నోటీస్‌బోర్డు

పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియోలజీ- 30 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 06 Mar 2024 00:07 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

పుణెలోని ఐఐటీఎమ్‌లో రిసెర్చ్‌ అసోసియేట్‌లు

పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియోలజీ- 30 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

రిసెర్చ్‌ అసోసియేట్‌: 10
రిసెర్చ్‌ ఫెలో: 20 

అర్హత: డాక్టరేట్‌ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చదివి ఉండాలి. లేదా మాస్టర్‌ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. దానితో పాటు సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌, యూజీసీ నెట్‌, ఐకార్‌ నెట్‌, గేట్‌, జెస్ట్‌ మార్కులకు ప్రాధాన్యం ఉంటుంది.
సబ్జెక్టులు: మెటీరియోలజీ, అట్మాస్ఫిరిక్‌ సైన్సెస్‌, ఓషనిక్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, అప్లైడ్‌ ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ, ఫిజికల్‌ సైన్సెస్‌, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌
వయసు: 15-04-2024 నాటికి రిసెర్చ్‌ అసోసియేట్‌కు 35 సంవత్సరాలు, రిసెర్చ్‌ ఫెలోకు 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
వేతనం: నెలకు రిసెర్చ్‌ అసోసియేట్‌కు రూ.58,000, రిసెర్చ్‌ ఫెలోకు రూ. 37,000 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా....
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2024

వెబ్‌సైట్‌: https://www.tropmet.res.in/Careers


గోవా షిప్‌యార్డ్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌లు

గోవాలోని షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ - శాశ్వత ప్రాతిపదికన 106 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • అసిస్టెంట్‌ సూపరిన్‌టెండెంట్‌ (హెచ్‌ఆర్‌): 02  
  • అసిస్టెంట్‌ సూపరిన్‌టెండెంట్‌ (హిందీ ట్రాన్స్‌లేటర్‌): 1
  • అసిస్టెంట్‌ సూపరిన్‌టెండెంట్‌ (సీఎస్‌): 1 బీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రికల్‌): 04 బీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఇన్‌స్ట్రుమెంటేెషన్‌): 1
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌): 04
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ (షిప్‌ బిల్డింగ్‌): 20
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌): 1
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఐటీ): 1
  • ఆఫీస్‌ అసిస్టెంట్‌ - క్లరికల్‌ స్టాఫ్‌: 32
  • ఆఫీస్‌ అసిస్టెంట్‌ (ఫైనాన్స్‌/ఐఏ): 06
  • పెయింటర్‌: 20 
  • వెహికల్‌ డ్రైవర్‌: 05
  • రికార్డ్‌ కిపర్‌: 03 
  • కుక్‌ (దిల్లీ): 1
  • కుక్‌: 02 
  • ప్లంబర్‌: 1
  • సేఫ్టీ స్టివార్డ్‌: 1

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీబీఏ, గ్రాడ్యుయేట్‌, ఇంజినీరింగ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీఎస్‌డబ్ల్యూ.
దరఖాస్తుకు చివరి తేదీ: 27-03-2024

వెబ్‌సైట్‌: https://goashipyard.in/


ఐఐటీ మద్రాస్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాసు... 64 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

  • చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌: 1
  • అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌: 2  
  • స్పోర్ట్స్‌ ఆఫీసర్‌: 1
  • జూనియర్‌  సూపరింటెండెంట్‌: 9
  • అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌: 4
  • ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌: 3
  • జూనియర్‌ అసిస్టెంట్‌: 30
  • కుక్‌: 2
  • డ్రైవర్‌: 2  
  • సెక్యూరిటీ గార్డ్‌: 10 

అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
వయసు: చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌కు 50 ఏళ్లు; అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌/ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌కు 45 ఏళ్లు; జూనియర్‌ సూపరింటెండెంట్‌/ అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌/ ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌కు 32 ఏళ్లు; జూనియర్‌ అసిస్టెంట్‌/ కుక్‌/ డ్రైవర్‌/ సెక్యూరిటీ గార్డ్‌కు 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12-03-2024.

వెబ్‌సైట్‌: https://recruit.iitm.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని