నోటిఫికేషన్స్‌

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్‌ పోస్టులు

Published : 02 Jan 2024 00:25 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్‌ పోస్టులు

సికింద్రాబాద్‌ ఆర్కేపురంలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ 62 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పీజీటీ: 05 (కెమిస్ట్రీ, సైకాలజీ, కామర్స్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, పీఈటీ)
టీజీటీ: 30 (హిందీ, మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, సోషల్‌ సైన్స్‌, సీఎస్‌, పీఈటీ, సంస్కృతం, డ్యాన్స్‌, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, మ్యూజిక్‌)
పీఆర్‌టీ: 16 (అన్ని సబ్జెక్టులతో పాటు ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌, పీఈటీ, డ్యాన్స్‌, కౌన్సెలర్‌)
హెడ్‌ మిస్ట్రెస్‌: 02  
ప్రీ ప్రైమరీ టీచర్లు: 09  
అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్‌, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, పీజీ, సీటీఈటీ/ టెట్‌.
వయసు: 55 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్‌, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, ఆర్కే పురం, సికింద్రాబాద్‌’ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 15-01-2023.
వెబ్‌సైట్‌: https://apsrkpuram.edu.in/


తితిదే కళాశాలల్లో డిగ్రీ/ జూనియర్‌ లెక్చరర్‌లు

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కళాశాలలు/ ఓరియంటల్‌ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లు, తితిదే జూనియర్‌ కళాశాలల్లో జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, హిందూ మత అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
1. డిగ్రీ లెక్చరర్‌: 49 పోస్టులు
సబ్జెక్టుల వారీ ఖాళీలు: బోటనీ- 3, కెమిస్ట్రీ- 2, కామర్స్‌- 9, డెయిరీ సైన్స్‌- 1, ఎలక్ట్రానిక్స్‌- 1, ఇంగ్లిష్‌- 8, హిందీ- 2, హిస్టరీ- 1, హోమ్‌ సైన్స్‌- 4, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌- 2, ఫిజిక్స్‌- 2, పాపులేషన్‌ స్టడీస్‌- 1, సంస్కృతం- 1, సంస్కృత వ్యాకరణం- 1, స్టాటిస్టిక్స్‌- 4, తెలుగు- 3, జువాలజీ- 4.
అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ , నెట్‌/ స్లెట్‌ అర్హత.
2. జూనియర్‌ లెక్చరర్‌: 29 పోస్టులు
సబ్జెక్టుల వారీ ఖాళీలు: బోటనీ- 4, కెమిస్ట్రీ- 4, సివిక్స్‌- 4, కామర్స్‌- 2, ఇంగ్లిష్‌- 1, హిందీ- 1, హిస్టరీ- 4, మ్యాథమెటిక్స్‌- 2, ఫిజిక్స్‌- 2, తెలుగు- 3, జువాలజీ- 2.
అర్హత: కనీసం 55% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ.
మొత్తం పోస్టుల సంఖ్య: 78.
వయసు: 01-07-2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష (కంప్యూటర్‌ ఆధారిత రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌) ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌ మెన్‌ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.370.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 2024, ఫిబ్రవరి మొదటి వారం.
వెబ్‌సైట్‌: https://www.tirumala.org/


ప్రవేశాలు

ఉస్మానియాలో డిప్లొమాలు

ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, జర్మన్‌ విభాగం- 2023-24 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఫ్రెంచ్‌/ జర్మన్‌లో డిప్లొమా కోర్సులు(జూనియర్‌/ సీనియర్‌): వ్యవధి నాలుగు నెలలు
అర్హత: జూనియర్‌ డిప్లొమాకు ఇంటర్మీడియట్‌, సీనియర్‌ డిప్లొమాకు జూనియర్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.200.
దరఖాస్తుకు చివరి తేదీ: 06-01-2024.
వెబ్‌సైట్‌: https://www.osmania.ac.in/


వాక్‌-ఇన్‌

అసోంలో సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌లు

తేజ్‌పూర్‌ (అసోం)లోని ఎల్‌జీబీ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ (ఎల్‌జీబీఆర్‌ఐఎంహెచ్‌)- 13 సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: ఎంబీబీఎస్‌, పీజీ డిప్లొమా, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ.
విభాగాలు: సైకియాట్రీ, బయోకెమిస్టీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, రేడియాలజీ, అనస్థీషియాలజీ.
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 16-01-2024.
వేదిక: ఎల్‌జీబీ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌, తేజ్‌పూర్‌ (అసోం).
వెబ్‌సైట్‌: https://lgbrimh.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని