నోటిఫికేషన్స్‌

ఇండియన్‌ ఆర్మీ 63వ, 34వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కోర్సులో 381 ఖాళీల్లో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 30 Jan 2024 00:52 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఇండియన్‌ ఆర్మీలో...

ఇండియన్‌ ఆర్మీ 63వ, 34వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కోర్సులో 381 ఖాళీల్లో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

63వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (టెక్‌) పురుషులు: 350
ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌: సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్టిక్రల్‌, ఎలక్టాన్రిక్స్‌, మెకానికల్‌, ఇతర ఇంజినీరింగ్‌ స్ట్రీమ్స్‌.
34వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (టెక్‌) మహిళలు: 29  
ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌: సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌.

ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ టెక్‌: 1
ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ నాన్‌-టెక్‌: 1

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌/ ఏదైనా విభాగంలో డిగ్రీ.
వయసు: 01-10-2024 నాటికి 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌, స్టేజ్‌-1, స్టేజ్‌-2 ఎగ్జామినేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21-02-2024.
కోర్సు ప్రారంభం: అక్టోబర్‌ 2024.
వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/  Authentication.aspx


సుప్రీం కోర్టులో 90 లా క్లర్క్‌ పోస్టులు

న్యూదిల్లీలోని భారత సర్వోన్నత న్యాయస్థానం ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్‌ కమ్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

లా క్లర్క్‌ కమ్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌: 90 పోస్టులు
అర్హతలు: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు రిసెర్చ్‌/ అనలిటికల్‌ స్కిల్స్‌, రాత సామర్థ్యం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి (15.02.2024 నాటికి): 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.80,000.
పరీక్ష విధానం: పార్ట్‌-1, 2 రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2024.
రాత పరీక్ష తేదీ: 10.03.2024.
వెబ్‌సైట్‌: https://main./sci.gov.in/


మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌లు

సిద్దిపేటలోని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌... కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ప్రభుత్వాసుపత్రుల్లో 17 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఎంబీబీఎస్‌/ బీఏఎంఎస్‌/ బీఎస్సీ(నర్సింగ్‌)/ జీఎన్‌ఎం.
వయసు: 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, మహబూబ్‌నగర్‌’ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:  31.01.2024.
వెబ్‌సైట్‌: https://mahabubnagar.telangana.gov.in/


ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో..

ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), రెగ్యులర్‌ ప్రాతిపదికన 12 సీనియర్‌ అనలిస్ట్‌ ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ/ పీజీ, ఐసీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ/ సీఎంఏ/ సీఏతో పాటు పని అనుభవం.
వయసు: 01-01-2024 నాటికి 21 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02-02-2024.
వెబ్‌సైట్‌: https://nabfid.org/


స్ట్టైపెండరీ ట్రైనీ/సైంటిఫిక్‌ అసిస్టెంట్‌లు

రావత్‌భట రాజస్థాన్‌ సైట్‌లోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ 53 పోస్టుల భర్తీకి  దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. స్టైపెండరీ ట్రైనీ/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (డిప్లొమా): 49
2. స్టైపెండరీ ట్రైనీ/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (సైన్స్‌ గ్రాడ్యుయేట్‌): 04

విభాగాలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ బీఎస్సీ.
వయసు: 14-02-2024 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.150. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.02.2024.
వెబ్‌సైట్‌: www.npcil.nic.in/index.aspx


నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో ..

పుణె ఖడక్‌వాస్లాలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 198 గ్రూప్‌ ‘సి’ (బ్యాక్‌లాగ్‌ సహా) ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌- 16
  • స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ 2- 01
  • డ్రాఫ్ట్స్‌మ్యాన్‌- 02
  • సినిమా ప్రొజెక్షనిస్ట్‌-ఖిఖి- 01
  • కుక్‌- 14
  • కంపోజిటర్‌-కమ్‌ ప్రింటర్‌- 01
  • సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్‌ (ఓజీ)- 03
  • కార్పెంటర్‌- 02
  • ఫైర్‌మ్యాన్‌- 02
  • టీఏ-బేకర్‌ అండ్‌ కాన్‌ఫెక్షనర్‌- 01
  • టీఏ- సైకిల్‌ రిపేరర్‌- 02
  • టీఏ- ప్రింటింగ్‌ మెషిన్‌ ఆపరేటర్‌- 01
  • టీఏ- బూట్‌ రిపేరర్‌- 01
  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ ఆఫీస్‌ అండ్‌ ట్రైనింగ్‌- 151

వయసు: ఎల్‌డీసీ/ స్టెనోగ్రాఫర్‌/ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌/ డ్రైవర్‌/ ఫైర్‌మెన్‌ పోస్టులకు 18-27 ఏళ్లు. ఇతర పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, 12వ తరగతి, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిప్లొమాతో పాటు పని అనుభవం.
ఎంపిక: పోస్టును అనుసరించి రాత పరీక్ష, స్కిల్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ‘ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌’లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్‌: https://ndacivrect.gov.in/


అప్రెంటిస్‌లు

దక్షిణ రైల్వేలో 2,860 అప్రెంటిస్‌ ఖాళీలు

దరన్‌ ఇండియన్‌ రైల్వే వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వర్క్‌షాప్‌లు/ యూనిట్‌లు: సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ (పొదనూర్‌, కోయంబత్తూర్‌), క్యారేజ్‌ అండ్‌ వేగన్‌ (పెరంబుర్‌), రైల్వే హాస్పిటల్‌ (పెరంబుర్‌), తిరువనంతపురం డివిజన్‌,  పాలక్కడ్‌ డివిజన్‌, సాలెమ్‌ డివిజన్‌, లోకో (పెరంబుర్‌), ఎలక్ట్రికల్‌ (పెరంబుర్‌), ఇంజినీరింగ్‌ (అరక్కోణం), చెన్నై డివిజన్‌, మెకానికల్‌ (డీజిల్‌), క్యారేజ్‌ అండ్‌ వేగన్‌ ఎలక్ట్రికల్‌/రోలింగ్‌ స్టాక్‌ (అరక్కోణం, అవది, తంబరం, రాయపురం), సెంట్రల్‌ (పొన్మలై), తిరుచిరాపల్లి డివిజన్‌, మధురై డివిజన్‌.

ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌ (గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), ఎంఎల్‌టీ, టర్నర్‌, సీఓపీఏ, ప్లంబర్‌, పీఏఎస్‌ఏఏ, ఎలక్ట్రికల్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, డీజిల్‌ మెకానిక్‌, మెకానికల్‌, అడ్వాన్స్‌డ్‌ వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌ తదితరాలు.

అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.
శిక్షణ కాలం: ఫిట్టర్‌, వెల్డర్‌ (గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నిషియన్స్‌ ట్రేడులకు 15 నెలల నుంచి 2 ఏళ్లు, ఇతర ట్రేడులకు 1 సంవత్సరం.
దరఖాస్తు ఫీజు: రూ. 100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు  ఫీజు లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 28-02-2024
వెబ్‌సైట్‌: https://sr.indianrailways.gov.in/


వాక్‌-ఇన్స్‌

హ్యాండీమ్యాన్‌, యుటిలిటీ ఏజెంట్‌లు

గ్వాలియర్‌లోని ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 44 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 18
హ్యాండీమ్యాన్‌: 21
ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌/ యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌: 05

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం.
ఇంటర్వ్యూ తేదీలు: జనవరి 30, 31, ఫిబ్రవరి 1, 2
స్థలం: హోటల్‌ త్రిష్లా ఇన్‌, కేసర్‌ బాగ్‌ కాలనీ మేళా రోడ్‌, గ్వాలియర్‌ (ఎంపీ).
వెబ్‌సైట్‌: https://aiasl.in/


ప్రవేశాలు

ఓయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ 

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జి. రామ్‌ రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, దూరవిద్య విధానంలో (ఫేజ్‌-2) అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది
1. ఎంబీఏ, ఎంసీఏ  2. ఎంఏ: హిందీ, ఉర్దూ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్‌, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ. 3. ఎమ్మెస్సీ: మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ 4. ఎంకాం 5. బీఏ 6. బీకాం 7. బీబీఏ 8. అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా: మ్యాథమెటిక్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ బయోఇన్ఫర్మేటిక్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, డేటా సైన్స్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌, వేదిక్‌ ఆస్ట్రాలజీ 9. అడ్వాన్స్‌డ్‌ పీజీ డిప్లొమా: వేదిక్‌ ఆస్ట్రాలజీ 10. సర్టిఫికెట్‌ కోర్సు: యోగా

అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ.
బోధన మాధ్యమం: కోర్సును బట్టి ఇంగ్లిష్‌ లేదా తెలుగు లేదా ఉర్దూ రెండు మాధ్యమాలు.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.300. ఫేజ్‌-ఖిఖి అడ్మిషన్లకు చివరి తేదీ: 31-03-2024.
వెబ్‌సైట్‌: http://www.oucde.net/index.php


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని