నోటిఫికేషన్స్

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌)- ఒప్పంద ప్రాతిపదికన 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 04 Jan 2024 03:58 IST

ఉద్యోగాలు

సీడ్యాక్‌, హైదరాబాద్‌లో ప్రాజెక్టు ఆఫీసర్‌లు

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌)- ఒప్పంద ప్రాతిపదికన 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రాజెక్టు ఆఫీసర్‌ (ఐఎస్‌ఈఏ): 03  ః ప్రాజెక్టు ఆఫీసర్‌ (అవుట్‌రీచ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌): 01  అర్హతలు: ఎంబీఏ/ పీజీ (బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌/ మార్కెటింగ్‌)తో పాటు పని అనుభవం. వయసు: 50 సంవత్సరాలు మించకూడదు. వేతనం: ఏడాదికి రూ.5.2 లక్షలు.

ఉద్యోగ ప్రదేశం: హైదరాబాద్‌. దరఖాస్తుకు చివరి తేదీ: 15-01-2024
వెబ్‌సైట్‌: https://cdac.in/index.aspx?id=ca_advt_02_2023_


సెయిల్‌, రవుర్కెలాలో..

స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, రవుర్కెలా- 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మెడికల్‌ ఆఫీసర్‌ (ఇ-1): 05
  • డిప్యూటీ మేనేజర్‌ (బయో మెడికల్‌): 01 అర్హత: ఎంబీబీఎస్‌/ బీఈ/బీటెక్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-01-2024
  • వెబ్‌సైట్‌: https://sailcareers.com/secure?app_id=UElZMDAwMDAwMQ==

బీఐఎస్‌ఏజీ-ఎన్‌లో వీడియో ఎడిటర్‌లు

భాస్కరాచార్య నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ అండ్‌ జియో-ఇన్ఫర్మేటిక్స్‌ (బీఐఎస్‌ఏజీ-ఎన్‌).. అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  బ్రాడ్‌ కాస్ట్‌ ఇంజినీర్‌: 04
  • వీడియో ఎడిటర్‌ కమ్‌ కెమెరామెన్‌: 06  

అర్హత: బ్రాడ్‌ కాస్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు బీఈ/ బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌). వీడియో ఎడిటర్‌ కమ్‌ కెమెరామెన్‌ పోస్టులకు డిగ్రీతో పాటు సర్టిఫికెట్‌ కోర్సు (గ్రాఫిక్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌/ యానిమేషన్‌, మోషన్‌ గ్రాఫిక్స్‌), లేదా డిప్లొమా (వీడియో ఎడిటింగ్‌ అండ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌, వీడియో ఎడిటింగ్‌ అండ్‌ మీడియాలో సాఫ్ట్‌వేర్‌).
వేతనం: నెలకు బ్రాడ్‌ కాస్ట్‌ ఇంజినీర్‌కు 35,000; వీడియో ఎడిటర్‌కు రూ.30,000. దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా. దరఖాస్తుకు చివరి తేదీ: 11-01-2024.

వెబ్‌సైట్‌: https://bisagnn.gov.in/


వాక్‌ఇన్‌
అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌లో టీచింగ్‌ పోస్టులు

నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌లోని అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ విద్యాసంస్థ ఒప్పంద ప్రాతిపదికన 3 టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టులకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
అర్హతలు: బీఎస్సీ/ ఎంఎస్సీ (అగ్రికల్చర్‌). వేతనం: నెలకు పీజీ అర్హతకు రూ.32,000; డిగ్రీ అర్హతకు రూ.25,000. ఇంటర్వ్యూ తేదీ: 11-01-2024.
ప్రదేశం: అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌, రుద్రూర్‌, నిజామాబాద్‌ జిల్లా, తెలంగాణ.

వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని