నోటిఫికేషన్స్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 11 Jan 2024 00:08 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఆర్‌పీఎన్‌ఎల్‌యూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు

త్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 06

సబ్జెక్టులు: హిస్టరీ, ఇంగ్లిష్‌, పొలిటికల్‌ సైన్స్‌, లా, సోషియాలజీ.
అర్హత: 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ లేదా పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
వేతనం: లెవెల్‌-10 రూ.56,100 బేసిక్‌తోపాటు ఆలవెన్సులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: రూ.2,500 (ఎస్సీ అభ్యర్థులకు రూ.2000).
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ప్రెజెంటేషన్‌, మాక్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ  ఆధారంగా.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-01-2024
వెబ్‌సైట్‌: https://www.rpnlup.ac.in/


బెల్‌లో ప్రాజెక్టు ఇంజినీర్‌లు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌), మిలిటరీ కమ్యూనికేషన్‌ ఎస్‌బీయూ- తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రాజెక్టు ఇంజినీర్‌- I : 05

అర్హత: బీఈ/ బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ టెలికమ్యూనికేషన్‌/ కమ్యూనికేషన్‌).
వయసు: 32 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.50,000. ఉద్యోగ స్థలం: అరక్కోణం, వైజాగ్‌, కొచ్చి, పోర్ట్‌ బ్లెయిర్‌, గోవా, ముంబయి.
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 25-01-2024.
వెబ్‌సైట్‌: https://bel-india.in/


వాక్‌-ఇన్స్‌

ఎన్‌సీఈఆర్‌టీలో జూనియర్‌ ప్రాజెక్టు ఫెలో

న్యూదిల్లీలోని ఎన్‌సీఈఆర్‌టీ- ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ డివిజన్‌- కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

జూనియర్‌ ప్రాజెక్టు ఫెలో: 02  

అర్హత: మాస్టర్‌ డిగ్రీ (సోషల్‌ సైన్స్‌/ లాంగ్వేజ్‌/ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌), నెట్‌ ఉత్తీర్ణత.

వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 16-01-2024.

ప్రదేశం: రూం నెం. 407, 4వ ఫ్లోర్‌, జాకీర్‌ హుసేన్‌ బ్లాక్‌, ఎన్‌సీఈఆర్‌టీ, న్యూదిల్లీ.

వెబ్‌సైట్‌ :https://ncert.nic.in/


నూనెగింజల పరిశోధన సంస్థలో ..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐకార్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌)... ఒప్పంద ప్రాతిపదికన 5 రిసెర్చ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • రిసెర్చ్‌ అసోసియేట్‌: 01
  • జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 03
  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, నెట్‌, పీహెచ్‌డీ.

వేతనం: రిసెర్చ్‌ అసోసియేట్‌కు రూ.54,000. జేఆర్‌ఎఫ్‌కు రూ.31,000. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000.

వయసు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు 18-26 ఏళ్లు; మిగిలిన పోస్టులకు పురుషులకు 21-35 ఏళ్లు, మహిళలకు 21-45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ: 24-01-2024.
ఇంటర్వ్యూ ప్రదేశం: ఐసీఏఆర్‌- ఐఐఓఆర్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాదు.
వెబ్‌సైట్‌: https://icar-iior.org.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని