నోటీస్‌బోర్డు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రిషికేశ్‌లోని తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీహెచ్‌డీసీ) ఇండియా లిమిటెడ్‌.. 10 ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 05 Mar 2024 00:12 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
టీహెచ్‌డీసీలో ఇంజినీర్‌ ట్రెయినీలు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రిషికేశ్‌లోని తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీహెచ్‌డీసీ) ఇండియా లిమిటెడ్‌.. 10 ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ (ఇంజినీరింగ్‌)తో పాటు గేట్‌- 2023 స్కోరు.
వయసు: 28.02.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 - రూ.1,80,000 వరకు.
ఎంపిక: గేట్‌ 2023 స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.600. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌/ దరఖాస్తుకు చివరి తేదీ: 29-03-2024.
వెబ్‌సైట్‌:https://thdc.co.in/en


బెల్‌లో సీనియర్‌ ఆసిస్టెంట్‌ ఇంజినీర్‌లు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)..

ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ప్రాతిపదికన 24 సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమాతో పాటు 15 ఏళ్ల పని అనుభవం.
వేతనం: నెలకు రూ.30,000 - రూ.1,20,000 వరకు.
వయసు: 50 సంవత్సరాలు మించకూడదు.
పని ప్రదేశాలు: గువాహటి, దిల్లీ, శ్రీనగర్‌, ముంబయి, కొచ్చి, కార్వార్‌, పోర్ట్‌బ్లెయిర్‌, విశాఖపట్నం.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-03-2024.
వెబ్‌సైట్‌:https://bel-india.in/


ప్రవేశాలు

శ్రీచిత్ర తిరునాల్‌లో పీజీ, పీహెచ్‌డీ  

కేరళ రాష్ట్ర త్రివేండ్రంలోని శ్రీచిత్ర తిరునాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ.. అకడమిక్‌ సెషన్‌ జులై 2024 సంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

1. పీహెచ్‌డీ (ఫిజికల్‌ సైన్స్‌, కెమికల్‌ సైన్స్‌, బయోలాజికల్‌ సైన్స్‌, బయో ఇంజినీరింగ్‌, బయోమెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మెడికల్‌ సైన్స్‌ అండ్‌ హెల్త్‌ సైన్సెస్‌)
2. ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ (ఎండీ-పీహెచ్‌డీ, డీఎం/ఎంసీహెచ్‌-పీహెచ్‌డీ)
3. మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌)
4. డిప్లొమా ఇన్‌ పబ్లిక్‌ హెల్త్‌ (డీపీహెచ్‌)
5. ఎంటెక్‌ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-03-2024.
పరీక్ష కేంద్రాలు: తిరువనంతపురం, చెన్నై, ముంబయి, దిల్లీ, కోల్‌కతా.
వెబ్‌సైట్‌:https://www.sctimst.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని