ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌లు

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) 35 నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Updated : 26 Feb 2024 00:56 IST

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) 35 నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ, నోయిడాల్లోని ప్లాంట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

మొత్తం 35 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 23, ఎస్సీలకు 05, ఎస్టీలకు 01, ఓబీసీలకు 05, ఈడబ్ల్యూఎస్‌లకు 01 కేటాయించారు.

  • జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 (ప్రొడక్షన్‌)- 8: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌ సబ్జెక్టులతో బీఎస్సీ/ కెమికల్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 
  • ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 (ప్రొడక్షన్‌)-2: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో బీఎస్సీ/ కెమికల్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి. వయసు 18-40 ఏళ్లుండాలి. ఫెర్టిలైజర్స్‌/ కెమికల్‌/ పెట్రోకెమికల్‌/ హైడ్రోకార్బన్‌ పరిశ్రమలో 7 ఏళ్ల అనుభవం ఉండాలి.
  • జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 (మెకానికల్‌)-03: మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి. వయసు 18-30 సంవత్సరాలు ఉండాలి.
  • జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 (ఇన్‌స్ట్రుమెంటేషన్‌)-04: ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ డిప్లొమా పాసవ్వాలి. వయసు 18-30 ఏళ్లు ఉండాలి.
  • ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 (ఇన్‌స్ట్రుమెంటేషన్‌)-01: ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ డిప్లొమా పాసవ్వాలి. ఫెర్టిలైజర్స్‌/ కెమికల్‌/ పెట్రోకెమికల్‌/ పవర్‌ జనరేషన్‌/ డిస్ట్రిబ్యూషన్‌ పరిశ్రమల్లో 7 ఏళ్ల ఉద్యోగానుభవం. వయసు 18-40 సంవత్సరాలు ఉండాలి.
  • జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 (కెమికల్‌ ల్యాబ్‌)-01: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ పాసవ్వాలి. వయసు 18-30 ఏళ్లు ఉండాలి.
  • ఆఫీస్‌ అసిస్టెంట్‌- గ్రేడ్‌-3: 04: ఏదైనా డిగ్రీ పాసవడంతోపాటు ఎంఎస్‌-ఆఫీస్‌లో నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్‌ అప్లికేషన్‌లో సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 18-30 ఏళ్లు.
  • 29.02.2024 నాటికి తగిన విద్యార్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.200. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/ డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

పరీక్షలో...

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీలో.. రెండు పార్ట్‌లుగా ఉంటుంది. వ్యవధి 2 గంటలు. మొత్తం 150 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకూ 1 మార్కు

  • పార్ట్‌-1లోని 100 ప్రశ్నలు పోస్టును బట్టి.. డిప్లొమా/ బీఎస్సీ/ డిగ్రీ స్థాయిలో ఉంటాయి. పార్ట్‌-2లోని 50 ప్రశ్నలు.. జనరల్‌ ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్‌కు సంబంధించినవి ఇస్తారు.
  • నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలను రాయాలి. తెలియనివాటికి సమయం తీసుకుని ఆలోచించి గుర్తించవచ్చు.
  • సీబీటీలో సాధించిన మార్కులు, కేటగిరీల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • అన్‌రిజర్వుడ్‌/ ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు వేర్వేరుగా మెరిట్‌ లిస్ట్‌ను తయారుచేస్తారు.
  • ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక చేస్తారు.  
  • ఎంపిక చేసిన అభ్యర్థులను దేశంలో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది.
  • సీబీటీని ఏ తేదీన, ఎక్కడ నిర్వహించేదీ అడ్మిట్‌ కార్డ్‌ ద్వారా తెలియజేస్తారు. ఈ కార్డ్‌ను సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.. పోస్టులో పంపరు.
  • తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శిస్తుండాలి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌; కర్నూల్‌, విజయవాడ, విశాఖపట్నం

దరఖాస్తుకు చివరి తేదీ: 10.03.2024

వెబ్‌సైట్‌: https://www.rfcl.co.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని