సెయిల్‌లో కొలువులకు సిద్ధమేనా?

మహారత్న కేటగిరీకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ.. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) 314 ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (ట్రెయినీ)- (ఓసీటీటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 28 Feb 2024 00:02 IST

మహారత్న కేటగిరీకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ.. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) 314 ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (ట్రెయినీ)- (ఓసీటీటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారిని దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ కర్మాగారాలు/ యూనిట్లు/ గనుల్లో ఎక్కడైనా నియమిస్తారు.

సీటీటీ- మెటలర్జీ-57 పోస్టులు, ఎలక్ట్రికల్‌-64, మెకానికల్‌-100, ఇన్‌స్ట్రుమెంటేషన్‌-17, సివిల్‌-22, కెమికల్‌-18, సిరామిక్‌-06, ఎలక్ట్రానిక్స్‌-08, కంప్యూటర్‌/ఐటీ-20, డ్రాఫ్ట్స్‌మెన్‌-02 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేయాలంటే...పదోతరగతితోపాటు.. మెటలర్జీ/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌, ఇన్‌స్ట్రుమెంటేన్‌ అండ్‌ ఆటోమేషన్‌, సివిల్‌, కెమికల్‌, సిరామిక్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉండాలి. డిస్టెన్స్‌/ కరస్పాండెన్స్‌ డిప్లొమా పూర్తిచేసినవారు అనర్హులు.

  • అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడుదు. ప్రత్యేక కేటగిరీల అభ్యర్థులకు గరిష్ఠ వయసు సడలింపులు ఉంటాయి.
  • జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఈఎస్‌ఎం/ డిపార్ట్‌మెంటల్‌ వారికి రూ.200. ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి.

ఎంపిక విధానం

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లిష్‌లో ఉంటుంది. 100 ఆబెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రంలో 2 పార్ట్‌లు ఉంటాయి.

  • డొమైన్‌ పరిజ్ఞానానికి సంబంధించిన 50 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో 50 ప్రశ్నలు ఇస్తారు. సీబీటీ వ్యవధి 90 నిమిషాలు.
  • సీబీటీలో అన్‌రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌)/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
  • సీబీటీలో ప్రతిభ చూపిన అభ్యర్థులను  1:3 నిష్పత్తిలో స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఈ టెస్టును సెయిల్‌కు చెందిన కర్మాగారాలు/ యూనిట్లు/ గనుల్లో నిర్వహిస్తారు.
  • నిర్దిష్ట శారీరక ప్రమాణాలతో పాటు అభ్యర్థులకు ఎటువంటి దృష్టీ, వినికిడి సమస్యలు ఉండకూడదు.

ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ఆన్‌ జాబ్‌ శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి ఏడాదిలో నెలకు రూ.16 వేలు, రెండో సంవత్సరంలో నెలకు రూ.18 వేలు వేతనంగా చెల్లిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు రూ.38,920 వరకూ వేతనం అందుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ: 18.03.2024
వెబ్‌సైట్‌: www.sail.co.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని