నోటీస్‌బోర్డు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఫేజ్‌-శ్రీఖిఖి/ 2024)కు సంబంధించిన 2049 పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది.

Published : 29 Feb 2024 00:13 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర శాఖల్లో 2,049 సెలక్షన్‌ పోస్టులు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఫేజ్‌-శ్రీఖిఖి/ 2024)కు సంబంధించిన 2049 పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది.

కేటగిరీ వారీ ఖాళీలు: ఎస్సీ- 255; ఎస్టీ- 124; ఓబీసీ- 456; యూఆర్‌- 1028; ఈడబ్ల్యూఎస్‌- 186.

ఖాళీలున్న విభాగాలు: ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్‌, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ మినిస్ట్రీ, హోం అఫైర్స్‌ మినిస్ట్రీ, డిఫెన్స్‌ మినిస్ట్రీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, సెంట్రల్‌ ట్రాన్స్‌లేషన్‌ బ్యూరో, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌.. తదితరాలు.

పోస్టులు: లైబ్రరీ అటెండెంట్‌, మెడికల్‌ అటెండెంట్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌, ఫార్మసిస్ట్‌, ఫీల్డ్‌మ్యాన్‌, అకౌంటెంట్‌, అసిస్టెంట్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌, ఫోర్‌మాన్‌, జూనియర్‌ ఇంజినీర్‌, యూడీసీ, డ్రైవర్‌-కమ్‌ మెకానిక్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, సూపర్‌వైజర్‌, సీనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, స్టోర్‌ కీపర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, రిసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌, కోర్ట్‌ క్లర్క్‌, సీనియర్‌ జియోగ్రాఫర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, డిప్లొమా, డిగ్రీ.

వయసు: కనిష్ఠంగా 18 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌- టైపింగ్‌/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (సంబంధిత ఖాళీలకు మాత్రమే), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజుమినహాయింపు ఉంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18.03.2024.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19.03.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 22.03.2024 నుంచి 24.03.2024 వరకు.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీలు: మే 6 నుంచి 8 వరకు.

వెబ్‌సైట్‌: https://ssc.gov.in/


ఎస్‌బీఐలో 50 క్రెడిట్‌ అనలిస్ట్‌లు

రెగ్యులర్‌ ప్రాతిపదికన 50 క్రెడిట్‌ అనలిస్ట్‌ (మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ 3) పోస్టుల భర్తీకి ముంబయిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: డిగ్రీ. ఎంబీఏ (ఫైనాన్స్‌)/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ ఎంఎంఎస్‌ (ఫైనాన్స్‌)/ సీఏ/ సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏతో పాటు పని అనుభవం.

వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతన శ్రేణి: రూ.63,840-78,230.

దరఖాస్తు ఫీజు: రూ.750.

ఎంపిక: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04-03-2024.

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/


పీఎఫ్‌సీలో కో-ఆర్డినేటర్‌లు

వర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 27 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • కో-ఆర్డినేటర్‌ (సీఎస్‌ఆర్‌)/లెవల్‌ 1: 02
  • కో-ఆర్డినేటర్‌ (ఆర్‌డిఎస్‌ఎస్‌)-1/లెవల్‌ 3: 01
  • కో-ఆర్డినేటర్‌ (ఆర్‌డిఎస్‌ఎస్‌)-2/లెవల్‌ 3: 01
  • కో-ఆర్డినేటర్‌ (ఆర్‌డిఎస్‌ఎస్‌)-3/లెవల్‌ 3: 03
  • కో-ఆర్డినేటర్‌ (ఆర్‌డిఎస్‌ఎస్‌)-3/లెవల్‌ 2: 19
  • కో-ఆర్డినేటర్‌ (ఆర్‌డిఎస్‌ఎస్‌)-2/లెవల్‌ 2: 01

అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏతో పాటు పని అనుభవం.

వేతనం: లెవెల్‌ 1 వారికి రూ.65,000, లెవెల్‌ 2 వారికి రూ.90,000, లెవెల్‌ 3 వారికి రూ.1,25,000.

దరఖాస్తు ఫీజు: రూ. 500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-03-2024

వెబ్‌సైట్‌:  https://pfcindia.com/ensite


ప్రవేశాలు

రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో కోర్సులు

ర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం, శివమొగ్గ క్యాంపస్‌ 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌: ఏడాది వ్యవధి
1. సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌
2. పోలీస్‌ సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌

బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌: నాలుగేళ్ల వ్యవధి
1. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌)
2. బీఏ/ బీఎస్సీ (డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌)

మాస్టర్‌ ప్రోగ్రామ్‌: రెండేళ్ల వ్యవధి
1. ఎంఏ (పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌)
2. ఎంఏ/ ఎమ్మెస్సీ (క్రిమినాలజీ)
3. ఎమ్మెస్సీ (క్లినికల్‌ సైకాలజీ)
4. ఎంఏ/ ఎమ్మెస్సీ (డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌)

సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌: 2 వారాల వ్యవధి
1. కోస్టల్‌ సెక్యూరిటీ అండ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌
2. రోడ్‌ ట్రాఫిక్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌

అర్హత: ప్రోగ్రామ్‌ను బట్టి పన్నెండో తరగతి/ పీయూసీ, బీఎస్సీ, డిగ్రీ.

ప్రవేశ ప్రక్రియ: ప్రవేశ పరీక్ష తదితరాల ఆధారంగా.

వెబ్‌సైట్‌:  https://rru.ac.in/admission/#


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని