ఇంటర్‌ చదవలేదు... సమస్య అవుతుందా

టెన్త్‌ తర్వాత కరస్పాండెన్స్‌ ద్వారా బీఏ చదివి ఎంబీఏ చేశాను. ఇంటర్వ్యూల్లో ఇంటర్‌ సర్టిఫికెట్‌ అడిగితే ఏం చేయాలి? సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు దరఖాస్తు చేయాలంటే ప్రత్యామ్నాయం ఉందా? 

Published : 10 Oct 2023 00:43 IST

టెన్త్‌ తర్వాత కరస్పాండెన్స్‌ ద్వారా బీఏ చదివి ఎంబీఏ చేశాను. ఇంటర్వ్యూల్లో ఇంటర్‌ సర్టిఫికెట్‌ అడిగితే ఏం చేయాలి? సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు దరఖాస్తు చేయాలంటే ప్రత్యామ్నాయం ఉందా? 

శేషులత

దో తరగతి తరువాత మీరు ఇంటర్మీడియట్‌ చదవలేదనేది యధార్థం. దాని గురించి మీరు ఎక్కువగా బాధపడాల్సిన పని లేదు. యూజీసీ నిబంధనల ప్రకారం మీరు కరస్పాండెన్స్‌ సిస్టం ద్వారా డిగ్రీ చదివి ఉంటే, ఇంటర్‌ చదవలేదని కంగారు పడకండి. ఒకవేళ ఇంటర్వ్యూల్లో ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్‌ అడిగితే, నిజాయతీగా ఇంటర్‌ చదవలేదని చెప్పండి. అలా చదవలేకపోవడానికి కారణాలను కూడా ధైర్యంగా చెప్పగలగాలి. ఏ ఇంటర్వ్యూలో అయినా అబద్ధాలు చెప్పకుండా విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, సానుకూల దృక్పథం ఉన్నవారిని విజయం వరించే అవకాశాలు ఎక్కువ. ఏదైనా ఉద్యోగ ప్రకటనలో ఇంటర్మీడియట్‌ కచ్చితంగా చదివి ఉండాలి అన్న నిబంధన ఉంటే తప్ప, డిగ్రీ/ పీజీ అర్హత ఉన్న అన్ని ఉద్యోగాలకూ మీరు అర్హులే. మీకు ఇంటర్‌ సర్టిఫికెట్‌ లేకపోవడం వల్ల కొంత నష్టం కలుగుతుందని భావిస్తే, మీ నైపుణ్యాలతో, విషయ పరిజ్ఞానంతో, నిజాయతీతో ఇంటర్వ్యూలో మెరుగైన ప్రతిభ చూపండి. మారుతున్న పరిస్థితుల్లో సాప్ట్‌వేర్‌ సంస్థ లైనా, ఇతర ప్రైవేటు నియామక సంస్థలైనా పేపర్‌ సర్టిఫికెట్‌ల కంటే రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో అభ్యర్థి చూపే ప్రతిభకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంకా మీకు ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్‌ అవసరం అనుకొంటే, ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా కానీ, ప్రైవేటుగా కానీ ఇంటర్‌ పూర్తి చేయవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని