నేషనల్‌ ఇన్సూరెన్స్‌లో కొలువులు

నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఐసీఎల్‌)... 274 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌ (జనరలిస్ట్స్‌, స్పెషలిస్ట్స్‌) స్కేల్‌-1 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వూ ఆధారంగా   నియామకాలుంటాయి.

Published : 08 Jan 2024 00:04 IST

నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఐసీఎల్‌)... 274 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌ (జనరలిస్ట్స్‌, స్పెషలిస్ట్స్‌) స్కేల్‌-1 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వూ ఆధారంగా   నియామకాలుంటాయి.

మొత్తం 274 ఉద్యోగాల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 125, ఓబీసీలకు 57, ఎస్సీలకు 44, ఎస్టీలకు 21, ఈడబ్ల్యూఎస్‌లకు 27 కేటాయించారు.  

1. డాక్టర్స్‌: 28 పోస్టులు. ఎంబీబీఎస్‌/ ఎండీ / ఎంఎస్‌/ పీజీ-మెడికల్‌ డిగ్రీ పాసవ్వాలి. లేదా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ గుర్తించిన మెడికల్‌ డిగ్రీ పూర్తిచేయాలి. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌లో రిజిస్టరై ఉండాలి.

2. లీగల్‌: 20 ఖాళీలు. లా గ్రాడ్యుయేషన్‌/ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ను 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం ఉండాలి.

3. ఫైనాన్స్‌: 30 ఖాళీలు. ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ (ఐసీఏఐ/ కాస్ట్‌ అకౌంటెంట్‌ (ఐసీడబ్ల్యూఏ) పూర్తిచేయాలి. లేదా బీకామ్‌/ ఎంకామ్‌ 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం సరిపోతుంది.

4. యాక్చూరియల్‌: 02 ఖాళీలు. స్టాటిస్టిక్స్‌/ మేథమెటిక్స్‌/ యాక్చూరియల్‌ సైన్స్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం ఉండాలి.

5. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ: 20 ఖాళీలు. కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో బీఈ/ బీటెక్‌/ఎంఈ/ ఎంటెక్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం ఉండాలి.

6. ఆటోమొబైల్‌ ఇంజినీర్స్‌: 20 ఉద్యోగాలు. ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం మార్కులు సరిపోతాయి.

7. జనరలిస్ట్‌ ఆఫీసర్స్‌: 130 పోస్టులు. ఏదైనా డిగ్రీ/ పీజీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం సరిపోతుంది.

8. హిందీ (రాజ్‌భాష) ఆఫీసర్స్‌: 24 పోస్టులు. హిందీ పీజీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీలు 55 శాతం మార్కులు సరిపోతాయి. ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్టుగా చదివుండాలి. లేదా హిందీ ఒక సబ్జెక్టుగా ఇంగ్లిష్‌లో పీజీ చేయాలి.  

01.12.2023 నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.1000.

ఎంపిక: హిందీ ఆఫీసర్స్‌ పోస్టులకు తప్ప.. మిగతా అన్ని పోస్టులకూ ఎంపిక విధానం ఒకేలా ఉంటుంది. రాత పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఫేజ్‌-1లో ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ, ఫేజ్‌-2లో ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష ఉంటాయి.

ఫేజ్‌-1: ప్రిలిమినరీ

ఆబ్జెక్టివ్‌ పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 60 నిమిషాలు. ప్రతి సెక్షన్‌నూ నిర్దేశించిన వ్యవధిలోనే పూర్తిచేయాలి.

1. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ - 30 మార్కులు, 20 నిమిషాలు.   2. రీజనింగ్‌ ఎబిలిటీ - 35 మార్కులు, 20 నిమిషాలు. ఈ సెక్షన్‌ ఇంగ్లిష్‌/హిందీలో ఉంటుంది.  3. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - 35 మార్కులు, 20 నిమిషాలు. ఇంగ్లిష్‌/హిందీలో ఉంటుంది.

ప్రతి సెక్షన్‌లోనూ కనీసార్హత మార్కులు సాధించాలి. ప్రిలిమ్స్‌ పాసైన అభ్యర్థులను 1:15 నిష్పత్తిలో ఫేజ్‌-2లోని మెయిన్‌ పరీక్షకు ఎంపికచేస్తారు.

ఫేజ్‌-2 మెయిన్‌ పరీక్ష

ఇది ఆబ్జెక్టివ్‌ విధానంలో 250 మార్కులకు, డిస్క్రిప్టివ్‌ పరీక్ష 30 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ పూర్తయిన వెంటనే డిస్క్రిప్టివ్‌ రాయాలి.

  • వ్యవధి 3 గంటలు. జనరలిస్ట్‌, స్పెషలిస్టులకు వేర్వేరుగా ఉంటుంది.
  • జనరలిస్ట్‌లకు: 5 సెక్షన్లు ఉంటాయి.

1. రీజనింగ్‌ - 50 ప్రశ్నలు, 50 మార్కులు. ఇంగ్లిష్‌/హిందీలో ఉంటుంది. వ్యవధి 40 నిమిషాలు.

2. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ - 50 ప్రశ్నలు - 50 మార్కులు, వ్యవధి 40 నిమిషాలు.

3. జనరల్‌ అవేర్‌నెస్‌ - 50 ప్రశ్నలు - 50 మార్కులు. వ్యవధి 40 నిమిషాలు.

4. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ - 50 ప్రశ్నలు - 50 మార్కులు. వ్యవధి 30 నిమిషాలు.

5. క్వాంటిటేటటివ్‌ ఆప్టిట్యూడ్‌- 50 ప్రశ్నలు - 50 మార్కులు. వ్యవధి 40 నిమిషాలు. ప్రశ్నపత్రం మొత్తం 250 మార్కులకు ఇంగ్లిష్‌/హిందీ భాషల్లో ఉంటుంది.

స్పెషలిస్టులకు: 6 సెక్షన్లకు 250 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌/హిందీలో ఉంటుంది.

  • సెక్షన్‌-1లో రీజనింగ్‌ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 35 నిమిషాలు.
  • సెక్షన్‌-2లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 30 నిమిషాలు.
  • సెక్షన్‌-3లో జనరల్‌ అవేర్‌నెస్‌ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 20 నిమిషాలు.
  • సెక్షన్‌-4లో కంప్యూటర్‌ నాలెడ్జ్‌ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 25 నిమిషాలు.
  • సెక్షన్‌-5లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 35    నిమిషాలు.
  • సెక్షన్‌-6 టెక్నికల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ - 50 ప్రశ్నలు - 50 మార్కులు - 35 నిమిషాలు.
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌కు 30 మార్కులు (ఎస్సే -10, ప్రెసే - 10, కాంప్రహెన్షన్‌ - 10). ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఇంటర్వ్యూ లేదా తుది జాబితా తయారీలో దీంట్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
  • ఆబ్జెక్టివ్‌ పరీక్షలోని ప్రతి సెక్షన్‌లోనూ కనీసార్హత మార్కులు సాధించాలి.
  • ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు.

రాజ్‌భాష ఆఫీసర్లకు: ఆన్‌లైన్‌ రాత పరీక్ష 250 మార్కులకు ఉంటుంది. వ్యవధి 3.30 నిమిషాలు. ప్రశ్నపత్రంలో 6 సెక్షన్లు ఉంటాయి.  

  • సెక్షన్‌-1లో రీజనింగ్‌ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 35 నిమిషాలు.
  • సెక్షన్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 25 నిమిషాలు.
  • సెక్షన్‌-3లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 35 నిమిషాలు.
  • సెక్షన్‌-4లో ట్రాన్స్‌లేషన్‌ (ఇంగ్లిష్‌ - హిందీ, హిందీ - ఇంగ్లిష్‌) - 40 ప్రశ్నలు -       40 మార్కులు - 25 నిమిషాలు.
  • సెక్షన్‌-5లో హిందీ, ఇంగ్లిష్‌ గ్రామర్‌/ఒకాబ్యులరీ, యాక్ట్‌ నాలెడ్జ్‌/ ఆఫిషియల్‌ లాంగ్వేజ్‌ ఇంప్లిమెంటేషన్‌ రూల్స్‌ - 40 ప్రశ్నలు - 40 మార్కులు - 30 నిమిషాలు.

6. హిందీ లాంగ్వేజ్‌ ఎస్సే, ప్రెసీ, కాంప్రహెన్షన్‌, లెటర్‌ రైటింగ్‌ - డిస్క్రిప్టివ్‌ - 4 ప్రశ్నలు - 50 మార్కులు - 60 నిమిషాలు.

  • హిందీ లాంగ్వేజ్‌లో ఎస్సే-20, ప్రెసే-10, కాంప్రహెన్షన్‌-10, లెటర్‌ రైటింగ్‌-10 మార్కులు. డిస్క్రిప్టివ్‌ జవాబులను కీబోర్డ్‌ను ఉపయోగిస్తూ కంప్యూటర్‌పైనే టైప్‌ చేయాలి.
  • ప్రతీ తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు.
  • దీంట్లో కనీసార్హత మార్కులను సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూ: మెయిన్‌ పరీక్షలో పాసైన జనరలిస్ట్‌, స్పెషలిస్ట్‌ అభ్యర్థులను, ఆన్‌లైన్‌ రాత పరీక్షలో పాసైన హిందీ (రాజ్‌భాషా) అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ, జరిగే ప్రదేశం వివరాలను కాల్‌ లెటర్‌ ద్వారా తెలియజేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 22.01.2024
వెబ్‌సైట్‌: https://nationalinsurance.nic.co.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని