డిప్లొమాతో ఎంబీఏ?

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా చేసి పదేళ్లకు పైగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఐఐఎంలో ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా?

Updated : 15 Mar 2022 06:36 IST

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా చేసి పదేళ్లకు పైగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఐఐఎంలో ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా?

- ఎస్‌. రవిశంకర్‌

ది సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత ఎంబీఏ కోర్సు చేయాలన్న మీ నిర్ణయం సరైందే. ఎంబీఏ చదవడానికి ఉద్యోగానుభవం అదనపు అర్హత అవుతుంది. కానీ మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాక డిగ్రీ చేసినట్లుగా చెప్పలేదు. ఐఐఎంలో అయినా, మరే విద్యా సంస్థలో అయినా ఎంబీఏ లాంటి పీజీ కోర్సు చేయాలంటే కనీసం మూడు సంవత్సరాల వ్యవధితో డిగ్రీ పూర్తిచేయాలి. ముందుగా మీరు రెగ్యులర్‌/ ఓపెన్‌ యూనివర్సిటీ/ దూరవిద్య విధానంలో ఏదైనా డిగ్రీ చదవండి. మీకు బీటెక్‌ చేసే ఉద్దేశం ఉంటే, మూడు సంవత్సరాల బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుని ఫుల్‌ టైమ్‌లో చేయండి. ఆ తరువాత క్యాట్‌ ప్రవేశపరీక్ష రాసి, అందులో మెరుగైన స్కోరు సాధించి, రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూల ద్వారా ఐఐఎంలో ప్రవేశం పొందండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని