కోచింగ్‌లో అనుభవం ఉందా?

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) అసిస్టెంట్‌ కోచ్‌, కోచ్‌, సీనియర్‌ కోచ్‌, హైపెర్ఫార్మెన్స్‌ కోచ్‌.. మొదలైన 214 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

Updated : 15 Jan 2024 04:03 IST

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) అసిస్టెంట్‌ కోచ్‌, కోచ్‌, సీనియర్‌ కోచ్‌, హైపెర్ఫార్మెన్స్‌ కోచ్‌.. మొదలైన 214 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కాంట్రాక్ట్‌, డిప్యుటేషన్‌ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

న్ని పోస్టులకూ కాంట్రాక్ట్‌ వ్యవధి ఏడాది ఉంటుంది. పని తీరును ఏటా సమీక్షిస్తారు. సంతృప్తికరమైన పనితీరును ప్రదర్శించిన అభ్యర్థుల కాంట్రాక్టును 8 ఏళ్లపాటు పొడిగించే అవకాశం ఉంది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఎంపికచేసిన అసిస్టెంట్‌ కోచ్‌లకు కన్‌సాలిడేటెడ్‌ పే కింద.. నెలకు రూ.50,300, కోచ్‌లకు నెలకు రూ.1,05,000, సీనియర్‌ కోచ్‌లకు నెలకు రూ.1,25,000, హై-పెర్ఫార్మెన్స్‌ కోచ్‌లకు నెలకు రూ.2,20,000 వేతనం చెల్లిస్తారు.

1. అసిస్టెంట్‌ కోచ్‌: 117 ఖాళీలు. సాయ్‌ లేదా గుర్తింపు పొందిన దేశ/ విదేశీ యూనివర్సిటీల నుంచి కోచింగ్‌ డిప్లొమా/ తత్సమాన అర్హత ఉండాలి. లేదా ఒలింపిక్స్‌/ పారా ఒలింపిక్స్‌/ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలి. లేదా ద్రోణాచార్య అవార్డు పొందివుండాలి. ఈ పోస్టులకు ఉద్యోగానుభవం అవసరం లేదు.

2. కోచ్‌/ సీనియర్‌ కోచ్‌: 88 ఖాళీలు. కోచింగ్‌ డిప్లొమా/ తత్సమాన అర్హత ఉండాలి. లేదా ఒలింపిక్స్‌/ పారా ఒలింపిక్స్‌/ వరల్డ్‌ ఛాంపియన్‌ఫిప్‌లో పతకం పొందాలి. లేదా ఒలింపిక్స్‌లో రెండుసార్లు పాల్గొనివుండాలి. లేదా ఒలింపిక్స్‌/ పారా ఒలింపిక్స్‌/ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనాలి. లేదా ద్రోణాచార్య అవార్డు పొందాలి.

  • కోచ్‌ పోస్టులకు 5 ఏళ్ల అనుభవం ఉండాలి. లేదా ఒలింపిక్స్‌/ పారాఒలింపిక్స్‌/ ఇంటర్నేషనల్‌ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు 2 ఏళ్లపాటు శిక్షణనిచ్చిన అనుభవం ఉండాలి.
  • సీనియర్‌ కోచ్‌లకు 7 ఏళ్ల అనుభవం ఉండాలి.  

3. హైపెర్ఫార్మెన్స్‌ కోచ్‌: 9 ఖాళీలు. కోచింగ్‌లో డిప్లొమా/ తత్సమాన అర్హత ఉండాలి. లేదా ఒలింపిక్స్‌/ పారా ఒలింపిక్స్‌/ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలి. లేదా ఒలింపిక్స్‌లో రెండుసార్లు పాల్గొనాలి. లేదా ద్రోణాచార్య అవార్డు పొందాలి.
15 ఏళ్ల అనుభవం ఉండాలి.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అయిన 30.01.2024 నాటికి.. అసిస్టెంట్‌ కోచ్‌కు 40 ఏళ్లు, కోచ్‌కు 45 ఏళ్లు, సీనియర్‌ కోచ్‌కు 50 ఏళ్లు, హైపెర్ఫార్మెన్స్‌ కోచ్‌కు 60 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలమేరకు రిజర్వేషన్లు, గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

దేశంలో ఎక్కడైనా: ఎంపికైన అభ్యర్థులను న్యూదిల్లీలోని రిజిస్టర్‌ ఆఫీస్‌లోగానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్న సాయ్‌ సెంటర్లలోగానీ నియమిస్తారు. కాబట్టి దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. సాయ్‌ ప్రాంతీయ కార్యాలయాల్లో ఇప్పటికే పనిచేస్తున్న అభ్యర్థులు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ తప్పనిసరిగా సమర్పించాలి. లేనట్లయితే ప్రాథమిక దశలోనే వారి దరఖాస్తును తిరస్కరిస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 30.01.2024

వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in/saijobs/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని