ఎన్‌ఆర్‌ఎస్‌సీలో సైంటిస్ట్‌/ఇంజినీర్‌లు

నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) 41 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.  

Updated : 31 Jan 2024 05:26 IST

నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) 41 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.  

1. సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్సీ’- అగ్రికల్చర్‌: 02. ఎంఈ/ ఎంటెక్‌ -  రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జీఐఎస్‌/ జియోఇన్ఫర్మాటిక్స్‌ పాసవ్వాలి.

2. ఫారెస్ట్రీ ఎకానమీ: 04. ఎమ్మెస్సీ - బోటనీ/ ఫారెస్ట్రీ/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి.

3. జియో ఇన్ఫర్మాటిక్స్‌: 07. ఎమ్మెస్సీ (జియా ఇన్ఫర్మాటిక్స్‌/ తత్సమాన కోర్సు) పాసవ్వాలి. లేదా ఎంఈ/ఎంటెక్‌ (రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జీఐఎస్‌/ జియా ఇన్ఫర్మాటిక్స్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌) పూర్తిచేయాలి.

4. జియాలజీ: 04. ఎంఎస్సీ జియాలజీ/ అప్లైడ్‌ జియాలజీ/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి.

5. జియో ఫిజిక్స్‌: 04. ఎమ్మెస్సీ/ ఎంఎస్సీ టెక్‌ - జియోఫిజిక్స్‌/ తత్సమాన కోర్సు పాసవ్వాలి.

6. సాయిల్‌ సైన్స్‌: 04. ఎమ్మెస్సీ - సాయిల్‌ సైన్స్‌ అండ్‌ అగ్రికల్చర్‌ కెమిస్ట్రీ/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి.

7. అర్బన్‌ స్టడీస్‌: 3. ఎంఈ/ఎంటెక్‌ - అర్బన్‌ ప్లానింగ్‌/ రీజనల్‌ ప్లానింగ్‌/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి.

8. వాటర్‌ రిసోర్సెస్‌: 7.ఎంఈ/ ఎంటెక్‌ - సివిల్‌ ఇంజినీరింగ్‌ (వాటర్‌ రిసోర్సెస్‌/ హైడ్రాలజీ/ సాయిల్‌ అండ్‌ వాటర్‌ కన్సర్వేషన్‌) లేదా అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ (వాటర్‌ రిసోర్సెస్‌/ హైడ్రాలజీ/ సాయిల్‌ అండ్‌ వాటర్‌ కన్సర్వేషన్‌)/ వాటర్‌ రిసోర్సెస్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేయాలి.

9. మెడికల్‌ ఆఫీసర్‌ ‘ఎస్సీ’: 01. ఎంబీబీఎస్‌, రెండేళ్ల అనుభవం ఉండాలి.

10. నర్స్‌-బి: 02. ఎస్‌ఎస్‌సీ, జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీలో ఫస్ట్‌క్లాస్‌ డిప్లొమాతోపాటు.. స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో నమోదు కావాలి.

11. లైబ్రరీ అసిస్టెంట్‌-ఎ: 03. డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ (లైబ్రరీ సైన్స్‌/ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ తత్సమాన పరీక్ష) మొదటి శ్రేణిలో పాసవ్వాలి.  

మెడికల్‌ ఆఫీసర్‌, నర్స్‌-బి, లైబ్రరీ అసిస్టెంట్‌-ఎ పోస్టులకు గరిష్ఠ వయసు 35 ఏళ్లు. మిగతా పోస్టులకు 30 సంవత్సరాలు. ప్రత్యేక కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు రూ.750. అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థులూ ఈ రుసుమును చెల్లించాలి. రాత పరీక్షకు హాజరైన ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును మినహాయించి రూ.500 రిఫండ్‌ చేస్తారు.

ఎంపిక: సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెడికల్‌ ఆఫీసర్‌, నర్స్‌-బి, లైబ్రరీ అసిస్టెంట్‌-ఎ పోస్టులకు ఇంటర్వ్యూ, రాత పరీక్ష + స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

  • సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ పోస్టులకు ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.

బీటెక్‌ ఆధారిత రిక్రూట్‌మెంట్లకు: పార్ట్‌-ఎకు 60 మార్కులు, వ్యవధి 75 నిమిషాలు. ప్రశ్నకు 1 మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ 0.33 మార్కు తగ్గిస్తారు. సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.

  • పార్ట్‌-బిలోని ఆప్టిట్యూడ్‌/ ఎబిలిటీ టెస్ట్‌లో మల్టిపుల్‌ ఛాయిస్‌ 15 ప్రశ్నలకు 20 మార్కులు. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. వ్యవధి 30 నిమిషాలు.
  • పార్ట్‌-సిలో డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలకు 20 మార్కులు. వ్యవధి 30 నిమిషాలు. ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
  • అభ్యర్థులు ప్రతి పార్ట్‌లోనూ, ఇంటర్వ్యూలోనూ 50 శాతం మార్కులు సాధించాలి.
  • రిజర్వుడ్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి.

ఎంఎస్సీ ఆధారిత రిక్రూట్‌మెంట్లకు: ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు మాత్రమే ఉంటాయి. పార్ట్‌-ఎలోని 80 ప్రశ్నలకు, 80 మార్కులు. వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నకు 1 మార్కు, ప్రతి తప్పు సమాధానానికీ 0.33 మార్కు తగ్గిస్తారు. సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.  

  • పార్ట్‌-బిలోని 15 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 20 మార్కులు. వ్యవధి 30 నిమిషాలు.
  • అభ్యర్థులు రెండు పార్టుల్లోనూ 50 శాతం మార్కులు సాధించాలి.  

లైబ్రరీ అసిస్టెంట్‌ పోస్టుకు: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఉంటాయి. రాత పరీక్షలో 80 ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నకు 1 మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ 0.33 మార్కు తగ్గిస్తారు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను స్కిల్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు.

  • స్కిల్‌ టెస్ట్‌కు 100 మార్కులు. ఇది అర్హత పరీక్ష మాత్రమే.
  • తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో మాత్రమే రాత పరీక్షను నిర్వహిస్తారు.

గమనించాల్సినవి: ఇవన్నీ తాత్కాలిక పోస్టులే అయినప్పటికీ పర్మనెంట్‌ చేసే అవకాశం ఉంటుంది.

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలను ఈమెయిల్‌ ఐడీకి   తెలియజేస్తారు.
  • ప్రభుత్వ ఉద్యోగం చేస్తోన్న అభ్యర్థులు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను తప్పనిసరిగా సమర్పించాలి.
  • కటికంటే ఎక్కువ దరఖాస్తులు పంపితే.. చివరిదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 12.02.2024
వెబ్‌సైట్‌:  www.nrsc.gov.in 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని