ఎంబీఏల్లో ఏది మెరుగు?

నా ఫ్రెండ్‌ బీబీఏ చేసి ఎంబీఏ చదవాలనుకుంటున్నాడు. డిస్టెన్స్‌ ఎంబీఏ/ఈఎంబీఏల్లో ఏది మెరుగు? ఆపరేషన్స్‌ ఇంజినీర్‌గా పదేళ్ల అనుభవం కూడా ఉంది.

Published : 25 Sep 2023 00:17 IST

నా ఫ్రెండ్‌ బీబీఏ చేసి ఎంబీఏ చదవాలనుకుంటున్నాడు. డిస్టెన్స్‌ ఎంబీఏ/ఈఎంబీఏల్లో ఏది మెరుగు? ఆపరేషన్స్‌ ఇంజినీర్‌గా పదేళ్ల అనుభవం కూడా ఉంది.

రవిశంకర్‌

మీ స్నేహితుడికి బీబీఏతో పాటు పది సంవత్సరాల ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ఈఎంబీఏ (ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ) చదవడమే మంచిది. డిస్టెన్స్‌ ఎంబీఏలో చాలామంది విద్యార్థులు ఉద్యోగానుభవం లేకుండా నేరుగా అడ్మిషన్‌ తీసుకొంటారు. చాలా డిస్టెన్స్‌ ఎంబీఏ ప్రోగ్రాంలలో కాంటాక్ట్‌ క్లాసులకు హాజరు అవ్వాల్సిన అవసరం కూడా లేనందున నైపుణ్యాలను నేర్చుకొనే అవకాశం ఉండదు. ఈఎంబీఏ క్లాస్‌ రూంలో అందరూ ఉద్యోగానుభవం ఉన్నవారే ఉండటం వల్ల ఒకరి అనుభవం నుంచి మరొకరు నేర్చుకొనే అవకాశాలు ఎక్కువ. ఈఎంబీఏ ప్రోగ్రాంలో ప్రతి సెమిస్టర్‌లో కొన్ని కాంటాక్ట్‌ క్లాసులు తప్పనిసరి. ప్రొఫెసర్స్‌ నుంచి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈఎంబీఏ బోధనావిధానం కూడా డిస్టెన్స్‌ ఎంబీఏ కంటే భిన్నం. ఈఎంబీఏలో ఎక్కువగా కేస్‌ డిస్కషన్‌, సెమినార్లు, గేమ్స్‌, యాక్టివిటీస్‌ల సహాయంతో బోధన ఉంటుంది. థియరీ కంటే మెనేజీరియల్‌/ ప్రాక్టికల్‌ అప్లికేషన్స్‌కు ప్రాముఖ్యం అధికం. ఈఎంబీఏను ప్రముఖ బిజినెస్‌ స్కూల్స్‌ నుంచి చేస్తే ఎక్కువ ప్రయోజనాలుంటాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని