దూరవిద్యలో వీలవుతుందా?

ఎలక్ట్రానిక్స్‌ డిప్లొమా పూర్తిచేశాను. ప్రస్తుతం చిన్న ఉద్యోగం చేస్తున్నా. దూరవిద్య ద్వారా ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ చేయొచ్చా?

Published : 20 Dec 2023 00:06 IST

ఎలక్ట్రానిక్స్‌ డిప్లొమా పూర్తిచేశాను. ప్రస్తుతం చిన్న ఉద్యోగం చేస్తున్నా. దూరవిద్య ద్వారా ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ చేయొచ్చా?

జేహెచ్‌ఎస్‌.ప్రసాద్‌

ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, లా, ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌గా చదివితేనే మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్‌ కోర్సును దూరవిద్య ద్వారా చదవడం కుదరదు. కానీ మీరు ఈవెనింగ్‌ కళాశాలలో మూడు సంవత్సరాల ఇంజినీరింగ్‌ కోర్సును రెగ్యులర్‌గా చదివే అవకాశం ఉంది. కొన్ని యూనివర్సిటీలు మాత్రం సాయంకాలం బదులు శని/ ఆదివారాల్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. బిట్స్‌ పిలానీ వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ డిగ్రీని ఆన్‌లైన్‌ పద్ధతిలో అందిస్తున్నారు. ఈ డిగ్రీకి యూజీసీ గుర్తింపు ఉంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌)/ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్స్‌ ఇంజినీర్స్‌ (ఐఈటీఈ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే, ఆ సర్టిఫికెట్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీకి సమానం అవుతుంది. కానీ, ఆ రెండు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని