ఎంఫార్మసీ తర్వాత..

ఫార్మకాలజీ అనేది జీవ వ్యవస్థలపై ఔషధాలు ఎలా పనిచేస్తాయి, ఔషధానికి శరీరం ఎలా స్పందిస్తుంది లాంటి విషయాలను అధ్యయనం చేసే శాస్త్రం. రసాయన లక్షణాలు, జీవ ప్రభావాలు, ఔషధాల చికిత్సా ఉపయోగాల గురించి ఈ విభాగం అధ్యయనం చేస్తుంది.

Published : 03 Oct 2022 00:10 IST

మా అమ్మాయి ఫార్మకాలజీ స్పెషలైజేషన్‌తో ఎంఫార్మసీ చివరి ఏడాది చదువుతోంది. తనకు ఏయే సంస్థలు, ల్యాబొరేటరీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి?

- సంజీవరావు

* ఫార్మకాలజీ అనేది జీవ వ్యవస్థలపై ఔషధాలు ఎలా పనిచేస్తాయి, ఔషధానికి శరీరం ఎలా స్పందిస్తుంది లాంటి విషయాలను అధ్యయనం చేసే శాస్త్రం. రసాయన లక్షణాలు, జీవ ప్రభావాలు, ఔషధాల చికిత్సా ఉపయోగాల గురించి ఈ విభాగం అధ్యయనం చేస్తుంది. ఔషధం, ఫార్మసీ, డెంటిస్ట్రీ, నర్సింగ్‌, వెటర్నరీ మెడిసిన్‌తో సహా అనేక విభాగాల పరిజ్ఞానం ఫార్మకాలజీ రంగంలో ఉపయోగపడుతుంది.

ఈ కోర్సు చదివినవారు క్లినికల్‌ స్టడీస్‌, బయో అనలిటికల్‌ స్టడీస్‌, టిష్యూ స్టడీస్‌, బ్లడ్‌ స్టడీస్‌, ఫార్మకో విజిలెన్స్‌ విభాగాలున్న అన్ని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో, ల్యాబొరేటరీల్లో ఉద్యోగాలతో పాటు పరిశోధన కూడా చేయొచ్చు. బోధనపై ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ చేసి ఆ రంగంలోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని