Published : 03 Apr 2020 00:35 IST

పాకశాస్త్రంలో పొందండి పట్టా!

కలినరీ ఆర్ట్స్‌ కోర్సులు

ప్రాచీన కాలం నుంచీ పలు రకాల ఆహార పదార్థాలు, వివిధ రుచుల పట్ల అందరికీ సహజంగా ఉండే ఆసక్తి కలినరీ ఆర్ట్స్‌ విభాగంలో అనేక  అవకాశాల కల్పనకు కారణమైంది. దీంతో ఎన్నో సంస్థలు రక రకాల కోర్సులను రూపొందించి నిర్వహిస్తున్నాయి.  వాటిలో ప్రధానమైన ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌  ప్రవేశాల కోసం ప్రస్తుతం ప్రకటనను విడుదల చేసింది.
ఆహార పదార్థాలను సేకరించి, శుభ్రతను పాటిస్తూ, రుచిగా వండి, ఆకర్షణీయంగా పళ్లెంలో అలంకరించి, అతిథులకు పద్ధతిగా వడ్డించడమే కలినరీ ఆర్ట్‌. ఆహార పదార్థాల స్వభావం, అందులోని పోషకాలు, వంటలో అనుసరించాల్సిన ప్రమాణాలు మొదలైనవ విషయాలన్నింటినీ కలినరీ ఆర్ట్స్‌లో భాగంగా అభ్యర్థులు అధ్యయనం చేస్తారు. ఈ తరహా చదువులకు ప్రత్యేక సంస్థలు ఉన్నాయి. వాటిలో ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ ముఖ్యమైంది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ని నెలకొల్పారు. ఈ సంస్థ నోయిడా, తిరుపతి క్యాంపస్‌ల్లో బీబీఏ, ఎంబీఏ కలినరీ కోర్సులను అందిస్తోంది. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సుల్లోకి తీసుకుంటారు..
ఇందిరా గాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయంతో కలిసి బీబీఏ, ఎంబీఏ కలినరీ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థుల ప్రాంగణ నియామకాల ద్వారా మంచి అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. హోటళ్లు, ఆతిథ్య సంస్థలు, విమానయాన సంస్థలు, పర్యాటక సంస్థలు, ఆసుపత్రులు, కార్పొరేట్‌ కంపెనీలు, క్యాటరింగ్‌ సంస్థలు తదితరాల్లో వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. సెలబ్రిటీల వద్ద పనిచేయడానికీ అవకాశాలు లభిస్తాయి. సొంతంగా ఫుడ్‌ చెయిన్‌ నిర్వహించుకోవచ్చు.

బీబీఏ : సీట్లు: నోయిడా, తిరుపతి ఒక్కో క్యాంపస్‌లో 120 చొప్పున ఉన్నాయి. విద్యార్హత: 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం. ఇంటర్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: జులై 1, 2020 నాటికి 22 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది.  
పరీక్ష విధానం: ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాల్లో ఒక్కోదాని నుంచి  20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు లేవు.
ఎంబీఏ : సీట్లు: ఒక్కో సంస్థలో 30 చొప్పున ఉన్నాయి
అర్హత: బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ లేదా కలినరీ ఆర్ట్స్‌ లేదా హాస్పిటాలిటీ కోర్సులు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం. ఆఖరు సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
వయసు: ఆగస్టు 1, 2020 నాటికి 25 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది.

పరీక్ష తీరు: ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ సర్వీస్‌, ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ విభాగాల్లో ఒక్కోదాని నుంచి 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు
తిరుపతి, నోయిడా రెండు క్యాంపస్‌ల్లోనూ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులూ ఉన్నాయి. డిప్లొమాలో 18 నెలల వ్యవధితో ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఎఫ్‌ అండ్‌ బీ సర్వీస్‌, బేకరీ అండ్‌ కన్ఫెక్షనరీ కోర్సులు అందిస్తున్నారు. సర్టిఫికెట్‌ విభాగంలో 6 నెలల వ్యవధితో ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఎఫ్‌ అండ్‌ బీ సర్వీస్‌ క్రాఫ్ట్‌ కోర్సులు ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు జూన్‌ 18 లోగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 27, 2020.
పరీక్ష తేదీ: మే 16, 2020.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: తిరుపతిలో ఉంది.

వెబ్‌సైట్‌:
http://www.ici.nic.in


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని