్థులకు రూ.472.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 31.12.2023.
పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 03-01-2024.
రాత పరీక్ష తేదీ: 06-01-2024. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూ తేదీలు: 09-01-2024 నుంచి 11-01-2024 వరకు.
అప్రెంటిస్‌ శిక్షణ ప్రారంభం: 15-01-2024.
వెబ్‌సైట్‌:https://www.lichousing.com/job opportunities


ఎండీఎస్‌ఎల్‌, ముంబయిలో..

ముంబయిలోని మాజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ కింది విభాగాల్లో డిప్లొమా/గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
డిప్లొమా అప్రెంటిస్‌లు: 30  - గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 170
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ.
వయసు: 01-01-2024 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.8000. ఎంపిక: విద్యార్హత మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-01-2024.
ఇంటర్వ్యూలు ప్రారంభం: 30-01-2024.
వెబ్‌సైట్‌: https://www.mazagondock.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని