న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో అవకాశాలు

శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారిని విధుల్లోకి తీసుకుని నెలకు రూ. 35,400 మూల వేతనం చెల్లిస్తారు. దీనికి డీఏ ఇతర ప్రోత్సాహకాలూ కలిపి మొత్తంగా నెలకు రూ.51,684 వేతనం అందుకోవచ్చు.

Published : 06 Feb 2024 00:17 IST

రాజస్థాన్‌ రావత్‌భటలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) 53 స్టైపెండరీ ట్రెయినీ/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

1. స్టైపెండరీ ట్రెయినీ/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (డిప్లొమా): 49 ఖాళీలు. మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసవ్వాలి. మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తిచేయాలి. ఎస్‌ఎస్‌సీ/ హెచ్‌ఎస్‌సీ స్థాయిలో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా చదవాలి.

2. స్టైపెండరీ ట్రెయినీ/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (సైన్స్‌ గ్రాడ్యుయేట్‌): 04 ఖాళీలు. బీఎస్సీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టుగా, కెమిస్ట్రీ/ మేథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ సబ్సిడరీ సబ్జెక్టులుగా చదివుండాలి. లేదా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌ సబ్జెక్టులతో బీఎస్సీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్‌ఎస్‌సీ/ హెచ్‌ఎస్‌సీ స్థాయిలో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా చదవాలి. బీఎస్సీ మేథమెటిక్స్‌ చదివినవారు దరఖాస్తు చేయడానికి అర్హులు కాదు.
రెండు పోస్టులకూ అభ్యర్థుల ఎత్తు 160 సెం.మీ., కనీసం 45.5 కేజీల బరువు ఉండాలి.
స్టైపెండ్‌: శిక్షణ కాలంలో మొదటి ఏడాది నెలకు రూ.24 వేలు, రెండో ఏడాది నెలకు రూ.26 వేలు స్టైపెండ్‌ చెల్లిస్తారు. బుక్‌ అలవెన్స్‌ నిమిత్తం ఒకేసారి రూ.3,000 ఇస్తారు.
శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారిని విధుల్లోకి తీసుకుని నెలకు రూ. 35,400 మూల వేతనం చెల్లిస్తారు. దీనికి డీఏ ఇతర ప్రోత్సాహకాలూ కలిపి మొత్తంగా నెలకు రూ.51,684 వేతనం అందుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మినహాయింపులు వర్తిస్తాయి. ఎన్‌పీసీఐఎల్‌ ఉద్యోగులకు గరిష్ఠ వయసు నిబంధన లేదు.

గమనించాల్సినవి: 

ఉద్యోగ సమాచారాన్ని ఈమెయిల్‌ ఐడీకి తెలియజేస్తారు.  
రాత పరీక్ష తేదీ, ప్రదేశాలను అడ్మిట్‌ కార్డ్‌ ద్వారా తెలుపుతారు.
రెండు పోస్టులకూ పోటీ పడటానికి వేర్వేరుగా దరఖాస్తు చేయాలి, నిర్దిష్ట ఫీజు చెల్లించాలి. పరీక్షను ఒకే సెషన్‌లో నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థి ఒక్క పరీక్షనే ఎంపికచేసుకుని రాయాల్సివుంటుంది.
కేంద్ర/ రాష్ట్ర/ పీఎస్‌యూలో పనిచేస్తున్నవారు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను ఇంటర్వ్యూకు ముందే సమర్పించాలి.


రాతపరీక్షలో...

  • రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఓఎంఆర్‌/ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది.
  • 50 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు 100 మార్కులు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
  • డిప్లొమా అభ్యర్థులకు మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టులకు సంబంధించిన 50 ప్రశ్నలు ఇస్తారు.  
  • బీఎస్సీ అభ్యర్థులకు ఫిజిక్స్‌ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. కాబట్టి సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకుని.. సబ్జెక్టులపై గట్టిపట్టు
  • సాధించాలి.
  • రాత పరీక్ష జనరల్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ/ ఎస్టీ /ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి. కనీసార్హత మార్కులు సాధించినవారికి డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌,  ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ నిర్వహించి.. 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.
  • ఇంటర్వ్యూకు 100 మార్కులు. దీంట్లో జనరల్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ/ ఎస్టీ /ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి.
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ను తయారుచేస్తారు. రాత పరీక్ష 50 శాతం, ఇంటర్వ్యూలకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థులు ఇంగ్లిష్‌ లేదా హిందీ భాషల్లో సమాధానాలు చెప్పొచ్చు.  
  • రాత పరీక్షకు హాజరయ్యే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రెండో తరగతి ప్రయాణ ఛార్జీలను చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము రూ.150. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులు, ఎన్‌పీసీఐఎల్‌ ఉద్యోగులకు ఫీజు లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ: 14.02.2024
వెబ్‌సైట్‌:https://www.npcilcareers.co.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని