ఎటు వెళ్లాలి?

బీఎస్సీ అగ్రికల్చర్‌ తరువాత విదేశాల్లో ఎమ్మెస్సీ చేయాలనుకుంటే ముందుగా మీరు ఏ సబ్జెక్ట్‌లో ఎంఎస్సీ/ఎంఎస్‌ చేయాలనుకొంటున్నారో, ఏ దేశంలో చేయాలనుకొంటున్నారో నిర్ణయించుకోండి. ఒకవేళ ఐటీ/సాఫ్ట్‌వేర్‌లో పీజీ చదవాలనుకొంటే

Published : 12 May 2022 01:08 IST

ఏజీ బీఎస్‌సీ చివరి ఏడాది చదువుతున్నా. విదేశాల్లో ఎంఎస్‌సీ చదవాలనుంది. మరోపక్క ఐటీ రంగంవైపూ వెళ్లాలని అభిలాష. ఎటు వెళ్తే మేలు? 

- కె. అనూహ్య

బీఎస్సీ అగ్రికల్చర్‌ తరువాత విదేశాల్లో ఎమ్మెస్సీ చేయాలనుకుంటే ముందుగా మీరు ఏ సబ్జెక్ట్‌లో ఎంఎస్సీ/ఎంఎస్‌ చేయాలనుకొంటున్నారో, ఏ దేశంలో చేయాలనుకొంటున్నారో నిర్ణయించుకోండి. ఒకవేళ ఐటీ/సాఫ్ట్‌వేర్‌లో పీజీ చదవాలనుకొంటే అక్కడికి వెళ్ళేముందే కొన్ని ప్రోగ్రామింగ్‌/ ఐటీ కోర్సుల్లో శిక్షణ పొందండి. అగ్రికల్చర్‌ కానీ, దాని అనుబంధ కోర్సులు కానీ చేయాలనుకొంటే దరఖాస్తు చేయాలనుకొంటున్న యూనివర్సిటీల వెబ్‌సైట్‌లను సందర్శించి మీ విద్యార్హతలను నిర్ధారించుకోండి. అలా కాకుండా ఇక్కడే ఉండి ఐటీ¨ రంగంలోకి వెళ్లాలనుకొంటే అందుకు సంబంధించిన కోర్సులు చేసి ఆ దిశలో ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఎంఎస్‌సీనా, ఐటీ రంగమా అనేది పూర్తిగా మీ ఆసక్తి, అభిరుచి, నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. విదేశాలకు వెళ్ళి ఎంఎస్‌సీ చేసి అక్కడే ఐటీ రంగంలో స్థిరపడితే మీ రెండు కోర్కెలూ నెరవేరే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని