నోటిఫికేషన్స్‌

అహ్మదాబాద్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) ఒప్పంద ప్రాతిపదికన 9 టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 28 Dec 2023 00:31 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
సిపెట్‌లో టీచింగ్‌ పోస్టులు

అహ్మదాబాద్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) ఒప్పంద ప్రాతిపదికన 9 టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఇంగ్లిష్‌)- 1
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (మ్యాథ్స్‌)- 1
  • లెక్చరర్‌ (ప్లాస్టిక్‌ టెక్నాలజీ)- 2
  • లెక్చరర్‌ (ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌/ మెషిన్‌ మెయింటెనెన్స్‌)- 1
  • లెక్చరర్‌ (కెమిస్ట్రీ)- 1
  • అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌- 1
  • అసిస్టెంట్‌ లైబ్రేరియన్లు- 2

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ/ నెట్‌/ స్లెట్‌/సెట్‌తో పాటు పని అనుభవం.  
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ది జాయింట్‌ డైరెక్టర్‌ ఖీ హెడ్‌, సిపెట్‌-ఐపీటీ, ప్లాట్‌ నెం.630, ఫేజ్‌-4, అహ్మదాబాద్‌’ చిరునామాకు రిజిస్టర్డ్‌/ స్పీడ్‌ పోస్టు ద్వారా పంపాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24-01-2024.
వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/


విజయనగరం జిల్లాలో..

విజయనగరంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన విజయనగరం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో 3 స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: బీఎస్సీ (నర్సింగ్‌)/ జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.27,675.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డీఎంహెచ్‌వో, విజయనగరం చిరునామాకు పంపించాలి.
వెబ్‌సైట్‌:https://vizianagaram.ap.gov.in/


ప్రవేశాలు

ఐఐటీ గాంధీనగర్‌లో ఎమ్మెస్సీ

ఐఐటీ గాంధీనగర్‌ ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కాగ్నిటివ్‌ సైన్స్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: సంబంధిత బ్యాచిలర్స్‌ డిగ్రీ.
ప్రోగ్రామ్‌ వ్యవధి: రెండేళ్లు.
ఎంపిక: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ విభాగాలను జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా; కాగ్నిటివ్‌ సైన్స్‌ విభాగాన్ని ప్రవేశ పరీక్ష/ ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.150; మిగతా వారందరికీ రూ.300.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-01-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 15, 16-03-2024.
ఇంటర్వ్యూ తేదీ: 15-04-2024.
వెబ్‌సైట్‌: https://iitgn.ac.in/ admissions/msc


నిక్‌మార్‌, హైదరాబాద్‌లో పీజీ

హైదరాబాద్‌లోని నిక్‌మార్‌ ఫుల్‌ టైం ఆన్‌-క్యాంపస్‌ పీజీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

  • పీజీ (అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌): రెండేళ్లు
  • పీజీ (అడ్వాన్స్‌డ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌): రెండేళ్లు
  • పీజీ (క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌): రెండేళ్లు
  • పీజీ (హెల్త్‌, సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌): ఏడాది
  • పీజీ (లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌): ఏడాది
  • పీజీ (రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌): ఏడాది

అర్హత: 50% మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌/ మేనేజ్‌మెంట్‌/ ఎకనామిక్స్‌/ మ్యాథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ కామర్స్‌/ ఆర్ట్స్‌/ అగ్రికల్చర్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ).
సీటు కేటాయింపు: నిక్‌మార్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, అప్లికేషన్‌ రేటింగ్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29-12-2023.
ప్రవేశ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ తేదీలు: 2024 ఫిబ్రవరి 12 నుంచి 18 వరకు.
ఎంపిక ఫలితాల వెల్లడి: 21-02-2024.
వెబ్‌సైట్‌: https://www.nicmar.ac.in/hyderabad/campus#secch3


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని