పుణె ఐఐఐటీలో అవకాశాలు

పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) 15 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Published : 29 Feb 2024 00:25 IST

పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) 15 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


 

గ్రూప్‌-ఎ పోస్టులైన అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, జూనియర్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మిగతా పోస్టులకు రాత పరీక్ష ఒక్కటే ఉంటుంది.

1. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌-02: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ 55 శాతం మార్కులతో పాసవ్వాలి. సంబంధిత రంగంలో 8 ఏళ్ల అనుభవం ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్‌/ లీగల్‌/ ఫైనాన్స్‌/ స్టోర్స్‌ అండ్‌ పర్చేజ్‌/ ఎస్టాబ్లిష్‌మెంట్‌ వ్యవహారాల నిర్వహణలో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 45 సంవత్సరాలు.

2. జూనియర్‌ సూపరింటెండెంట్‌-04: డిగ్రీ ప్రథమ శ్రేణిలో పాసవ్వాలి. సంబంధిత రంగంలో 6 ఏళ్ల అనుభవం ఉండాలి. మేనేజ్‌మెంట్‌/ ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌/ అడ్మినిస్ట్రేషన్‌/ లీగల్‌/ స్టోర్స్‌, పర్చేజ్‌/ ఎస్టాబ్లిష్‌మెంట్‌ వ్యవహారాల్లో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం. 32 సంవత్సరాలు మించకూడదు.

3. ఫిజికల్‌ ట్రైనింగ్‌ కమ్‌ యోగా ఇన్‌స్ట్రక్టర్‌-1: ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిగ్రీ (బీపీఈడీ) పాసవడంతోపాటుగా 3 ఏళ్ల అనుభవం ఉండాలి. యోగా సర్టిఫికెట్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, నిర్వహణ సామర్థ్యం ఉన్నవారికి ప్రాధాన్యం. వయసు 32 సంవత్సరాలు మించకూడదు.

4. జూనియర్‌ టెక్నీషియన్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌)-01: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిప్లొమాలో డిప్లొమా/ డిగ్రీ పాసవ్వాలి. లేదా ఐటీఐ పాసవడంతోపాటు 2 ఏళ్ల అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.

సిస్టమ్‌ మెయింటెనెన్స్‌ అండ్‌ ట్రబుల్‌ షూటింగ్‌, ఓఎస్‌ ఇన్‌స్టలేషన్స్‌, డ్రైవర్‌ ఇన్‌స్టలేషన్స్‌, మెయింటెనెన్స్‌ ఆఫ్‌ సర్వర్స్‌, నెట్‌వర్కింగ్‌, వైఫై సెట్టింగ్స్‌, వైర్డ్‌ అండ్‌ వైర్‌లెస్‌ లాన్‌ పరిజ్ఞానం ఉండాలి. పైతాన్‌, జావా, సీ++, రౌటింగ్‌లలో ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం.

5. జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌)-01: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా/ డిగ్రీ పాసవ్వాలి. లేదా ఐటీఐ పాసై, 2 ఏళ్ల అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.

సర్క్యూట్‌ లా, ఏసీ ఫండమెంటల్స్‌, ఎలక్ట్రికల్‌ కంట్రోల్‌ సర్క్యూట్స్‌, సెన్సర్స్‌, కమ్యూనికేషన్‌ - నెట్‌వర్క్స్‌, ఎలక్ట్రిక్‌ డివైజెస్‌ సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌.. మొదలైన వాటిలో ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

6. జూనియర్‌ అసిస్టెంట్‌-05: డిగ్రీతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.

  • కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ సైన్స్‌ డిగ్రీ/ డిప్లొమాతోపాటు పేరోల్‌, అకౌంట్స్‌ పరిజ్ఞానం.
  • ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సెక్రటేరియల్‌ ప్రాక్టీస్‌ డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

7. జూనియర్‌ టెక్నీషియన్‌ (లైబ్రరీ)-01: డిగ్రీతోపాటు లైబ్రరీసైన్స్‌ డిప్లొమా పాసవ్వాలి. లేదా లైబ్రరీ సైన్స్‌ డిగ్రీ పాసవ్వాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.

లైబ్రరీ మేనేజ్‌మెంట్‌లో ప్రస్తుత పోకడలు, పరిజ్ఞానం తెలిసినవారికి ప్రాధాన్యం.

దరఖాస్తు ఫీజు: గ్రూప్‌-ఎ పోస్టులకు రూ.1180. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.590. గ్రూప్‌ బీ, సీ

పోస్టులకు: రూ.590. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.295.

6 నెలల కంటే తక్కువ ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోరు.

  • గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.  
  • ఎంపికైన అభ్యర్థులను ముందుగా 5 ఏళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగి పనితీరు, సంస్థ అవసరాల దృష్ట్యా మరో 5 ఏళ్ల కాలానికి కాంట్రాక్టును పొడిగించే అవకాశం ఉంటుంది.
  • సంతృప్తికరమైన పనితీరును కనబరిచిన వారిని శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

రాత పరీక్ష: ఆఫ్‌లైన్‌ విధానంలో పుణె ఐఐఐటీ క్యాంపస్‌లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ 1 మార్కు కేటాయిస్తారు.

  • జనరల్‌ ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ - 20 ప్రశ్నలు.
  • జనరల్‌ స్టడీస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ - 10 ప్రశ్నలు.
  • ఎంఎస్‌-వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌, ఇంటర్నెట్‌, ఈమెయిల్స్‌కు సంబంధించి - 20 ప్రశ్నలు.
  • సిస్టమ్‌ మెయింటెనెన్స్‌ అండ్‌ ట్రబుల్‌ షూటింగ్‌, ఓఎస్‌ ఇన్‌స్టలేషన్స్‌, డ్రైవర్‌ ఇన్‌స్టలేషన్స్‌, మెయింటెనెన్స్‌ ఆఫ్‌ సర్వర్స్‌, నెట్‌వర్కింగ్‌, వైఫై సెట్టింగ్స్‌, పైతాన్‌, జావా, సి ++ కు సంబంధించినవి - 50 ప్రశ్నలు.
  • రాత పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
  • 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
  • పూర్తిచేసిన దరఖాస్తుకు డిమాండ్‌ డ్రాఫ్ట్‌, విద్యార్హతలు, అనుభవాన్ని తెలిపే సర్టిఫికెట్‌ కాపీలను జతచేసి స్పీడ్‌/ రిజిస్టర్‌/ కొరియర్‌లో పంపాలి.

చిరునామా: ది డైరెక్టర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), పుణె, సర్వే నం.9/1/3, అంబెగావ్‌ బద్రుక్‌, సింహ్‌ఘడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రోడ్‌, పుణె-411 041. మహారాష్ట్ర.
దరఖాస్తుకు చివరి తేదీ: 18.03.2024

వెబ్‌సైట్‌: http://www.iiitp.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని