ఎన్‌టీపీసీలో అవకాశాలు

న్యూదిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) 223 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఆపరేషన్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులను ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన నియమిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు 

Published : 31 Jan 2024 00:04 IST

న్యూదిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) 223 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఆపరేషన్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులను ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన నియమిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు 

దరఖాస్తు చేయాలంటే.. బీఈ, బీటెక్‌ (ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌) 40 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పాసైతే సరిపోతుంది. పవర్‌ ప్లాంట్‌ నిర్వహణలో ఏడాది పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ముందుగా 3 ఏళ్ల కాలానికి ఎంపిక చేస్తారు. అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరాలను బట్టి మరో 2 ఏళ్లపాటు పొడిగించే అవకాశం ఉంటుంది.

మొత్తం 223 ఉద్యోగాల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 98, ఈడబ్ల్యూఎస్‌లకు 22, ఓబీసీలకు 40, ఎస్సీలకు 39, ఎస్టీలకు 24 కేటాయించారు. దరఖాస్తు రుసుము రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీసెమెన్‌, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.

08.02.2024 నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్లు, ఎక్స్‌ - సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపు ఉంటుంది.

నిర్ణీత వేతనం నెలకు రూ.55,000. హెచ్‌ఆర్‌ఏ/ కంపెనీ వసతి, రాత్రి విధుల అలవెన్సు, ఉద్యోగికి, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలూ వర్తిస్తాయి.

ఎంపిక: దరఖాస్తుల స్క్రీనింగ్‌, షార్ట్‌లిస్టింగ్‌, సెలక్షన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

  • ఇంటర్వ్యూ సమయంలో ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులకు ఎన్‌టీపీసీకి చెందిన ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షకు ఎలాంటి సడలింపులూ వర్తించవు.
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత.. ప్రత్యేక నంబర్‌తో సిస్టమ్‌ జనరేట్‌ చేసిన దరఖాస్తు స్లిప్‌ను అభ్యర్థులు తమ వద్ద భద్రపరుచుకోవాలి. పోస్టులో ఏ డాక్యుమెంటునూ పంపాల్సిన అవసరం లేదు.
  • తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ ఎన్‌టీపీసీ వెబ్‌సైట్‌ను చూస్తుండాలి.
  • ఎంపికైన అభ్యర్థులను ఎన్‌టీపీసీకి చెందిన స్టేషన్లు, యూనిట్లు, అనుబంధ సంస్థల్లో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులే దరఖాస్తు చేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 08.02.2024
వెబ్‌సైట్‌: www.ntpc.co.in 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని